ఆనందంగా జీవించడం ఎలా??
ఆనందంగా ఉండడానికి బయటి పరిస్థితుల మీద ఆధారపడకూడదు అని, అన్ని అనుభూతులు మనలోనే కలుగుతాయని, మీ జీవితానుభూతి అంతా పూర్తిగా నిర్ణయించేది మీరేనని సద్గురు గుర్తుచేస్తున్నారు.
 
 

ప్రశ్న: సద్గురు! బయిట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనలో మనం సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలమో తెలుసుకోవాలనుకుంటున్నాను.

సద్గురు: ఇప్పుడు మీ కాలేజీ ప్రిన్సిపాల్ మీతో ఇలా అన్నారనుకోండి "రేపటి నించీ మీరందరూ ఒకే విధమైన బట్టలే వేసుకోవాలి" అని. వెంటనే ఈ కాలేజీ లో ధర్నాలు జరుగుతాయ్. ఆ తురువాత మీ ప్రిన్సిపాల్ అందరూ ఉదయం నాలుగు ఇడ్లీలు మాత్రమే తినాలని, ఇంకా ఎక్కువ చేసి, అందరూ పొద్దున్న ఐదింటికే లేవాలని, ఇలా మీరు చేయాల్సినవి సుమారు ఒక పది నియమాలు  పెట్టారనుకోండి, మీకు ఆయన మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటుంన్నారనిపించి, మీరు అరిచి గొడవచేసి మీ స్వేచ్చని కాపాడుకోవాలని చూస్తారు, ఔనా?! కానీ మీరొకసారి గమనించి చూడండి. ఇప్పుడు మీ చుట్టూ ఏమి జరగాలో మరెవరో నిర్ణయిస్తేనే మీకు బానిసత్వం అనిపిస్తోందే, మరి మీ లోపల ఏమి జరగాలో ఎదుటివారు నిర్ణయిస్తే, అది బానిసత్వం కాదా??

మీరు సంతోషంగా ఉండాలో బాధగా ఉండాలో ఎదుటివారు నిర్ణయిస్తున్నారు. ఇది బానిసత్వం కాదా? మీలో ఏమి జరగాలో మరెవరో నిర్ణయించడం, అత్యంత హేయమైన బానిసత్వం కాదా? చెప్పండి? అందరూ అలాగే జీవిస్తున్నారు కాబట్టి అది సహజం అనిపిస్తోంది. అందరూ అలాగే చేస్తున్నంత మాత్రాన అది సహజమైపోదు. మీ చుట్టూ ఉన్న ఈ మానవ జీవితం ఎప్పటికీ నూరుశాతం మీకు నచ్చినట్టుగా జరగదు. అలా జరగకోడదు కూడా!. ఎందుకంటే అన్నీ మీకు నచ్చినట్టు జరిగితే నేనెక్కడికి వెళ్ళాలి? నాకు సంతోషంగా ఉంది, అంతా మీరనుకున్న విధంగా జరగనందుకు. మీరొక స్టూడెంట్ కాబట్టీ ఒక అరవై డబ్భై శాతం మీకు నచ్చినట్టే జరుగుతుంది. పెళ్ళైతే ఈ లెక్క మారిపోతుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న జీవితం పూర్తిగా మీకు నచ్చినట్టు ఉండదు. ఉండకోడదు కూడా!!

ఒక వేళ మీరు మెషిన్ లతో జీవిస్తుంటే తప్ప. ఆ మెషిన్లు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయ్! అందుకే, బైటి పరిస్థితులు అంతా 100 శాతం మీకు నచ్చినట్టు జరగవు.

ఎక్కడైనా ఇది పైకి ఇది కిందకీ అని మార్క్ చేసి ఉందా. ఏది పైనో ఏది కిందో ఎవరికీ తెలియదు. అంతా మన ఊహే..కాదా?
మీ ఆహ్లాదం మీ చుట్టూ జరిగే విషయాలపై ఆధారపడి ఉంటే, మీరు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే అవకాశం  చాలా తక్కువ. అనుకున్నది జరగనప్పుడల్లా, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఆకాశంకేసి చూసి పైవాడిని పిలుస్తారు....కదా!! ప్రపంచం అంతా పైకి చూస్తోంది. మీకు తెలుసుకదా మన భూగ్రహం గుండ్రంగా ఉందని?  ఈ భూమి గుండ్రంగా ఉంది, మీరు ఉత్తర ధృవం మీద కూచోలేదు, మీరు చెన్నైలో ఈ ఉష్ణమండల ప్రదేశంలో ఉన్నారు, ఇంకా ఈ గ్రహం తిరుగుతోంది.

అంటే మీరు పైకి చూస్తుంటే అది తప్పు దిశలో చూస్తున్నరనే అర్ధం కదా!! ఈ అంతరిక్షంలో ఏది పైనో ఏది కిందో తెలిసిన వాళ్ళున్నారా? ఎక్కడైనా ఇది పైకి ఇది కిందకీ అని మార్క్ చేసి ఉందా. ఏది పైనో ఏది కిందో ఎవరికీ తెలియదు. అంతా మన ఊహే..కాదా?. మీకు నిజంగా ఏది ఉత్తరమో ఏది దక్షిణమో తెలుసా? అంటే ఉత్తర దక్షిణాలంటే ఏమిటో నిజంగా తెలుసా అసలు?. మన సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న గుర్తులివి. ఔనా? మీకు ఖచ్చితంగా తెలిసిందల్లా ఒకటే. ఏది బయట ఏది లోపల అనే విషయం.ఇది మాత్రం మీకు అనుమానం లేకుండా తెలుసు.కదా!!. ఏదో ఒకరోజు ఒకవేళ మీకు జ్ఞ్యానోదయం అయితే అప్పుడు ఈ జ్ఞ్యానం కూడా పోతుంది. నిజం. నాకదే జరిగింది.ఇప్పుడు నాకు ఏది బయటో ఏది లోపలో తెలీదు. ఎది నేనో ఏది నేను కాదో కూడా తెలీదు. అందుకే నేను ప్రపంచమంతా ఉన్న భావన. ఎందుకంటే ఇది నేనో అది నేనో తెలుసుకోలేను నేను.

అంతా మీలోనే జరుగుతుంది

ఇప్పుడు మనకి ఏది బయటో ఏది లోపలో తెలుసని అనుకుంటున్నాం కదా, దీన్ని ఇంకొంచెం పరిశీలిద్దాం. మీరిప్పుడు నన్ను చూడగలుగుతున్నారా?. చూస్తున్నారా?.. నేనేక్కడున్నానో చూపించండి. ఇప్పుడు ఈ వెలుగు నా మీద పడి, ప్రతిబింబించి, మీ లెన్స్ లోనికి వెళ్లి  మీ రెటీనాపై తిరగేసిన ముద్రపడి.. మీకా కధంతా తెలుసుకదా. మీరు నన్ను ఎక్కడ చూస్తున్నారు? మీ లోపలే. మీరు నన్నెక్కడ వింటున్నారు? మీ లోపలే.. మీరు ఈ ప్రపంచాన్నంతా ఎక్కడ చూశారు...? మీ లోపలే..మీరెప్పుడైనా మీకు అవతల ఏదైనా అనుభూతి చెందారా?. మీకు ఇప్పటివరకూ జరిగినదేదైనా...వెలుగు లేదా చీకటి మీలోనే జరిగాయి. నొప్పి, హాయి మీలోనే జరిగాయి. ఆనందం దుఃఖం మీలోనే జరిగాయి.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1