భారతదేశంలో ప్రతీ సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇది భారత మొట్టమొదటి ప్రధాన మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రు గారి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీ పిల్లలతో సరదాగా, ఆరోగ్యకరంగా ఇంకా మీ సంబంధ బంధవ్యాలను బలోపేతం చేసే విధంగా ఉండే ఐదు గొప్ప ఆక్టివిటీస్ మీ కోసం.

#1 కృత్రిమ జీవన పథం నుండి ప్రకృతి ఒడిలోకి

5-Awesome-Activites_for-you-and-your-kids-01

మీ పిల్లలను ఒక పార్క్ కు తీస్కువెళ్లండి, అక్కడ స్వచ్ఛమైన గాలిని పీల్చండి ఇంకా కాసేపు ఎండలో ఉండండి. అక్కడ మీరూ, మీ పిల్లలూ వ్యాయామం చేయండి, సరదాగా గడపండి. ఈ విధంగా మీ ఇంటి కాంక్రీట్ గోడల నుంచి కాసేపు బయటకు రండి. కాలుష్యం లేని ప్రదేశంలో, కొంత శారీరిక శ్రమ చెయ్యడం, శారీరిక ఆరోగ్యం ఇంకా పునరుజ్జీవనంపై చాలా అద్భుతమైన ప్రభావం చూపుతుంది. దీన్ని గురించి సద్గురు ఇలా అన్నారు:

సద్గురు: మీరు ఏ విధమైన గాలిని పీలుస్తున్నారో అది చాలా ముఖ్యం, కానీ మీరు ఎలా ఊపిరి పీల్చుకుంటున్నారో, ఎంత స్పృహతో ఊపిరి పీల్చుకుంటున్నారో కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉండేవారు, ఎలాంటి గాలిని పీల్చుకుంటున్నారో, ఎల్లప్పుడూ అది మీ చేతుల్లో ఉండకపోవచ్చు, కాబట్టి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు, మీకు అందుబాటులో ఉన్న ఏదైనా సరస్సు లేదా నది వెంట లేదా పార్కులో నడవడం మంచిది. మీకు పిల్లలు ఉంటే, నెలలో ఒక్కసారైనా, మీరు వారిని నగరం నుండి దూరంగా తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ప్రకృతి సహేతుకంగా స్వచ్ఛమైన స్థితిలో ఉంటుంది. అక్కడ మీ పిల్లలు ఒక చిన్న కొండను ఎక్కవచ్చు, అడవిలో నడవచ్చు లేదా ఒక నదిలో ఈత కొట్టచ్చు, ఈ విధంగా శ్వాస శక్తిశీలంగా ఉండే చోట ప్రకృతితో సన్నిహితంగా ఉండటానికి లేదా ఏదైనా ఆక్టివిటి చెయ్యడానికి అలా నగరం బయటికి వెళ్లడం చాలా ముఖ్యం.

ఇది శ్వాసతో కూడిన వ్యాయామం కోసం మాత్రమే కాదు. ఇక్కడ శరీరం లోపలకి ఇంకా బయటకి గాలి యొక్క నిరంతర మార్పిడి ఉంటుంది. శరీరంలోని మేధస్సు, గాలి స్వచ్ఛంగా, సజీవంగా ఉన్నట్లు గ్రహించినప్పుడు, శరీరం శ్వాసించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ గాలి మార్పిడితో, వ్యవస్థ లోపల ప్రక్షాళన జరుగుతుంది. మీరు స్వచ్ఛమైన గాలిలో ఉన్నట్లయితే, కొంత శారీరిక శ్రమతో శ్వాసను శక్తిశీల స్థితికి తీసుకురావడం ముఖ్యం. మీరు ఎదో చాలా కఠినమైన పనిని చేయనవసరం లేదు - కాసేపు కొంచెం లోతుగా శ్వాస తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది శరీర సమగ్రతను ఇంకా బలాన్ని బాగా పెంచుతుంది.

#2 బాలల దినోత్సవ వంటకాలు చేయండి

ఈ రోజుల్లో ఆహారం, రుచి ఇంకా వాణిజ్యం అన్నీ కలిసి మీద పడడంతో, పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఆహారం విషయంలో ఆరోగ్యం కంటే రుచినే ఎంచుకుంటున్నారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, రుచికరమైన ఆహారం కూడా కావచ్చు. క్రింద ఇవ్వబడిన రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల్లో ఒక వంటకాన్ని సిద్ధం చేయడానికి కొంత సమయం కేటాయించండి, మీ పిల్లలకు ఈ సందర్భంగా ప్రత్యేక వంటకం చేసి పెట్టండి.

5-Awesome-Activites_for-you-and-your-kids-02

రాగి లడ్డు

రాగి, వేరుశెనగ ఇంకా వెన్నతో బిస్కెట్లు

ఖర్జురంతో రుచికరమైన స్నాక్

#3 కలిసి పుస్తకాలు చదవండి

5-Awesome-Activites_for-you-and-your-kids-03

పఠనం వల్ల అనేక ప్రయోజనాలను ఉన్నాయి. అభిజ్ఞా క్షీణత మందగించడం, ఒత్తిడిని తొలగించడం, జ్ఞాపకశక్తిని ఇంకా కొత్త పదాలను తెలుసుకునేలా చేయడం పఠనం వల్ల కలిగే లాభాలు. మీరు టాబ్లెట్‌లో చదివితే ఈ ప్రయోజనాలు ప్రభావం తగ్గి పోతుందని గుర్తుంచుకోండి. స్క్రీన్‌లు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి ఇంకా మన శరీరంలో ఒత్తిడిని కూడా కలుగజేస్తాయి. కాబట్టి ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకోండి ఇంకా మీ పిల్లలను కూడా అలాగే ఒక పుస్తకాన్ని ఎంచుకోమని ప్రోత్సహించండి.పఠనం మనస్సు యొక్క పనితీరును ఎలా పెంచుతుందనే దానిపై సద్గురు తన పరిజ్ఞానాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

