సద్గురు: ఆది యోగి 15000 ఏళ్ళకు పూర్వం ‘‘పంచభూతాల’’ గురించి మాట్లాడారు. ఆయన ఈ విశ్వం అంతా ఈ పంచభూతాల ఆట అని, అవి మన శరీరంలో ఏ నిష్పత్తులలో ఉంటాయో, వాటిమీద పట్టు సాధిస్తే ఒకరకంగా అది సృష్టి మీద పట్టు సాధించినట్లేనని తన ఏడుగురు శిష్యులకు తెలియజేశారు. ఇలా సృష్టి మీద కొంతైనా పట్టు ఉంటే మీరు సరాసరి ఈ సృష్టిమూలంతో సంబంధంలో ఉంటారని చెప్పారు. ఈ విజ్ఞానాన్ని ఎంతో వివరంగా బోధించినప్పుడు ఈ సప్తర్షులు, ఆయన భార్య పార్వతి ఆశ్చర్యపోయారు.

వారు నమ్మలేదు. మొత్తం విశ్వమంతా కేవలం ఐదు వస్తువులేనని వారు నమ్మలేక పోయారు – అందులో కూడా ఒకటి శూన్యం, అంటే నాలుగు వస్తువులే నని.

దీని వెనుకనున్న విజ్ఞానాన్ని ఆదియోగి విశదీకరించారు: కేవలం నాలుగు పదార్ధాలతో ఈనాడు మనం విశ్వం అంటున్న సూపును మీరు తయారు చేయగలరు అని చెబుతున్నారు.

దీని వెనుకనున్న విజ్ఞానాన్ని ఆదియోగి విశదీకరించారు: కేవలం నాలుగు పదార్ధాలతో ఈనాడు మనం విశ్వం అంటున్న సూపును మీరు తయారు చేయగలరు అని చెబుతున్నారు. ఇక ఐదవ దానిని మీరు చాలా సమయాల్లో అనుభూతి చెందలేరు. మీకు నేను నాలుగు వస్తువులు ఇస్తే మీరు సాంబారు నన్నా తయారు చేయగలరా? సాంబారు చేయడానికి కూడా మీకు ఇరవై ఐదు దినుసులు కావాలి. కాని కేవలం నాలుగే దినుసులతో చేయడం అంటే అది మైమరపించే పనితనం..

ఆదియోగి ఈ పంచభూతాల మీద పట్టు సాధించే విజ్ఞానం వివరిస్తూ ముందుకు సాగారు. ఈ ఏడున్నొక్కమంది దీనిని వింటూ, ఆయన ఇస్తున్న చిన్న చిన్న ప్రదర్శనలను చూస్తూ ఎంతో ఆశ్చర్య పడ్డారు.. ‘”మీరు వీటిపై పట్టు సాధించవచ్చు లేక ఆ మేధస్సుకు పూర్తిగా లొంగిపోవచ్చు దేని వల్లనైనా అది మీ సొతమౌతుంది. “అని ఆయన అన్నారు.ఆ ఏడుగురు దానిపై పట్టుసాధించడం గురించి ఆసక్తి చూపారు. పార్వతి దానికి లొంగిపోయేందుకు నిశ్చయించుకుని దానిని తనలో భాగం చేసుకుంది.

అందువల్ల ఆ ఏడుగురూ కార్యం సాధన నిమిత్తం పంపబడ్డారు. పార్వతి ఆ జ్ఞానానికి లొంగి పోయి, దానిని తనలో భాగం చేసుకుంది కాబట్టి అది ఆమెలో అంతర్భాగం అయ్యింది.. ఈ ఏడుగురిని ఋషులని అన్నారు, ఆమె దేవత అయ్యింది. మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి ఎలా తీసుకువెళ్ళ గలరో వివరిస్తున్నాను!. అన్నీ ఎలా రూపుదిద్దుకున్నాయో తెలుసుకునే పనిలో పడితే, మీరు ఇక్కడ లక్షలాది సంవత్సరాలపాటు ఇక్కడ జీవించి చదువుతూ, చదువుతూ ఉన్నా అది అంతులేని ప్రక్రియ అవుతుంది. అది ఎంతో అద్భుతంగా ఉండవచ్చు కాని అంతులేని ప్రక్రియ అవుతుంది. లేక మీరు అంతులేని ప్రక్రియను ప్రక్కకు బెట్టి, ఈ సృష్టికి మూలమైనదానిని స్పృశించవచ్చు. మీరు ఈ ఆట ఆడదలచుకుంటే, మీరు ఈ సృష్టి మూలకాలతో నిమగ్నమవ్వండి. ఈ ఆట ఆడకుండా మీరు కేవలం గెలవడానికి ఆటలోని జయాపజయాలను ముందే నిర్ణయించేవారైతే, మీకు కేవలం ఈ పరీక్షలో నెగ్గడంలోనే అభిరుచి ఉంటే, అప్పుడు మీరు ఈ సృష్టి మూలాన్ని మాత్రమే తాకండి.మూలకాల విషయంలో తలమునకలు కానవసరం లేదు..



మీరు ఆట ఆడాలి లేక ఆటే మిమ్మల్ని ఆడుకుంటుంది.

మీకు ఆట ఆడాలని లేకపోతే, ఆటే మిమ్మల్ని ఆడుకుంటుంది. మీ జీవితపు ఆటను ప్రక్కకుబెట్టి, సృష్టి మూలంతో ఒకటయ్యే దానిపైనే దృష్టిపెడితే అదే సులువౌతుంది. మీకు ‘‘నేను’’ అనే ధ్యాసే లేకపోతే, మీకు మీ శరీరం, మనసు, మనోభావాలు, ఇలా అన్నింటిపై అంతటి వైరాగ్యం ఉంటే, అది మీకు సులభంగా లభ్యమౌతుంది. అలాకాక పోతే అది అన్నింటికన్నాకష్టమౌతుంది. మీరు మీ జీవితానికి కధానాయకులైప్పుడు “మిమ్మల్ని” మీరు ప్రక్కకు పెట్టుకోగలరా? మీదే ముఖ్య భూమిక అయినప్పుడు “మిమ్మల్ని” మీరుప్రక్కన పెట్టుకోవడం కష్టమౌతుంది. కాని అదే అతి గొప్ప దైన, మరియు సులువైన మార్గం.. లేకపోతే ఆడడానికి ఎంతో పెద్ద ఆట ఉన్నది, అది అంతులేని ఆట. మీరు ఆట ఆడాలనుకుంటే, ఎంతో నైపుణ్యంగా ఆడండి. సరిగా ఆడలేని వారిని అందరూ అసహ్యించుకుంటారు.

భూత శుద్ధి లేదా పంచభూతాల మీద పట్టు సాధించడం అనేది ఎరుకతో విజయం సాధించడానికి ఒక మార్గం, ఎందుకంటే మీరు చేసేపని మీద పట్టు లేకుండా చేస్తే విజయమనేది యాదృచ్ఛికమౌతుంది.

మీరు ఆటఆడాలని నిర్ణయించుకుంటే, పంచభూతాల మీద పట్టు ఉండడం ఎంతో ముఖ్యం. లేకపోతే మీరు జీవితమనే ఆటలో చెత్త ఆటగాడిలా అవుతారు. తెలిసో, తెలియకో ప్రజలు విజయులౌతే, ఏదో కొంత పట్టు ఉన్నట్టే. అలాలేకపోతే ఏ విధమైన విజయం ఉండదు. ఆ సామర్థ్యం కోసం మీరు ఇక్కడైనా కానీ,, మరింకెక్కడైనా కానీ కృషి చేశారో, ఏది ఏమైనా దేనిమీదైనా కొంత పట్టు లేకుండా, జీవితంలో విజయం లభించదు. మీరు శ్రమించదలచుకుంటే మానవ జీవితంలో విజయమే అన్నింటికన్నా తీయనైనిది. కాని ‘‘మీరు గెలిచినా ఓడినా పట్టించుకోనవసరంలేదు, ఏదైనా పరవాలేదు’’ అంటూ ఒకరకమైన చెత్తను ప్రచారం చేసే మనుషులు కొందరున్నారు వాటిని తత్వశాస్త్రాలు అంటారు. జీవితంలో అటువంటి చెత్త లేదు. మీరు ఓ ఆట ఆడితే గెలవాలనే ఆడతారు. ఆట అయిపోయాక మీరు ఓడినట్లైతే, ఫరవాలేదు. కాని ఆడకముందే మీరు ఓడినా ఫరవాలేదని భావిస్తే అసలు ఆటంటే మీకు ఏమీ తెలియదన్నమాట. కాని మీరు ఆడదామని ఒకసారి నిర్ణయించుకున్నప్పుడు బయట మార్కెట్ లోనైనా, వివాహంలోనైనా, జీవితంలోనైనా, ఆద్యాత్మిక ప్రక్రియలోనైనా, మీరు నెగ్గాలి. చాలాసార్లు అది నలుగురితో టీమ్ గా కలిసి ఆడే ఆట కావచ్చు. మీరు తెలవాలంటే మీతో ఉన్నవారు కూడా గెలవాలని మీరు మర్చిపోవచ్చు. మీకు పెళ్ళయ్యాక మీరు మాత్రమే గెలవాలనుకుంటే, అతనో, ఆమో మీ జీవితాన్ని దుఃఖమయం.చేస్తారు.

