మీ ఆనందానికి అసలు కారణం....

మనం ఆనందంగా ఉన్నప్పడు, మీ ఆనందానికి కారణం ఏమిటని ఎవరైనా అడిగితే, ఇదని, అదని, ఇంకేదో అని సవాలక్ష బయటి కారణాలను చూపిస్తుంటాం. కాని మన ఆనందానికి ఎలాంటి బయటి విషయమైనా కేవలం ప్రేరణే కానీ, అసలు కారణం కాదని సద్గురు అంటున్నారు. సద్గురు అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే 'ఆనందం 24x7' సీరీస్‌లోని ఆరవ వ్యాసం ఈ వారం చదవండి.
 

మనం ఆనందంగా ఉన్నప్పడు, మీ ఆనందానికి కారణం ఏమిటని ఎవరైనా అడిగితే, ఇదని, అదని, ఇంకేదో అని సవాలక్ష బయటి కారణాలను చూపిస్తుంటాం. కాని మన ఆనందానికి ఎలాంటి బయటి విషయమైనా కేవలం ప్రేరణే కానీ, అసలు కారణం కాదని సద్గురు అంటున్నారు. సద్గురు అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటేఈ వ్యాసం   చదవండి.


ఆనందమనే పునాది లేకపోతే, నేను మనుషులతో చేయాలనుకున్నది చేయలేను. మీరు ఎవరు, ఎక్కడున్నారు, మీరు ఏమిటి అన్నవాటితో సంబంధం లేకుండా, నేను నిరంతరం ఆ పునాది వేయాటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, మీరు కూడా ఎప్పుడూ దానిని పెకిలించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు(నవ్వు). ఈ పునాది వేయటం అన్నది బోధన పరంగా గానీ, అవగాహన కల్పించడం ద్వారా గానీ కాదు.

మీకు ఎదో తెలియడం వల్ల ఆనందం కలగదు. మీకు ఏదో అర్ధం అవడం వల్ల ఆనందం కలగదు. మీలోని మీ అస్థిత్వ మూలం వ్యక్తీకరించబడినప్పుడు ఆనందం కలగుతుంది. నా శక్తి ఎలాంటిదంటే, మీరు నాతో కూర్చున్నప్పుడు, మీ భౌతిక శరీరం, మనసు, భావోద్వేగాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో సహజంగా వాటంతటవే అనుసంధానమై, మీకు ఆనందం అనిపిస్తుంది.

కానీ, మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే, ప్రేరణ బయటే ఉన్నా, ఆనందం నిజానికి లోపలి నుండే వస్తుంది. మనం కవిత్వంలో రాస్తాము, ‘నేను మీ మీద ఆనందాన్ని కురిపిస్తాను’ అని. కానీ, అది అలా కాదు, ఆనందాన్ని మీ మీద కురిపించలేము. ఒక నిర్దిష్ట పద్ధతిలో మీ భౌతిక శరీరం, మనసు, భావోద్వేగాలు అనుసంధానమైయ్యే పరిస్ధితిని సృష్టించి, మీరు సహజంగానే ఆనందం పొందేటట్లు చేయగలం. ఆనందం ఎప్పుడూ కూడా ఒక అంతర్గత అనుభవమే. అది మీ మీద కురిసేదే అయితే, ముందు మీ చర్మానికి తెలియాలి, కానీ, అది అలా జరగదు. మీ అస్థిత్వ మూలాన్ని వ్యక్తీకరణ అవనిచ్చే ఒక ప్రత్యేకమైన అనుసంధానం మీలో సహజంగానే ఏర్పడినప్పుడు, మీకు ఆనందం కలుగుతుంది.

మనుషులకు దుఃఖంతో ఉండటం తప్ప వేరే ఏ లోపమూ లేదు. వారు ఏమి చేసినా, ఏమి చేయక పోయినా దుఖంగానే ఉంటారు. దు:ఖంతో ఉండడానికి వారికి కావలసింది ఒక సాకు మాత్రమే!

మనుషులకు దుఃఖంగా ఉండటం తప్ప, వారిలో వేరే ఏ లోపమూ లేదు, అవునా, కాదా?(నవ్వు). వారు ఏమి చేసినా, ఏమి చేయక పోయినా దుఖంగానే ఉంటారు. వారికి ఏదైనా చేసే అవకాశం వచ్చినా, దుఃఖంతోనే ఉంటారు. అలాంటి అవకాశం రాకపోయినా, దుఃఖంతోనే ఉంటారు. దు:ఖంతో ఉండడానికి వారికి కావలసింది ఒక సాకు మాత్రమే!

కానీ మీరు ఒక రోజు ఒక నిర్దిష్ట స్ధాయిలో మీ అస్థిత్వమూలంతో అనుసంధానమై ఉంటే, అకస్మాత్తుగా మీరు ఆ రోజు నవ్వడానికి ఒక సాకు కోసం చూస్తారు. అదే మీరు అలా అనుసంధానమై లేకపోతే, కన్నీరు కార్చడానికి లేదా నిస్పృహ చెందడానికి మీకు కావలసిందల్లా ఒక సాకు మాత్రమే. కాబట్టి, మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే మీరు ఇప్పుడు మీ ఆనందానికి కారణమని దేన్నైతే అనుకుంటున్నారో అది కేవలం ఒక సాకు మాత్రమే. అలాగే మీరు ఇప్పుడు మీ దు:ఖానికి  కారణమని దేన్నైతే అనుకుంటున్నారో అది కూడా కేవలం ఒక సాకు మాత్రమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1