ప్రశ్న: సద్గురు, జీవితంలో మార్పు అంత  కష్టంగా ఎందుకు ఉంటుంది? నా చిన్నప్పుడు నేను ఎప్పుడు మార్పు కోరుకుంటూ ఉండేదాన్ని. మార్పు వచ్చినప్పుడు, నాకు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ నేను పెద్దవుతున్న కొద్దీ, ఎంతవరకు సాధ్యమైతే అంత వరకు మార్పు లేకుండా ఉండేలా చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను మార్పుని తీసుకోలేకపోతున్నాను కాబట్టే. ఇదంతా మార్పుని ఎవరు తీసుకొస్తున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా? మార్పుకి మనం ఎలా ప్రతిస్పందించాలి అన్నది ఏమైన ఉందా సద్గురు..? 

సద్గురు : ఈ మార్పు అనేది వయసుతో పాటు ఎందుకు కష్టంగా మారిపోతుంది అంటే, మీరు 'మీ సౌకర్యం' అనే ఒక గూడుని ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఈ సౌకర్యం కొంచెం సడలినా సరే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ చిన్నప్పుడు, మీరు మీ సౌకర్యం కోసం చూసేవాళ్ళు కాదు, మీరు జీవితం కోసం చూస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు జీవితం కోసం చూడటంలేదు. మీరు సౌకర్యం కోసం, సేఫ్టీ కోసం చూస్తున్నారు. మీకు పదహారు, పదిహేడు ఏళ్ళు ఉన్నప్పుడు, 'జీవితంతో ఏం చేయాలి?'  అని మీరు ఎన్నో కలలు కంటూ ఉండేవారు. మీకు పాతిక సంవత్సరాలు వచ్చేసరికే  మీరు అవన్నీ మానేసి ఇవన్నీ కుదిరే పని కాదు నేను ఇప్పుడు ఎక్కువ ప్రాక్టికల్గా మారాను అనుకోడం మొదలుపెట్టారు. కానీ నిజానికి జరిగిందేమిటంటే, మీరు పిరికివారుగా తయారయ్యారు. కానీ నేను ప్రాక్టికల్గా అయ్యాను అని అనుకోవడం మొదలుపెట్టారు. మీరు ఇలా ఎన్నో పనులు చేయడం మానేశారు. 'నేను ఈ ఉద్యోగం చేస్తే, నేనే సంపాదిస్తే, నేను ఈ పనులు చేస్తే చాలు' అని అనుకోవడం మొదలుపెట్టారు. మీకు ముప్పయి ఐదు సంవత్సరాలు వచ్చేసరికే నాకు ఎలాంటి సమస్యలు రాకపోతే అది చాలు అనుకునే పరిస్థితికి వచ్చేసారు. మీరు ఏదో గొప్పగా జరగాలని ఏం కోరుకోవటం లేదు.

నాకు ఎలాంటి సమస్యలు కలగకుండా ఉంటె చాలు అని అనుకుంటున్నారు. కానీ అలా అనుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ రావడం మొదలౌతాయి.

నాకు ఎలాంటి సమస్యలు కలగకుండా ఉంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ ఆలా అనుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ రావడం మొదలౌతాయి. మీరు జీవితాన్ని ఉత్సాహంతో చూడటం లేదు. మీరు జీవితాన్ని ఒక రకమైన భద్రతా భావంతో చూస్తున్నారు. ఎప్పుడైతే మీరు ప్రతిదాన్ని ఇంత భద్రతా భావంతో చూడటం మొదలుపెడతారో మీకు ఏచిన్న మార్పు కలిగినా సరే,  మీరు అంతలాగా దానివల్ల మీ శాంతిని కోల్పోతున్నారు. ఈ భౌతికత సారాంశం మార్పు. అంతే కదా ..అవునా కాదా? ప్రతిదీ మారిపోతోంది. మారనిది అనేది ఏదయినా ఉందా? ఈ సృష్టిలో ప్రతిదీ మారిపోతూనే ఉంది కదూ. ఈ భౌతికమైనది ఎప్పుడూ మారిపోతూనే ఉంది. ఈ భౌతికమైన దానికి సారమే మార్పు. మీరు 'ఎంతో స్థిరంగా ఉండేది' అనుకున్నది కూడా అనునిత్యం మారిపోతూనే ఉంటుంది. మీరు మార్పుని ప్రతికూలిస్తున్నారు అంటే, మీరు జీవితాన్ని ప్రతికూలిస్తున్నారని అర్ధం. మీకు అసలు మారని  జీవితం కావాలి అంటే ఉన్నది ఒకే ఒక అందమైన ప్రదేశం. అదేమిటంటే అది మీ సమాధి. మీకు మార్పు వద్దు అంటే, మీరు మీ సమాధికైనా చేరుకోవాలి, లేదా మీరు జ్ఞానోదయమైన పొందాలి. అప్పుడు అంతా  ఒకటే.

కానీ మీరు ఈ భౌతికతలో, ఈ సృష్టిలో ఒక భాగంగా ఉన్నంతసేపు ప్రతిదీ మారుతూనే ఉంటుంది. మార్పు చెందనిది అంటూ ఏది ఉండదు. ఈ క్షణంలో  మీరు ఊపిరి తీసుకుంటున్నారు, మరో క్షణంలో మీరు ఈ శ్వాసను వదిలేస్తున్నారు. ఇది  మార్పే కదూ! మీకు మార్పు వద్దు అంటే అన్నీ చేయడం మానేయండి. మీరు మార్పుని ప్రతికూలిస్తున్నారు అంటే మీరు జీవితాన్ని ప్రతికూలిస్తున్నారని అర్ధం. మీరు జీవితాన్ని మాత్రమే కాదు ఎంతో మౌళికమైన జీవిత ప్రక్రియను కూడా మీరు వద్దు అనుకుంటున్నారని అర్ధం. దీనివల్ల అన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీరు జీవించి ఉండగానే  మీరు మరణించాలనుకుంటున్నారంటే  అప్పుడు అది సమస్యే కదా. మీరు జీవించి ఉన్నప్పుడు మీరు సంపూర్ణంగా జీవించాలి. మీరు చనిపోవాలనుకుంటే అది సంపూర్ణంగా చేయాలి. ఇది మీరు చనిపోవాలనుకుంటూ సరిగ్గా  చేయకపోవడం, కదూ. ఇప్పుడు అసంతృప్తిగా ఉండడం, సంతోషం లేకుండా ఉండడం అనేవి మరణాన్ని సరిగ్గా  చేరుకోలేకపోవడమే కదా ..!. కనీసం ఇది బాగా చేయండి. నేను మీరు మరణించడానికి పది రకాల మార్గాలను చూపించగలను. ఎలాగూ హుస్సేన్ సాగర్ ఉండనే ఉంది.

మీరు ఓ విషయం అర్ధం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మార్పుని ప్రతిఘటిస్తున్నారో మీరు అప్పుడు ఈ జీవన ప్రక్రియనంతా ప్రతిఘటిస్తున్నట్టే. దీనివల్ల మీకు అనవసరమైన బాధ ఏర్పడుతుంది. ఒకసారి మీరు ఈ మార్పుని ప్రతిఘటిస్తే నిరాశ, నిస్పృహ అన్నవి ఏర్పడుతాయి. మార్పు కలిగిన వెంటనే నిరాశ, ఆ తరువాత నిస్పృహ.

మీకు మీరే ప్రతికూలంగా పని చేసుకోవడం అంటే ఇదే. ఒకసారి నిరాశ వచ్చింది అంటే సహజంగా ఇది నిస్పృహగా  మారిపోతుంది.

ఈ నిరాశ, నిస్పృహ అనేవి ఎలాంటివో చూద్దాం.  ఒకరోజున ఒక దెయ్యం రిటైర్ ఐపోవాలని కోరుకుంది. సరే అది రిటైర్ ఐపోతుంది కాబట్టి తన దగ్గర ఉన్న పనిముట్లు అన్నీఅమ్మేద్దాం అనుకుంది. అందుకని డిస్కౌంట్లో  అమ్మకాలు మొదలు పెట్టింది, అక్కడ చాలా రద్దీ ఏర్పడింది. తన దగ్గర ఉన్న పనిముట్లు కోపం, ఈర్ష, ద్వేషం ఇవన్నీ అమ్ముతోంది. అందరూ వెళ్లి అవన్నీ కొనుక్కోవటం మొదలుపెట్టారు. క్షణాల మీద అన్నీ అమ్ముడైపోయాయి, అన్ని పనిముట్లునూ. ఎందుకంటే మొత్తం మానవాళి అంతా అది కొనేసుకుంది కదా. సరే, ఆ దయ్యం దగ్గర ఇంకో సంచి ఉంది. సరే లీనా (ఓ పార్టిసిపంట్) వెళ్లి ఆ దెయ్యాన్ని అందులో ఏముంది అది అమ్మడం లేదా అని అడిగింది? లేదు,లేదు... ఎందుకంటే ఇవి నేను అట్టిపెట్టుకోవాలనుకుంటున్నాను. అవి చాలా బాగా పని చేస్తాయి నా పని చేయడానికి ఎపుడైనా అవసరం అవుతాయని అట్టిపెడదామనుకుంటున్నాను. అప్పుడు లీనా 'లేదు, అది కూడా అమ్మండి' అని అంది. అప్పుడు ఆ దెయ్యం 'లేదు,లేదు ఈ రెండు పనిముట్లు ఇందులో ఉన్నవి అవి ఎంత బాగా పని చేస్తాయి అంటే నేనవి అట్టిపెట్టుకోవాలనుకుంటున్నాను'.  సరే ఓసారి లీనా చెప్పగానే మిగతా అందరు అక్కడ చేరుకొని 'లేదు,లేదు,  అవి కూడా అమ్మేయండి, అవి కూడా అమ్మేయండి,' అని అడిగారు. అప్పుడు ఆ దెయ్యం అవి తీసి 'సరే మీరు నాకు మంచి ధర ఇస్తే  నేను మీకు అమ్ముతాను' అని అంది. అప్పుడు నిరాశ, నిస్పృహలని తీసి టేబుల్ మీద పెట్టింది. ఈ రెండు దెయ్యానికి ఎంతో బాగా పని చేసే పనిముట్లు. ఇవి మీ జీవితాన్ని ఎంతగా నాశనం చేయాలో అంతగా నాశనం చేసేస్తాయి.

మీరు నిరాశతో మొదలు పెడతారు దీన్ని నిస్పృహగా మార్చుకుంటారు. ఇంక మీ పని ఐపోయినట్టే. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏది లేదు. మీకు మీరే ప్రతికూలంగా పని చేసుకోవడం అంటే ఇదే. ఒకసారి నిరాశ వచ్చింది అంటే సహజంగా ఇది నిస్పృహగా  మారిపోతుంది. అందుకని మీరూ దీన్ని అమ్మేసేయండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు