ఈశా యోగా సెంటర్ వద్ద ఉన్న, యోగాకు మూలమైన 112-అడుగుల ఆదియోగి ముఖం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను  నెలకొల్పుతోంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, ప్రపంచంలో అతిపెద్ద బస్ట్ (స్కల్ప్చర్) గా ఆదియోగిని ఎంపిక చేశాయి.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రతిమగా నిలిచింది. యోగాకు మూలమైన - 112 అడుగుల ఆదియోగి ముఖాన్ని, ఈశా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు, రూపకల్పన చేసి ప్రాణ ప్రతిష్టను గావించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మహాశివరాత్రి నాడు ఆవిష్కరించిన యోగాకు మూలమైన 112 అడుగుల ఆదియోగి ముఖం, ప్రపంచంలోని అతిపెద్ద  ముఖంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పుతోంది.

“ఈశా ఫౌండేషన్ (ఇంside-adiyogiడియా) సాధించిన 34.299 మీ (112 అడుగుల 4 అంగుళాలు) ఎత్తు, 24.99 మీ (81 అడుగుల 11.8 అంగుళాలు) వెడల్పు, ఇంకా 44.90 మీ (147 అడుగులు 3.7 అంగుళాలు) పొడవు కలిగిన అతిపెద్ద వదనం (శిల్పం), తమిళనాడులో, భారతదేశంలో, 11 మార్చి 2017 ధృవీకరించబడింద” ని గిన్నీస్ వరల్డ్ రికార్డు పేర్కొంది.

ఆదియోగి ప్రాముఖ్యతను వివరిస్తూ, సద్గురు "యోగ సంస్కృతిలో, శివుడిని  దేవుడిగా కొలవరు, కానీ ఆదియోగి లేదా మొదటి యోగి - యోగాకు మూలంగా చూస్తారు. మీరు కృషి చేయడానికి సిద్దంగా ఉంటే పరిణామం చెందవచ్చునన్న ఆలోచనని, మొట్టమొదట మనవ హృదయాల్లో నాటినవారు ఆదియోగి. ఆదియోగి అందించిన యోగ శాస్త్రం నుండి ప్రయోజనం పొందని సంస్కృతి లేదు. ఒక మతంగానో,  నమ్మక వ్యవస్థగానో లేదా తత్వశాస్త్రంగానో కాకుండా, యోగా ఒక విధానంగా అన్నిచోట్లకు చేరుకుంది. 112 లోని ప్రాముఖ్యత ఏమిటంటే -  మానవజాతి ముక్తిని చేరుకోవటానికి ఆదియోగి, 112 విధానాలను  అందించార” ని చెప్పారు.

ఆదియోగి అద్భుతమైన ముఖం ఉక్కుతో తయారు చేయబడింది, ఈ ముఖ రూపకల్పనకు 2.5 సంవత్సరాలు పట్టింది, కానీ ఈశా  ఫౌండేషన్ కు చెందిన అంతర్గత బృందం 8 నెలల్లోనే  దీనిని నిర్మించింది.

ఆదియోగికి సమర్పణగా, గౌరవనీయ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా మహా యోగ యజ్ఞాన్ని ఆరంభించారు, దాని తరువాత 1 మిలియన్ ప్రజలు ప్రతి ఒక్కరూ కనీసం 100 మంది వ్యక్తులకుసరళమైన యోగను అందించి, యోగా 100 మిలియన్ మంది ప్రజలను స్పృశించేలా కృషి చేస్తామని ప్రమాణం చేశారు.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లిస్టింగ్ http://www.guinnessworldrecords.com/world-records/458751-largest-bust-sculpture