சிறந்த மனிதர்கள், சிறந்த தேசம் – மாணவர்களிடம் உரையாற்றிய சத்குரு

68వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సద్గురు, ఈశా హోమ్ స్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. మహావీర చక్ర పురస్కార గ్రహీత, రేర్ అడ్మిరల్,  ఎస్ కె గుప్తా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సద్గురు: రేర్ అడ్మిరల్, ఎస్ కె గుప్తా గారికి ఇంకా వారి శ్రీమతి గారికి  మా స్వాగతం. ఒక విధంగా ప్రతి మనిషి ఒక అడ్మిరలే , ఎందుకంటే, పెద్దదైనా, చిన్నదైనా - మనం  జీవితమనే నావను నడపాల్సిందే. పెద్దది కొంచెం క్లిష్టంగా అనిపించినా, చిన్న పడవను నడపడం కూడా సాహసంతో కూడిన పనే . ముఖ్యమైన విషయమేమిటంటే, మనం మన పెరట్లో ఉన్న చిన్న కొలనులో  ప్రయాణం చేయబోతున్నామా , లేదా సముద్రంలో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నామా, అన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది. చిన్న పడవపై సముద్ర ప్రయాణం మరింత పెద్ద సవాలుగా మారుతుంది.

ఈ గణతంత్ర దినోత్సవం నాటికి, మన దేశం, నూట ముప్పై కోట్ల జనాభాతో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌక లాంటిది. సాధారణంగా చాలా దేశాలు, ప్రజల  భాష, మతం, జాతి లేదా సంస్కృతి ఒకే లాగా ఉండటం వల్ల  ఏర్పడతాయి. కానీ భారతదేశం అలా కాదు. మన భిన్నత్వాలే మన దేశ నిర్మాణానికి కారణం. ఇది ఈనాటిది కాదు. మనము ఎప్పుడూ ఇలాగే ఉన్నాం. ఈ భిన్నత్వాన్ని కాపాడుకుంటూ, ఒకే దిశలో ముందుకు సాగటం అనేది చాలా పెద్ద సవాలు. 

నేటి బాలలే ఈ దేశానికి రేపటి నౌకాదళాధిపతులు. ఒక అత్యంత గొప్ప ప్రయాణం మొదలు పెట్టాలంటే,  ప్రస్తుతం ఇది మీ శరీరం, బుద్ధి, మేధస్సు , అన్నింటికీ మించి మీ సంకల్పాన్ని బలపరుచుకునే సమయం. ఈ గణతంత్ర దినోత్సవం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే, ఏవైతే కఠినమైన సవాళ్లను మనం తప్పించుకుంటూ వస్తున్నామో, అలాంటి సవాళ్లను అధిగమించడానికి, దేశం గట్టి ప్రయత్నం చేస్తోంది.  ఏదైనా సవాలు ఎదురుపడితే, మనం సాధారణంగా వెనక్కి తిరుగుతాం. కానీ ఇప్పుడు అలాంటి సవాళ్లను ఎదురు కోవాలనుకుంటున్నాం; ఎందుకంటే,  అది దాటాక గొప్ప అవకాశాలున్నాయని  మనకు తెలుసు కాబట్టి. దేశం ఈ సవాళ్ళు ఎదుర్కోవాలంటే, ప్రతి ఒక్కరి కృషి అవసరం.

మనం భారతదేశ వైభవం గురించి మాట్లాడేటప్పుడు చరిత్రని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం - “ఒక్కప్పుడు మన దేశం ఎంతో గొప్పగా ఉండేది”, అంటాము. ఈశా హోమ్ స్కూల్ పిల్లలు ఇంకా  దేశ పౌరులందరూ కూడా, భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడేటప్పుడు, చరిత్ర పరంగా కాకుండా దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఇదే నా కోరిక, ఆశీస్సు.

ఈ రోజున, మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత శక్తివంతంగా, అద్భుతంగా, సమర్ధవంతంగా, దృఢ సంకల్పం గల వారిగా  మారుతారో, దేశం ఇంకా  ప్రపంచం కూడా అలాగే మారుతుంది. గొప్ప దేశాన్ని నిర్మించడం లాంటిది ఏమీ ఉండదు. మీరు కేవలం గొప్ప వ్యక్తులను  తీర్చిదిద్దాలి . మనం గొప్ప వ్యక్తులని తీర్చిదిద్దగలిగితేనే, ఒక గొప్ప దేశం, ఒక  గొప్ప ప్రపంచం సాధ్యమవుతుంది .

Bharata Free Ebook
Editor's Note: Sadhguru looks at the past, present and future of this nation, and explores why this culture matters to every human being on the planet. With images, graphics and Sadhguru’s inspiring words, here’s Bharat as you have never known it!

Download Bha-ra-ta