ప్రగాఢ అనుభూతి కావాలి!

జనాలు మద్యం ఎందుకు తీసుకుంటారు? జనాలకు సెక్స్ అంటే అంత పిచ్చెందుకు? జనాలు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? జనాలు కొండల మీద నుండి ఎందుకు దూకాలనుకుంటున్నారు? జనాలు వారి జీవితాలలో అత్యంత ప్రమాదకరమైన పనులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వ్యాసంలో..
 

మనం కొంచం గమనిస్తే మన చుట్టూ ఉన్న జనాలు ప్రతి రోజూ తెలిసే ఎన్నో ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని తెలుస్తుంది. జనాలు ఎందుకు తెలిసి తెలిసి తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారో  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి!  


జనాలు మద్యం ఎందుకు తీసుకుంటారు? జనాలకు సెక్స్ అంటే అంత పిచ్చెందుకు? జనాలు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? జనాలు కొండల మీద నుండి ఎందుకు దూకాలనుకుంటున్నారు? జనాలు వారి జీవితాలలో అత్యంత ప్రమాదకరమైన పనులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? జనాలు ప్రతి రోజూ ఎన్నో ప్రమాదకరమైన పనులు చేస్తున్నది కేవలం కాస్త ఉత్తేజాన్ని అనుభవించటానికే. జీవితాన్ని ఇంకొంచం లోతుగా అనుభూతి చెందటానికే. అవునా, కాదా?

ఎక్కడో ప్రతి మనిషీ తనకు ప్రస్తుతం తెలిసిన దానికన్నా ఇంకా లోతుగా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాడు. దురదృష్తవశాత్తు, చాలా మందికి వారికి తెలిసిన లోతైన అనుభవం బాధే. వారి జీవితంలో లోతైన అనుభవం బాధే; వారు తమ లోపల నిజమైన ఆహ్లాదాన్ని ఎన్నడూ అనుభవించలేదు. ఆహ్లాదం కేవలం ఉపరితలం మీద ఉంటే, బాధ మాత్రం లోతుగా పాతుకుపోయి ఉంది.

ఎల్లప్పుడూ మనుషులు తమ జీవితంలో ప్రస్తుతం ఉన్నవాటి కన్నా లోతైన అనుభవాలను వెతుకుతూ ఉంటారు.

దీని కారణంగానే కొంత తీక్షణత ఉన్న ఆర్టిస్టులు, సంగీతకారులు, పెయింటర్లు, డాన్సర్లు ఎప్పడూ తమ వ్యక్తీకరణకు బాధనే మాధ్యమంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే అది వారి కళకి లోతుని ఇస్తుంది. ఆనందం వారి కళకి లోతుని ఇవ్వలేదు. ఎందుకంటే వారికి ఆనందాన్ని అత్యున్నత స్థాయిలో, ఒక గాఢానుభవంగా ఎలా చూపించాలో తెలియదు. ఎందుకంటే వారికి ప్రగాఢమైన ఆనందం గురించి అసలు తెలియదు. కానీ వారికి ప్రగాఢమైన బాధ తెలుసు. అందువల్ల వారు బాధని ఎక్కువ చేసుకుని, దానిని వారి కళలో చూపించటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే కనీసం దానిలో లోతు ఉంది. అది ఆహ్లాదంగా లేకపోయినా, అందులో లోతు ఉంది.

తన జీవితంలోకి ఈ లోతుని, అంటే ప్రగాఢ ఆకర్షణను తీసుకురావటానికి ప్రతి మనిషీ నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఎల్లప్పుడూ మనుషులు తమ జీవితంలో ప్రస్తుతం ఉన్నవాటి కన్నా లోతైన అనుభవాలను వెతుకుతూ ఉంటారు. అవునా, కాదా?

వారు ఆశ్రమానికి వచ్చినా, బారుకి వెళ్ళినా, ఒక వేశ్యాగృహానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, వారు ఏదో విధంగా ఇంతకు ముందు కంటే లోతైన అనుభవాన్ని వెతుకుతున్నారు. అవునా, కాదా? ఈ ప్రక్రియలో వారు వారి జీవితంలోని పలు అంశాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. మీరు బారుకి వెళితే మీరు మీ జీవితంలోని ఏదో ఒక అంశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. మీరు ఆశ్రమానికి వస్తే, మీరు మరొక అంశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. మీరు వేశ్యాగృహానికి వెళితే, మీరు ఇంకొకదాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీ జీవితంలో ఇంతకు ముందు కంటే లోతైన అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఆ ప్రక్రియలో ఏదో విధంగా మీ జీవితాన్ని పలు విధాలుగా ప్రమాదంలో పడేస్తున్నారు. అయినా సరే, జనాలు వారికి పూర్తిగా తృప్తినిచ్చే ఒక స్థిరమైన ప్రగాఢ అనుభూతి పొందలేక పోతున్నారు. వారు వారి సృష్టి మూలంతో నిరంతరం అనుసంధానమై ఉన్నప్పుడు మాత్రమే అలాంటి అనుభూతిని పొందగలుగుతారు. దీనికి మార్గం యోగానే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1