ప్రశ్న: నేను విన్న ఒక జెన్ కథ ఉన్నది. ఒకప్పుడు రెండు పక్క పక్కన జెన్ మఠాలు ఉండేవి.

ఆ రెండింటిలోనూ కొత్తగా చేరిన సన్యాసులు ఉండేవారు. ప్రతిరోజూ మార్కెట్ కు వెళుతూ ఒక బాలుడు, మరొక బాలుడితో కలిసేవాడు.

అతను ‘నువ్వు ఎక్కడికి వెళుతున్నావు’ అని అడిగాడు. రెండవవాడు ‘గాలి ఎటు వీస్తే అటు’ అన్నాడు. మొదటి వాడికి ఈ సమాధానం కొత్తగా అనిపించింది.

తన గురువు గారితో ఈ విషయం చెప్పి, అతను సహాయం కోరాడు. అప్పుడు ఆ గురువు గారు ‘రేపు ఉదయం ఆ కుర్రవాడిని కలిసినప్పుడు, అదే ప్రశ్న అడుగు, గాలి వీయకపోతే ఏం చేస్తావు? అని అడుగు’.

దానికి అతను సమాధానం ఇవ్వలేడు. అని చెప్పాడు వారు మళ్ళీ మరునాటి ఉదయం కలిశారు.

మొదటి పిల్లవాడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని మళ్ళీ అడిగాడు. ‘కాళ్ళు ఎక్కడికి తీసుకు వెళితే అక్కడికి’ అన్నాడు రెండో పిల్లవాడు.

ఈ ప్రశ్నకి మళ్ళీ మొదటి పిల్లవాణ్ని చిక్కులో పెట్టింది. అందుకే ఆయన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు గురువు గారు‘మరి నీకు కాళ్ళు లేకపోతేనో' అని అడగ మన్నాడు.

మర్నాడు ఉదయం మూడో సారి మొదటి పిల్లవాడు ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు’ అని అడిగాడు రెండవ పిల్లవాడు ‘మార్కెట్ కి’ అన్నాడు. దాంతో మొదటి పిల్లవాడు మళ్ళీ ఖంగుతిన్నాడు.

ప్రశ్న: దీనికి వివరణ ఇవ్వబడింది. మారుతున్న కాలంతో మనం మారుతూ ఉంటే, మనం ఎంత మారితే, మనం అంత దూరం వెళ్లి పోతాము. ఈ మార్పులను మనం మారకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం మారగలిగే విధానాలు కొన్నే ఉంటాయి. కానీ మనం ఉన్న రీతిలో ఉండగలిగే విధానాలు కోకొల్లలు. మనం మారే విధానాలు కొన్నే ఉన్నప్పుడు, మనం మారకుండా ఒకేలా ఉండే విధానాలు లెక్కలేనన్ని.

సద్గురు: దేనికైనా మీరు మరీ ఎక్కువ వివరణ ఇస్తే, దానిలో ఏమీ మిగలదు. దాని నుంచి మీరు ఒక నీతిని తెలుసుకోలేరు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఖచ్చితమైన సమాధానం ఇవ్వడం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే సరైన రీతిలో ఉండగలగటం.

మనం ఒక పరిస్థితికి ఎలా స్పందిస్తామన్నది, ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది. మనం ముందుగానే పరిస్థితుల గురించి ఊహించుకుని ఎలా సమాధానం ఇవ్వాలో తయారుగా ఉంటే, అప్పుడు పరిస్థితులు మారిపోతే, మీ సమాధానం పరిస్థితికి తగ్గట్టుగా ఉండదు. మనం చేసేది మనం ఉన్న పరిస్థితిని బట్టి ఉండాలి. అక్కడ సరైన సమాధానం, తప్పుడు సమాధానం అంటూ ఏమీ ఉండదు. అక్కడ ఉన్నది తగిన సమాధానం. అలాగే తగిన ప్రతిక్రియ.

