దక్షిణ కైలాసం

వెల్లంగిరి పర్వతాలను దక్షిణ కైలాశ్ అని అంటారు ఎందుకంటే ఆదియోగి అయిన శివుడు తానే ఇక్కడ ఈ పర్వత శిఖరాల మీద మూడు నెలలు పైగా గడిపారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సహజంగా ఉండే ఆనంద మనస్సిత్థిలో లేరు;
 

నా పసితనం నుంచీ నా కళ్ళలో ఎప్పుడూ పర్వతాలు ఉండేవి. నాకు పదహారేళ్ళ వయసు వచ్చిన తరువాత నా స్నేహితులతో దీని గురించి మాట్లాడితే, ‘నీకేమైనా పిచ్చా! ఇక్కడ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?’ అని అన్నారు వాళ్ళు. అప్పుడే నాకు తెలిసింది నా కళ్ళలో తప్ప వేరెవరి కళ్ళలో ఆ పర్వతాలు లేవని.

మీ కళ్ళజోడు మీద ఒక చిన్న చుక్క ఉందనుకోండి కొద్ది సమయం తరువాత మీకది అలవాటై పోతుంది. ఇది కూడా అలాంటిదే అయ్యింది. ఆ తరువాత ఎప్పుడో జ్ఞాపకాలు అన్నీ వరదగా వచ్చినప్పుడు, నేను ధ్యానలింగాన్ని ప్రతిష్టించటానికి ఒక స్థలాన్ని వెతుకుతున్నపుడు, నేను నా కళ్ళలో ఉన్నఆ ప్రత్యేకమైన పర్వత శిఖరాల కోసం వెతకటం మొదలు పెట్టాను.

నేను బైక్ మీద ఒక మలుపు తిరిగినప్పుడు, నాకు వెల్లంగిరి పర్వత శ్రేణిలోని ఏడోవ పర్వతం కనిపించింది

నేను అంతా వెతికి చూసాను. నేను గోవా నుంచి కన్యాకుమారి వరకూ, ముందుకీ వెనక్కీ నాలుగు సార్లైనా తిరిగాను. అవి కచ్చితంగా పశ్చిమ కనుమలలోనే ఉన్నాయని నాకు ఎలాగో నమ్మకం కలిగింది. కార్వార్ నుంచి కర్నాటక దగ్గర కేరళ సరిహద్దు వరకూ ప్రతీ రోడ్డూ, మట్టి రోడ్డూ కూడా వదలకుండా నేను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాను.

ఒకసారి అనుకోకుండా కోయంబత్తూరు దగ్గర ఉన్న ఒక పల్లెటూరికి వచ్చాను. నేను బైక్ మీద ఒక మలుపు తిరిగినప్పుడు, నాకు వెల్లంగిరి పర్వత శ్రేణిలోని ఏడోవ పర్వతం కనిపించింది – నా చిన్నతనం నుంచీ నేను చూస్తూ ఉన్న పర్వతం నా కళ్ళ ఎదుటే నిలిచింది. ఆ రోజు నుంచీ అవి నా కళ్ళలో నుంచి మాయం అయిపోయాయి.

వెల్లంగిరి పర్వతాలను దక్షిణ కైలాశ్ అని అంటారు ఎందుకంటే ఆదియోగి అయిన శివుడు తానే ఇక్కడ ఈ పర్వత శిఖరాల మీద మూడు నెలలు పైగా గడిపారు.

వెల్లంగిరి పర్వతాలను దక్షిణ కైలాశ్ అని అంటారు ఎందుకంటే ఆదియోగి అయిన శివుడు తానే ఇక్కడ ఈ పర్వత శిఖరాల మీద మూడు నెలలు పైగా గడిపారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సహజంగా ఉండే ఆనంద మనస్సిత్థిలో లేరు; వారి మీదే వారే కోపంగా ఉన్నారు ( ఆయన ఒక స్త్రీకి ఇచ్చిన మాట నిలుపుకోలేనందుకు). ఆయన ఎంతో తీవ్రతతో ఉన్నారు, ఆ శక్తి నేడు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది; అది కోపంలాంటి తీవ్రత కలిగిన యోగుల పరంపరకు జన్మనిచ్చింది. వాళ్ళు ఇక్కడ కూర్చుని సాధన చేసి అటువంటి గుణాన్నే పొందారు. వారు ప్రత్యేకంగా దేని మీద కోపంగా ఉండేవారు కాదు, కానీ కేవలం అలా కోపంగా ఉండేవారు.

ఈశాకు ముఖ్యమైన ఒక యోగి సద్గురు శ్రీ బ్రహ్మ, ఆయన ఇరవైయ్యో శతాబ్దం మొదట్లో జీవించారు. అన్నిటినీ మించి ఈ పర్వతం మనకు ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే నా గురువు ఇక్కడే మహాసమాధి చెందారు. యోగ సంప్రదాయంలో ఈ పర్వతం మాకు ఒక దేవాలయం లాంటిదే. ఇది దివ్యత్వ జలపాతం, ఇది ఒక కృపా జలపాతం.

‘ఈ భూమి మీద అన్నిటి కంటే గొప్ప పర్వతం ఏది?’ అని మీరు నన్నడిగితే, నేను ఎప్పుడు ‘వెల్లంగిరి’ అనే జవాబిస్తాను ఎందుకంటే నాకు సంబంధించినంత వరకూ ఇవి కేవలం పర్వతాలు మాత్రమే కావు. నా కళ్ళలో వీటి ముద్రణతో నేను జన్మించాను, అవి అప్పటి నుంచీ నన్ను వెంటాడాయి. అవి నాలోనే జీవించాయి, అవి నాకు దిక్సూచిగా నిలిచాయి. అది నా సొంత GPS అన్నమాట. ఈ పర్వతం నాకు ఒక రాళ్ళ కుప్ప కాదు; ధ్యానలింగాన్ని ఏర్పరచడానికి నేను తెలుసుకోవలిసిన వాటన్నిటినీ అందించిన జ్ఞాన భాండాగారం ఇది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
 
 
 
 
Login / to join the conversation1
 
 
4 సంవత్సరాలు 5 నెలలు క్రితం

Shiva shambho shambho

4 సంవత్సరాలు 5 నెలలు క్రితం

shiva shambho shambho