శివుడి రూపాలను అర్ధం చేసుకుందాం - ఆదియోగి

 

భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు.  ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


ఆదియోగి - మొట్టమొదటి యోగి,  మొట్టమొదటి గురువు

మన సంప్రదాయంలో శివుడ్ని ఒక దేవుడిగా పూజించరు.ఆయన ఆదియోగి అంటే మొట్టమొదటి యోగి,, ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు.ఈయన నుంచే యోగ శాస్త్రం పుట్టింది. దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆ రోజు ఆది యోగి తన మొదటి ఏడుగురు శిష్యులైన సప్తఋషులకు ఈ శాస్త్రాన్ని నేర్పించటం మొదలు పెట్టాడు.

ఇది ఆత్మ సాక్షాత్కారం నుండి ఉద్భవించిన ఓ సమర్పణ . ఇది స్వయానా ఆయన అభివ్యక్తీకరణే .

ఇది అన్ని మతాలు పుట్టక పూర్వమే జరిగింది. మానవత్వం మళ్ళీ అతుక్కోలేని విధంగా విడగొట్టటానికి మనుషులు వేర్వేరు మార్గాలను సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన, శక్తిమంతమైన సాధనాలను అర్ధం చేసుకుని, నేర్పించటం జరిగింది. అది నమ్మశక్యం కానంత అద్భుతం!, అంటే ఆ కాలం మనుషుల్లో ఇంతటి నాగరికత ఉందా! అని మీరనుకోవచ్చు. కానీ ఇది  ఒక నాగరికత నుంచో, ఆలోచనా విధానం నుంచో  వచ్చింది కాదు. ఇది ఆత్మ సాక్షాత్కారం నుండి ఉద్భవించిన ఓ సమర్పణ . ఇది స్వయానా ఆయన అభివ్యక్తీకరణే . ఆయనచెప్పిన దాంట్లో నేటికి కూడా మనం ఏ ఒక్కటీ మార్చలేం ఎందుకంటే ఆయన చెప్పగలిగిన విషయాలన్నీ కూడా  ఎంతో అందంగా , తెలివైన విధంగా చెప్పారు. దాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మీరో జీవితకాలం  గడిపేయొచ్చు !

శివ షడక్షర స్తోత్రం

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు