మనం మన మంచి ప్రవర్తనకు మనమే కారణమని, మన చెడు ప్రవర్తనకు, దురుసుతనానికి  మరేదో, లేదా మరెవరో కారణమని అనుకోవడానికి ఇష్టపడుతాం. అసలు మనం కాకుండా వేరేదేదైనా, లేదా వేరెవరైనా మన ప్రవర్తనకు నిజంగా కారణం కాగలరా?ఈ ప్రశ్నలకు సమాధానాలు వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము. 


మీలో మీకు నచ్చని చెడు భాగాన్ని మీరు అహం అని పిలిస్తున్నారంటే, మీరు మరెవరి మీదో నింద వేస్తున్నారని అర్థం. మీరు అహాన్ని మీలోనే ఉన్న ఇంకొక అస్థిత్వంగా మాట్లాడుతున్నారు, కానీ అది నిజం కాదు. దురుసుగా ప్రవర్తిస్తున్నది మీరే, మీ అహం కాదు.

మీరు దురుసుగా ప్రవర్తించిన ప్రతిసారీ, మీరు మీ అహం దురుసుగా ప్రవర్తిస్తుందంటారు, కానీ అది మీరు అని అనుకోరు. దురుసుగా ప్రవర్తింస్తుంది మీరే, మీ అహం కాదు.

 నేను అనబడే మొత్తం నేనే, నా అహం కాదు, నా తల్లిదండ్రులు కారు, నా సంప్రదాయం కాదు, నా మీద పడిన ప్రభావాలు కాదు, నాకు సంబంధించిన ఇదీ కాదు, అదీ కాదు, ఏదీ కాదు,  నేను అనబడేదంతా 'నేనే, నేనే, నేను మాత్రమే' అని మీకు 100% అర్థమైన  క్షణం మీలోని  దురుసుతనం పూర్తిగా తొలిగిపోతుంది.

మీరు ఆనందాన్ని అనుభవించలేకపోతే, మిమ్మల్ని ఎవరు దానిని అనుభవించనివ్వడం లేదో మీరు అర్ధం చేసుకోవాలి. మీ బాధకి మీరే మూలం, మీ ఆనందానికి మీరే మూలం, వేరే ఎవరూ కాదు. అసలు వేరే వారెవరూ కాదు. మీరు తప్ప ఇంకేదీ కాదు అన్న విషయం మీలో లోతుగా నాటుకునేలా చేయాలి.

మీరు దీన్ని అర్ధం చేసుకుంటే, ఒకసారి మీకీ విషయం అనుభవ పూర్వకంగా అర్ధమయితే, దురుసుతనం అనేదేది ఇక మీలో ఉండదని మీకు అర్ధమవుతుంది. అది ఉండలేదు. ఎందుకంటే మీ మేధస్సు ఏ కారణంగా కూడా మిమ్మల్ని దురుసుగా మారనివ్వదు. ఎందుకంటే అది మీరేనని మీకు స్పష్టంగా తెలుసు. అది వేరెవరో అని మీరు అనుకుంటే, వెంటనే మీరు దురుసుగా, అప్రియంగా తయారవుతారు, అవునా?

మీ దురుసుతనానికి అహం అనే ఇతర క్లిష్టమైన గుర్తింపులను అన్వయించకండి. అది మీ అహం కాదు, అది కేవలం మీరు; కొన్నిసార్లు ఆహ్లాదంగా, కొన్నిసార్లు బాధగా మారగల సామర్ధ్యం ఉన్నది మీకే. అది పూర్తిగా మీరే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.