తప్పు-ఒప్పు అంటూ ఏమీ లేదు. అక్కడ ఉన్నది జీవానికి తగినది, అంతే. మీకు జీవితానికి సంబంధించి తగినది ఏదో అర్థమైతే, మీరు దానిని సరిగా వ్యవహరించగలరు.

మనమేం చేసినా, అది ఆ పరిస్థితికి అనుగుణంగా లేకపోతే అది అర్థం లేనిది అవుతుంది. కానీ మామూలు బుర్రలు, ఒక సామాన్యమైన బుర్ర ఎప్పుడూ ఏమంటుందంటే, అక్కడ సరైనది, కానిది, అంటూ రెండు విషయాలు ఉంటాయి అంటుంది. తప్పు-ఒప్పు అంటూ ఏమీ లేదు. అక్కడ ఉన్నది జీవానికి తగినది, అంతే. మీకు జీవితానికి సంబంధించి తగినది ఏదో అర్థమైతే, మీరు దానిని సరిగా వ్యవహరించగలరు. మీరు జీవానికి సరైనది ఏంటో తెలుసుకోలేకపోతే, మీరు తయారుగా ఉన్న సమాధానాలతో, పరిష్కారాలతో ఉంటారు. అవి మిమ్మల్ని భంగ పరుస్తాయి.

ప్రశ్న: ఈ తయారుగా ఉన్న సమాధానాలు తయారు పరిష్కారాలు గురించి మీరు ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా? సద్గురు: నీతులకు, చైతన్యానికి చాలా తేడా ఉన్నది. నీతి అనేది, మీకు తయారుగా ఉన్న సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. అయితే నిర్ధారణలతో ఉన్న మనస్సు, వాస్తవాలకు దూరంగా ఉంటుంది. అది సజీవంగా ఉండాలంటే, ఎరుకతో ఉండాలి, అది నిర్ధారణలతో ఉండకూడదు.

ఆధ్యాత్మిక ప్రక్రియలోని సారాంశం ఏమిటంటే, మీరు నిర్ధారణలు చేయటం లేదు. మీరు కేవలం అన్వేషణ చేస్తున్నారు.

ఆ పిల్లవాడు ఎప్పుడైతే ‘గాలి ‘కాళ్లు ‘లేదా మార్కెట్’ అని సమాధానాలు ఇచ్చాడో, ఈ పిల్లవాడికి ఏమి చెయాలో తెలియలేదు. ఎందుకంటే ఇతని మనసులో అప్పటికే కొన్ని నిర్ధారణలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రక్రియలోని సారాంశం ఏమిటంటే, మీరు నిర్ధారణలు చేయటం లేదు. మీరు కేవలం అన్వేషణ చేస్తున్నారు. ఒక జెన్ సన్యాసి జీవితం అంటే జీవితమంతా అన్వేషించటమే. అన్వేషణ అనేది నిర్ధారణ లేనప్పుడే వీలవుతుంది. ఒకరు ఆస్తికులు, మరొకరు నాస్తికులు - అంటే వారిద్దరూ అప్పటికే నిర్ధారణలు చేసుకున్నారు. ఇటువంటి నిర్ధారణలు రెండు వర్గాల మధ్య లేక ఇద్దరి మధ్య వైరానికి దారితీస్తాయి.

మనం ఏదైనా వెతుకుతున్నట్లయితే, మనం చేయవలసిన మొదటి అతి ముఖ్యమైనది ఏమిటంటే, మీరు ఒక అద్దంలా ఉండటం. మీరు పరిస్థితికి ఒక అద్దంలా మారి, ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. దానివల్ల మీరు పరిస్థితికి తగ్గట్టుగా నడచుకోగలరు. ప్రపంచంలో కూడా విజయానికి ఆధారభూతమైనది ఇదే. ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా విజయాలు మీకు ఎప్పుడు వస్తాయంటే, అప్పటి పరిస్థితిని మీరు బాగా, ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగినప్పుడు. మీరు ఎప్పుడైతే మీ మనస్సులో ఒక నిర్ధారణ చేశారో, మీరు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడలేరు. మీరు పూర్తిగా గురితప్పుతారు.