నన్నారి టీ

నీరు మరిగించి, అందులో నన్నరి పొడి వేసి రెండు నిమిషాలు వుంచి ఆ తరువాత వడకట్టి తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.
 

కావాల్సిన పదార్థాలు:

నన్నారి వేరు  -   1 ఇంచ్‌ కొలతతో 5 ముక్కలు

ఏలకులు       -    2

నీరు      -          200 మి.లీ

తేనె లేక - బెల్లం లేక కరపట్టి    -   కావలసినంత

నన్నారి పొడి తయారీ విధానం : నన్నారి వేరు ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది.

- అదితెచ్చుకుని ఆరబెట్టుకోవాలి. పొడి చేసి గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి.

చేసే విధానం :

- నీరు మరిగించి, అందులో నన్నరి పొడి వేసి రెండు నిమిషాలు వుంచి ఆ తరువాత వడకట్టి తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.

-  ఇది శరీరానికి చలవ చేస్తుంది. ఫైల్స్‌ రాదు. మూత్రానికి పోయినప్పుడు మంట రాదు. పొడి దగ్గురాదు.