సద్గురు: పఠనం అనేది ఒక అలవాటుగా ఇంకా సంస్కృతిగా పెంపొందించబడాలి. పఠనం యొక్క ప్రభావం వీడియోలను చూడటం లేదా కంప్యూటర్ గేమ్స్ ఆడటం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మీ మనస్సుని ఇంకా అంతర్దృష్టిని పూర్తిగా భిన్నమైన రీతిలో పదును పెడుతుంది. ఆడియో-విజువల్ మీడియా మనల్ని విద్యావంతులని చేస్తున్నాయి, వాటివైన మార్గంలో అది శక్తివంతమైనవే, కానీ పఠనం మరింత క్లిష్టత ఇంకా లోతును కలిగి ఉంటుంది. సినిమా లేదా మరేదైనా చూడడంతో పోలిస్తే పఠనానికి మరింత గాఢత ఉంది.

ఒకవేళ చాలా మంది ప్రజలు, వారు ప్రస్తుతం పఠిస్తున్న దానికంటే ఎక్కువగా పఠిస్తూ ఉంటే, వారు కేవలం కాసేపు దృష్టి పెట్టి చదివితే చాలు, వారు చాలా నిశ్శబ్దంగా ఇంకా మరింత ఆలోచనాత్మకంగా తయారవుతారు, జీవితాన్ని ఇంకొంచెం లోతుగా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ధారణ . మీరు దేనిపైనైనా దృష్టి పెడితే - అది ధారణ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీ మనస్సుని మెరుగుపరుస్తుంది. ఇప్పుడున్న సమాజంలో, మిగతా వాటి అన్నింటికంటే ఎలక్ట్రానిక్స్‌పై ఉన్న మోజుతో, మనం పుస్తకాలను చదివే సంస్కృతిని కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం.

జీవితాన్ని మరింత లోతుగా చూసే జటిలతను ప్రజలు కోల్పోయారు. జీవితంలో గాఢత లేదు. ప్రజలు ఉపరితలంపై ఉన్న ప్రతిదాన్ని చూస్తారు. అది ఆడియో-విజువల్ మీడియా ద్వారా ప్రోత్సహించబడుతోందని నేను అనుకుంటున్నాను. నేను దీనికి వ్యతిరేకం కాదు ఎందుకంటే మీడియా చాలా గొప్పది, కానీ అది పఠనానికి ప్రత్యామ్నాయం అని నేను అనుకోను.

#4 ఆరోగ్యం, శాంతి ఇంకా ఆనందం కోసం యోగా చేయండి

5-Awesome-Activites_for-you-and-your-kids-04

ఈశా ఉప-యోగా అనేది సద్గురు రూపొందించిన, ఉప యోగ శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన అభ్యాసాల శ్రేణి. ఉప యోగ అనేది శారీరక, మానసిక ప్రయోజనాల కోసం రూపొందించబడిన యోగా యొక్క ఒక అంశం. ఈ 5-నిమిషాల ప్రక్రియలను సులభంగా సాధన చేయవచ్చు. ఇవి ఆరోగ్యం, ఆనందం ఇంకా శాంతిని పెంచడానికి శక్తివంతమైన సాధనలు. 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా వీటిని సాధన చేయవచ్చు. దిగువ వీడియోల ద్వారా వీటిని ప్రయత్నించండి లేదా సద్గురు యాండ్రాయిడ్ యాప్ నుండి ఉచితంగా యోగా సాధనాలను పొందండి..

ఆరోగ్యం కోసం యోగా: దిశాత్మక కదలికలు

శాంతి కోసం యోగా: నాడి శుద్ధి

ఆనందం కోసం యోగా: నాద యోగా

#5 అందరూ కలిసి ఒక చెట్టును నాటండి

5-Awesome-Activites_for-you-and-your-kids-pic5

ఒక మొక్కను నాటడం, పెంచడం అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి మనం చేయగలిగే సరళమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రక్రియ. అదనంగా, మరొక జీవాన్ని చూసుకోవడం, మీ పిల్లలకి అందరినీ కలుపుకుని పోయే విధంగా మారడానికి, ఆ అనుభూతిని చూడడానికి ఒక అవకాశం ఇస్తుంది. సద్గురు ఇలా అంటారు, “చెట్లు మనకి అందరికంటే దగ్గర బంధువులు. అవి వదిలే గాలిని మనం పీల్చుకుంటాము. మనం వదిలే గాలిని అవి పీలుస్తాయి. ఈ లావాదేవీ ఎప్పుడూ జరు గుతూనే ఉంటుంది. మీకు తెలిసినా, తెలియకపోయినా, మీ ఊపిరితిత్తుల వ్యవస్థలో సగం ఇప్పుడు చెట్టుపైన ఉంది! మీరు ఒక చెట్టుతో మానసిక సంబంధాన్ని ఏర్పరచుకుని, మీ ఇద్దరి మధ్య నిరంతర లావాదేవీని రోజుకు ఐదుసార్లు గుర్తుచేసుకుంటే, మీరు కొద్ది రోజుల్లోనే పరివర్తనను చూస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిదానితో విభిన్నంగా ఒక బంధాన్ని కుదుర్చుకోవడం ప్రారంభిస్తారు. ఇక మీరు మిమ్మల్ని ఒక చెట్టుకే పరిమితం చేసుకోరు".

Editor's Note:  Download the ebook “Inspire Your Child, Inspire the World” for more parenting advice from Sadhguru. The book is available as “Pay As You Like.” (Set 0 for free)