భూత శుద్ధి లేదా పంచభూతాల మీద పట్టు సాధించడం అనేది ఎరుకతో విజయం సాధించడానికి ఒక మార్గం, ఎందుకంటే మీరు చేసేపని మీద పట్టు లేకుండా చేస్తే విజయమనేది యాదృచ్ఛికమౌతుంది. మీ ప్రత్యర్ధి చేతగాని వాడు అవ్వడం మూలంగా మీరు గెలవవచ్చు. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఏదిఏమైనా మీరు మీ శక్తి మేరకు, దానికి మించి ఆడాలి. హఠయోగాలో మేము సూచనలు ఇచ్చేటప్పుడు మేము‘‘ మీరు వీలైనంతగా, దానికి మించి మరికాస్త కూడా ప్రయత్నించండి’’ అంటాము. మరికాస్త అన్నదే అతి ముఖ్యమైన విషయం. దానిలోనే అసలుది ఉంది. విజయానికి, పరాజయానికి మధ్య ఉన్న తేడా అదే. ఒకరు మరొకరి కన్నా కాస్త ఎక్కువ చేస్తున్నారు.

నియంత్రణ లేకపోవడం, నియంత్రణలో ఉండడం

1970 దశకంలో కెన్నీ రాబర్ట్ప్ ప్రపంచ మోటారు సైకిల్ పందాలు వరుసగా మూడుసార్లు గెలిచాడు. అది అంత సులువు కాదు, ఎందుకంటే ఎంతో శక్తివంతమైన మోటారు సైకిళ్ళు, వాటిని నడిపే ప్రపంచంలోని అత్యుత్తమ చోదకులు ఉన్నప్పుడు గెలుపు అనేది సెకనులో వందోవంతు తేడాలో ఉంటుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ అంటే దాదాపు ప్రతి సంవత్సరం పన్నెండు నుంచి, పదిహేను రేసులు చొప్పున మూడు సంవత్సరాలు గెలవడమంటే దాదాపు అసాధ్యం. అందుకే మీరి దీనిని ‘‘ఎలా సాధించారు’’ అని ఎవరో అడిగినప్పుడు, ఆయన “నేను నియంత్రణ లేని దానిపై నియంత్రణ సాధించాను” అన్నాడు. అంటే నియంత్రణలేని స్థితికి చేరుకునే ధైర్యం అయినా దానిని మితిమీరి దాటి వెళ్లకుండా ఉండే వివేకంతో ఉండడం.

ఈ దిశగా ఏ రకమైన సాధనా చేయలేని వారికి మేము పంచభూతారాధనను ఏర్పాటు చేశాము. ఆసమయంలో అక్కడ ఉండడం ద్వారా మీరు దాని నుంచి ప్రయోజనం పొందవచ్చు..

మీకేదన్నా చేసే ధైర్యం ఉండాలంటే, మీకు కొంత సామర్థ్యం ఉండాలి. లేకపోతే ఆ ధైర్యం ఒక ప్రమాదం అవుతుంది. మీరు దానిని విజవయవంతంగా చేస్తే అందరూ మీరు ధైర్యవంతులు అంటారు. మీరు విఫలురైతే ఆ ప్రజలే మిమ్మల్ని మూర్ఖులు అంటారు. ఆ మార్గం చాలా ఇరుకైనది, మీకు మీ అస్తిత్వ మూలాల మీద మీకు పట్టు ఉంటే, ఆ మార్గంలో వెళ్లగల మీ సామర్థ్యం, ఆ మార్గంలో నడవగల సామర్థ్యం మరింత మెరుగౌతాయి.

ఈ దిశగా ఏ రకమైన సాధనా చేయలేని వారికి మేము పంచభూతారాధనను ఏర్పాటు చేశాము. ఆసమయంలో అక్కడ ఉండడం ద్వారా మీరు దాని నుంచి ప్రయోజనం పొందవచ్చు.. ఇది ఎంతో ప్రముఖ ప్రక్రియ. ఇది ముఖ్యంగా వారికై వారు సాధన చేయలేని వారికోసం. వెయ్యి మందైనా దీనిలో పాల్గొని ప్రయోజనం పొందవచ్చు.

కాని మీరు సాధన చేస్తే, అది మీ కోసమే. సాధన ఖచ్చితంగా ఉత్తమ మైనది, కాని ఆచార కర్మ ఎక్కువమందికి ప్రయోజనకరమైనద.

ప్రేమాశీస్సులతో,

సద్గురు