డయాబెటీస్ – ఒక ప్రాణశక్తి సంక్షోభం

డయాబెటిక్స్‌ అందరూ కలిసి ఒక దేశాన్ని ఏర్పరుచుకుంటే, అది ప్రపంచపు మూడవ అతి పెద్ద దేశంగా ఆవిర్భవిస్తుందని మీకు తెలుసా? ఇంటర్‌నేషనల్ డయాబేటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం 2035 నాటికి ఈ ప్రపంచంలో 77.6 కోట్ల మంది డయాబెటిక్స్‌ ఉంటారు. ఇంత భయంకర వేగంతో పెరుగుతున్న ఈ ప్రాణాంతక వ్యాధి యొక్క అసలు కారణం గురించి, దాని నివారణ గురించి సద్గురు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి!
 

దీర్ఘకాలపు వ్యాధులేవైనా, వాటికి మూలకారణం ప్రాణమయ కోశం, అంటే ప్రాణశక్తి పనిచేసే తీరులోనే ఉంటుంది. మీరుంటున్న వాతావరణ పరిస్థితులు, మీరు తింటున్న ఆహారం, మీకున్న సంబంధ –బాంధవ్యాలు, మీ భావావేశాలు, మీ దృక్పధం, ఆలోచనలు, ఉద్దేశ్యాలు, ఇలా అనేక కారణాల వల్ల ప్రాణశక్తి సంక్షోభానికి లోనౌతుంది. అదే శారీరక, మానసిక కలతగా పరిణమిస్తుంది. ఒకసారి ఈ ప్రాణశక్తి కలతకు గురైతే, భౌతిక, మానసిక శరీరాలు కూడా కలతకు లోనౌతాయి. నిజానికి అప్పుడే అది వైద్యపరమైన సమస్య అవుతుంది, అప్పటిదాకా శారీరక సమస్యగా వ్యక్తం కాకపోవడం వల్ల అది వైద్యపరమైన సమస్య కాలేదు.

దురదృష్టవశాత్తూ వైద్యశాస్త్రాలు కేవలం వ్యాధులనే అర్ధం చేసుకుంటిన్నాయి. అవి ఆరోగ్యపు మూల కారణాలను గుర్తించటం లేదు. ఈ అనారోగ్యానికి అసలు కారణం ఏమిటి? దానికి ఆధారం ఏమిటి? అనే వాటిని అవి గుర్తించటం లేదు. మీరు ఈ మధుమేహ (డయాబెటిస్) వ్యాధిగ్రస్తులైతే చక్కెరతో మీకు సమస్య కాదు, మీ పేంక్రియాస్ (క్లోమగ్రంధి) సరిగా పనిచేయడంలేదు, అంతే. మీ శరీరంలో చక్కెరను నియంత్రించే పేంక్రియాస్ సరిగా పనిచేయడంలేదు కాబట్టి, చక్కెర తీసుకోవడం తగ్గించివేయాలి. ఎందుకంటే అలోపతి (ఇంగ్లీష్) వైద్యంలో పేంక్రియాను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు. అందుకేవారు ‘రోజూ షుగర్ చెక్ చేసుకోండి, అవసరం అయితే ఇన్సులిన్ మోతాదు పెంచాలి’ అంటారు. అలోపతి వైద్యం పైపై లక్షణాలనే చికిత్స చేస్తుంది. వైద్యులు మీ వ్యాధి లక్షణాలకే చికిత్స చేస్తారు.

బయటి నుంచివచ్చే బాక్టీరియా వ్యాధులవంటి వాటికి అలోపతి వైద్యం ఎంతో ఉపయోగకరం, అత్యుత్తమం. కాని మనిషి తానుగా లోపల నుంచే తెచ్చుకుంటున్న రక్తపోటు, మధుమేహం, పార్శ్వనొప్పి లాంటి వాటికి అలోపతి వైద్యంలో ఏ విధమైన పరిష్కారం లేదు. ఈ ఆధునిక వైద్యం వ్యాధిని సమర్ధించుకు వస్తుంది. అంతేకాని మిమ్ములను వ్యాధినుండి విముక్తి చేయదు. కేవలం వ్యాధి నియంత్రించడానికి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎంతో డబ్బు , సమయం కేవలం వ్యాధి నియంత్రించడానికే ఖర్చు చేస్తున్నారు. ప్రజలు మానసిక ఒత్తిడిని, రక్తపోటును, మధుమేహాన్ని కేవలం నియంత్రించడంతో సరిపెట్టుకుంటున్నారు. అసలు తమ ప్రాణ శక్తులు ఎలా పనిచేస్తాయో అర్ధం చేసుకోకపోవడం వల్లే ఈ తెలివితక్కువతనం వచ్చింది.

యోగాలో మధుమేహం వ్యాధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాం.

యోగాలో మధుమేహం వ్యాధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాము. దానిని తేలికగా తీసుకోము. అసలు శరీర వ్యవస్థే దెబ్బతింటున్నదని, అందుకే వ్యాధి వస్తున్నదని గుర్తిస్తాము. మనిషి మనిషికీ అది వేరు వేరుగా ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా చికిత్స చేయవలసి వస్తుంది. ఏ వ్యాధి అయినా సరే, శరీరంలో సమతుల్యం తీసుకరావడానికి, ప్రాణశరీరాన్ని ఉత్తేజితం చేయడానికి యోగా ప్రయత్నిస్తుంది. ప్రాణశక్తి వ్యవస్థ సమతుల్యతతో ఉండి శక్తి చలనం సరిగా ఉంటే, శరీరంలోగాని, మనసులోగాని వ్యాధులు ఉండే అవకాశం లేదు. డయాబెటిస్‌ని ఒక వ్యాధిగా కాక, అది శరీరంలోని ప్రాణశక్తి వ్యవస్థ దెబ్బతినడం మూలంగా వచ్చిందని గ్రహించి, దానిని సరిచేయడంవల్ల అది నయమౌతుంది.

అందువల్ల మనుషులు తమ శక్తి వ్యవస్థని బాలెన్స్ చేసుకోవడానికి కొంత యోగసాధన చేస్తే అనేక రకాల దీర్ఘకాలపు వ్యాధుల నుంచీ బయట పడవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు