ధ్యానలింగం లింగాకారంలోనే ఎందుకుంది??
 
 

ప్రశ్న: గురూజీ మీరు ధ్యానలింగం గురించి ఏమైనా చెబుతారా..?

సద్గురు: మొదటిగా, అసలు లింగం అంటే ఏమిటి? లింగం అంటే, ఆదిరూపం లేక మొదటి రూపం. మనం దీనిని ఆదిరూపం అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ సృష్టి అంతా కూడా ఒక్కటే శక్తి అని, అది కోటి విభిన్న రూపాల్లో  వ్యక్తమవుతోందని ఆధునిక శాస్త్రం చెబుతోంది.  మీరు ఏ మతానికి చెందినవారైనా సరే, మీ మతం మీకు దేవుడు అన్నింటా ఉన్నారని చెప్పాయి కదా. దేవుడు అన్నింటా ఉన్నారన్నా, అంతా ఒకటే శక్తి అన్నా అందులో తేడా ఏమైనా ఉన్నదా..?  అది ఒకటే సత్యం. కదూ..?

మీరు ధ్యానంలో ఒక స్థాయిని చేరుకుంటే, మీరు లయం అయిపోవడానికి అంచుల్లో ఉన్నప్పుడు, మీరు తీసుకునే అంతిమ రూపం కూడా ఒక లింగాకారమే.

ఇంకా వ్యక్తం కాని శక్తి, అభివ్యక్తమవ్వడానికి మొట్టమొదటి తీసుకునే రూపం లింగం. లింగం అంటే –  దీర్ఘ వృత్తం. మీకు ఎలిప్సాయిడ్ అంటే తెలుసా..? మీకు ఎలిప్స్ అంటే తెలుసా..?? మూడు కోణాల్లోని (పరిమితుల్లోని) దీర్ఘ వృత్తము, అంటే త్రిమితీయ దీర్ఘ వృత్తము, ఎలిప్సాయిడ్ అవుతుంది. దీని ఆధారం చేసుకొనే లింగం తయారు చెయ్యడం అన్నది వచ్చింది. లింగం అంటే ఒక ఎలిప్సాయిడ్. యోగశాస్త్రాల్లో ఆది రూపం లింగమే, అంతిమ రూపం కూడా లింగమే. మీరు ధ్యానంలో ఒక స్థాయిని చేరుకుంటే, మీరు లయం అయిపోవడానికి అంచుల్లో ఉన్నప్పుడు, మీరు తీసుకునే అంతిమ రూపం కూడా ఒక లింగాకారమే. ఈ సృష్టిలో ఆది రూపం, అంతిమ రూపం లింగమే. 

ఈరోజున ఆధునిక విశ్వ శాస్త్రజ్ఞులు మన నక్షత్ర మండలాల ఫోటోలు తీసి, ప్రతి నక్షత్ర మండల మూలం కూడా ఒక లింగాకారంలోనే ఉందని చెబుతున్నారు.  ఎందుకంటే, మొదటి రూపం ఎల్లప్పుడూ కూడా లింగాకారం లోనే ఉంటుంది.  అలానే, అంతిమ రూపం కూడా లింగాకారమే. మనం లింగం అంటున్నది ఇదే. మరి లింగాకారంలోని ప్రత్యేకత ఏమిటి? లింగం శక్తిని ఎంతో కాలం పట్టి ఉంచుకోగలదు. సరియైన పదార్థంతో చేసిన ఒక లింగాకారాన్ని మీరు  సరియైన అవగాహనతో శక్తిమంతం చేస్తే అది అఖండమైన శక్తికి నెలవవుతుంది. ప్రజలు దీనిని వారి శ్రేయస్సుకి అనేక స్థాయిల్లో ఉపయోగించుకోవచ్చు. ధ్యానలింగం విశిష్టమైనది. ఎందుకంటే ఇందులో ఏడు చక్రాలు కూడా పూర్తిగా అభివ్యక్తమై ఉన్నాయి. ఇది ఒక సజీవమైన మనిషి లాంటిది.  ఇది ఒక ప్రత్యక్ష గురువు శక్తి స్వరూపం. ధ్యానలింగాలయంలో ఎటువంటి క్రతువులుగానీ, పూజలుగానీ, ఎటువంటి సమర్పణలుగానీ ఉండవు. మీరు, అక్కడ కేవలం మౌనంగా కూర్చోవాలి. మీరు, అక్కడ కేవలం మౌనంగా కూర్చుంటే చాలు మీకు ధ్యానం అంటే ఏమిటో తెలియకపోయినప్పటికీ, మీకు ఎవ్వరూ ఒక్క సూచన కూడా ఇవ్వకపోయినప్పటికీ, మీరు, ధ్యానపరులౌతారు. ఇది ఎంతో శక్తిమంతమైన ప్రదేశం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1