చిదంబరం – శూన్యానికి క్షేత్రం

 

ఈ గ్రహ వ్యవస్థలో వచ్చే చిన్న మార్పుల్ని గుర్తించడం ద్వారా, మన పూర్వీకులు కేవలం వాళ్ళ సంక్షేమానికే కాకుండా, ఒక ఉన్నత ప్రమాణాన్ని అందుకోవడానికి ప్రయత్నించారు. ఈ భూఅయస్కాంత విషువత్ రేఖ(magnetic equator) మనదేశం లోంచి పోతుంది. కొన్నివేల సంవత్సరాలకు పూర్వం యోగులు ఈ విషువత్ రేఖ ఎక్కడెక్కడి నుండి పోతుందో ఖచ్చితంగా లెక్కలు గట్టి, దాని వెంబడి గొలుసుకట్టుగా కొన్ని దేవాలయాలను ప్రత్యేక కారణాలకు నిర్మించారు. దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి వహించిన దేవాలయాల్లో చిదంబరం ఒకటి. అది ఆధ్యాత్మిక కైవల్యం ఆశించిన వారి కోసం నిర్మించబడ్డది. అది నిర్మించినపుడు సరిగ్గా ఈ అయస్కాంత విషువత్ మీదనే ఈ దేవాలయం కట్టబడింది. (ఇప్పుడు అది కొద్దిగా పక్కకి జరిగింది). ఎంతో మంది ఆధ్యాత్మిక శోధకులు గతకొన్ని శతాబ్దాలుగా చిదంబరంలో భూమి ఒక ప్రత్యేకమైన దిశలో ఉన్నప్పుడు సమావేశమయ్యేవారు.

ఈ దేవాలయం నిర్మించినపుడు, అయస్కాంత విషువత్ రేఖ ఈ అక్షాంశంతో కలిసి ఉండేది. అది చాలా అరుదైన సంఘటన.

ఈ దేవాలయంలో యోగ శాస్త్రానికి పితామహుడైన పతంజలి “శూన్యానికి" ఒక గుడిని  నిర్మించారు. శూన్యం అంటే "ఖాళీ" లేదా "ఏమీ లేకపోవడం" అని అర్థం. ఇది కేవలం ప్రతీక కాదు. అయస్కాంత విషువత్తు మీద ఉత్తరానికి గాని, దక్షిణానికి గాని లబ్ధశక్తులు "లాగడం" (pull ) ఉండదు. ఇక్కడ అయస్కాంత ప్రభావం సున్నా. ఇది ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో ఒక సంతులతని, నిర్వికారాన్ని (balance or equanimity) అందిస్తుంది. ఈ నిర్వికారం ఈ భౌతిక ప్రపంచ పరిమితుల నుండి విడివడడానికి సాధకుడికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగ పడుతుంది. (ఇక్కడ అయస్కాంత విషువత్ రేఖ, భూమధ్య రేఖ ఒకటి కావన్నది గుర్తుపెట్టుకోవడం ముఖ్యం).

చిదంబరం యొక్క అదనపు ప్రాముఖ్యత అది 11 డిగ్రీల అక్షాంశం మీద ఉండడం. ఈ దేవాలయం నిర్మించినపుడు, అయస్కాంత విషువత్ రేఖ ఈ అక్షాంశంతో కలిసి ఉండేది. అది చాలా అరుదైన సంఘటన. ఈ ప్రదేశ ప్రాముఖ్యత ఏమిటి? ఈ అక్షాంశం దగ్గర భూమి వంగిన కోణంలో, భూమియొక్క పరాజ్ఞ్ముఖ శక్తులు దాదాపు నిటారుగా బయటకు తోసుకుని వెళుతుంటాయి. అది, మనిషి శారీరక వ్యవస్థలోని శక్తుల్ని కూడా ఊర్ధ్యముఖంగా తీసుకెళతాయి. అంటే, సాధకుడి ఆధ్యాత్మిక ప్రయాణ గమ్యానికి ప్రకృతి సహజ సిద్ధంగా సహకరిస్తోందన్నమాట. సాధకులకి ఇది చాలా గొప్ప ప్రేరణనిచ్చే విషయం గనుక, ఈ ప్రాంతమంతటినీ పవిత్రంగా భావించేవారు.(ఈషా యోగా కేంద్రాన్ని దక్షిణ భారతదేశంలో సరిగ్గా 11 డిగ్రీల అక్షాంశం మీద నిర్మించడం కాకతాళీయం కాదు).

ఈ దేవాలయం నిర్మించినపుడు, అయస్కాంత విషువత్ రేఖ ఈ అక్షాంశంతో కలిసి ఉండేది. అది చాలా అరుదైన సంఘటన.

పైన ఉదహరించిన అధ్యాత్మిక ప్రక్రియ, ప్రకృతిలో జరిగే అసాధారణ సంఘటనలను మానవ ఆధ్యాత్మిక వికాసానికి సహకరించేట్టుగా ఉపయోగించుకుంటుంది. మరొక ప్రక్రియ, ధ్యానం లేదా అంతర్లోచనం, సృష్టిలో జరుగుతున్న మార్పుల్ని పూర్తిగా విస్మరించి, కేవలం లోపలి ప్రయాణం మీదే దృష్టిసారిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి రెండు మార్గాలు అనుసరించవచ్చు: మీరు నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటిగా, మీకు లభ్యమయే ప్రకృతి సిద్ధమైన సహకారాన్ని అందుకుంటూ, అంచెలంచెలుగా అనుసరించవచ్చు. లేదా, ఈ అంచెలన్నిటినీ పక్కనబెట్టి, లోపలికి ఒక దూకు దూకవచ్చు. రెండవరకమైన ప్రయత్నంలో, మీరు బాహ్యములైన అన్ని జీవిత సందర్భాల నుండి తిరోముఖులవ్వాలి. మొదటి మార్గం అయితే వాటిలో లీనమై ఉండడం తప్పనిసరి. ప్రతి మనిషికీ, తన స్వభావానికి అనుగుణమైన మర్గాన్ని ఎంచుకునే స్వాతంత్య్రం ఉంది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ రెండిటికీ మధ్య సమతౌల్యాన్ని పాటించడం ఉతమోత్తమం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు