హిందూ సంప్రదాయంలో రకరకాల క్రతువులు ఉంటాయి. వీటి ప్రాముఖ్యత ఏంటో, ఎందుకు సరైన రీతిలో చేయడం ముఖ్యమో ఈ వ్యాసంలో సద్గురు మనకు చెబుతున్నారు.

ప్రశ్న :  మన దైనందిన జీవితంలో క్రతువులు ముఖ్యమా..?

సద్గురు :  మీకు తగినంత అవగాహన లేనప్పుడు - మీరు క్రతువులను చేసుకోవచ్చు, అందుకై కొన్ని సూచనలను పొందుపరచారు. అన్నిటిలోకి మౌలికమైన స్టాయిలో చేసేవవే ఈ క్రతువులు. ఇది ప్రజలకు కొంతవరకు ఉపయోగపడింది. కానీ మీలో కొద్దిగా అవగాహన పెంపొందినప్పుడు.. మీలో కొంచెం ధ్యానం అన్నది కలిగినట్లైతే.. అప్పుడు క్రతువులకు ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు. కొంతమంది దేని పట్లా ఎటువంటి అవగాహనా కలిగి ఉండరు.  క్రతువులు సృజిండంలోని ఉద్దేశం ఏమిటంటే, అటువంటి వారికి మీరు ఇది.. ఇది.. ఇది.. చెయ్యండి. మీకు కావలసినది జరుగుతుంది అని చెప్పవచ్చు..! ఇది పనులను గుడ్డిగా చేసే ఒక విధానం..!! దీనికి ప్రాముఖ్యత లేదని కాదు, వీటిల్లో కొన్నిటికి ప్రాముఖ్యత  ఉంది.  కానీ,  ఇప్పుడు మీ జీవితంలో మీరు ఓ స్థితికి చేరుకున్నాక, మీకు ఇంత విద్యా, ఇంత అవగాహనా ఉన్నాకా, దీనిని మీరు గుడ్డిగా చేసే బదులు ఎరుకతో చేసుకోవాలి.

తాడుమీద కత్తి సాము చేయడం బాగా వచ్చిన వారికి క్రింద పడకుండా కాపాడే వల అవసరం ఉండదు

ఎవరైతే సాధన చెయ్యడానికి సుముఖంగా ఉండరో, వారికి ఏదో ఒక సహకారాన్నీ, ఉపయోగాన్ని అందించడానికే ఈ క్రతువులు. క్రతువులకున్న పరిమితి ఇదే.. అందం కూడా ఇదే..!  మీకోసం మరొకరు క్రతువులు చేయవచ్చు. మీరు ఎటువంటి సాధనా చెయ్యనక్ఖర్లేదు. మీరు అక్కడ కూర్చుంటే చాలు.. మీకు వాటి వల్ల సత్ఫలితాలు కలుగుతాయి..!  కానీ ఎవరైనా వాటిని మీకోసం చేయాలి. అప్పుడే మీకు దానివల్ల వచ్చే ఫలితం లభ్యం అవుతుంది. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ(ఈశాలో) పంచభూతారాధన చేయలేదు అనుకోండి, అప్పుడు మీకు అది అందుబాటులో లేనట్టే. క్రతువులు అనేవి ఇలాంటివే..!

ఎవరికైతే ఏమీ తెలియదో, వారు కూడా దానినుంచి ఉపయోగం పొందవచ్చు. కానీ ఎవరైతే వాటిని చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు దానిని సరిగ్గా చెయ్యకపోయినా, లేదా అసలు వారు ఆ క్రతువు చెయ్యకపోయినా, మీకది అందుబాటులో ఉండదు. మీ అంతటగా మీరు సాధన చేసుకున్నప్పుడు, సమయం గడుస్తున్నకొద్దీ, దానివల్ల కలిగే ప్రభావం మీరు గమనించవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు