శివుడి రూపాలను అర్ధం చేసుకుందాం - అర్ధనారీశ్వరుడు

 

భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్ని సద్గురు మనకి వివరించారు. ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


అర్ధనారీశ్వరుడు - ఓ పరిపూర్ణమైనస్త్రీ,ఓ పరిపూర్ణమైన పురుషుడు..!!

సాధారణంగా శివుడ్ని పరమోన్నత పురుషుడిగా సూచిస్తారు కానీ అర్ధనారీశ్వర రూపంలో ఆయనలోని సగభాగం పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక స్త్రీ రూపం ఉంటుంది. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, అంతర్గత పార్శ్వంలోని స్త్రీత్వం- పురుషత్వం కలిస్తే మీరు ఒక శాశ్వతమైన పరమానంద స్థితిలో ఉంటారు. ఇదే మీరు బాహ్యంగా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆనందం శాశ్వతమైనది కాదు.

అంతర్గత పార్శ్వంలోని స్త్రీత్వం- పురుషత్వం కలిస్తే మీరు ఒక శాశ్వతమైన పరమానంద స్థితిలో ఉంటారు.

ఈ ప్రయత్నం వల్ల వచ్చే కష్టాలే మనం రోజువారి చూసే అంతులేని నాటకాలకి కారణం. స్త్రీ, పురుష తత్వాలంటే ఆడవారు, మగవారు అని కాదు. ఇవి కొన్ని లక్షణాలు. ముఖ్యంగా ఇది ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు, ఇది రెండు జీవిత పార్శ్వాలు కలవాలని తపించడం– అంతర్గతంగా, బాహ్యంగా కూడాను. ఇది అంతర్గతంగా మీరు సాధించగలిగితే బాహ్యంగా నూరు శాతం  మీరు కావాలనుకున్నటే జరుగుతాయి. లేకపోతే బాహ్య పరిస్థితులు భయంకరమైన నిర్భందాలవుతాయి.

మీరీ  పరమోన్నత స్థితికి చేరుకున్నపుడు మీలో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు ఉంటుందని సూచనా ప్రాయంగా చెప్పడం.అంటే ఒక నపుంసకుడు అని కాదు –పరిపూర్ణమైనస్త్రీ,పరిపూర్ణమైన పురుషుడని అర్ధం . ఆ స్థితిలోమీరు సంపూర్ణంగా వికసించిన ఓ మనిషి అవ్వగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1