ఆనందం అనేది సృష్టిలో భాగమే!

 

మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటాము, కాని మనం మన జీవితాలను బాధలో పెట్టుబడి పెట్టామనీ, ఆనందం అనేది సృష్టిలో భాగమేనని, అసలు ఆనందంగా ఎలా ఉండాలి అనే దాని గురించి  సద్గురు ఏమంటున్నారో  వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము.


తెలియని వాళ్ళు ఎవరూ లేరు!

ఎవరూ తెలియని వాళ్ళు కాదు. తమ కోసం, తమ చుట్టూ ఉన్నవారి కోసం బాధను సృష్టించుకోవడంలో, అనుభవించటంలో ప్రతివాళ్ళూ నిష్ణాతులే, అవునా, కాదా? ప్రతివాళ్ళూ నరకానికి ప్రధానాధికారి అయిపోవచ్చు ఎందుకంటే వారు తమను తాము చిత్రహింసలు పెట్టుకోవటంలో నిష్ణాతులు, కానీ మీతో పోటీకి వస్తే మాత్రం, వారంతా ఓడిపోతారు.

బాధకి నిర్వహణ అవసరం, ఆనందానికి అవసరం లేదు. మీరు దేనినీ పాడుచేయకపోతే, మీరు ఆనందంగానే ఉంటారు.

కాబట్టి వారంతా తెలియనివాళ్ళు కాదు, వారు తమ జీవితాలను బాధలో పెట్టుబడి పెట్టారు. అలా చేయటం మూర్ఖత్వం అని వాళ్ళు అర్ధం చేసుకోవాలి, అంతే. మీ మేధస్సు పని చేస్తే, సహజంగానే మీరు మీ జీవితాన్ని ఆనందంలో పెట్టుబడి పెడతారు, బాధలో కాదు. బాధ మీరు సృష్టించినది.

ఆనందం మీరు సృష్టించినది కాదు; అది ఇప్పటికే ఉన్న సృష్టిలో భాగం. మీరు మీ పనికిరాని వాటిని  సృష్టించడం మానేస్తే, ఆనందంగా మాత్రమే ఉండగలరు. అందుకనే స్వర్గానికి ప్రధానాధికారులు లేరు, దానికి ఎటువంటి నిర్వహణా అవసరం లేదు. బాధకి నిర్వహణ అవసరం, ఆనందానికి అవసరం లేదు. మీరు దేనినీ పాడుచేయకపోతే, మీరు ఆనందంగా ఉంటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

మరిన్ని వ్యాసాలను ఇక్కడ చదవండి : ఆనందం

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1