యూత్ అండ్ ట్రూత్ కాలేజీ క్యాంపస్ ముచ్చట్లు - మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగుళూరు

మార్మికుడితో కబుర్లు చెబితే అది విశ్వవ్యాప్తం అవుతుంది. దానికి కాలేజీ పిల్లల ఉత్సాహం కూడా కలిపితే జరిగేది ఇదే!
Youth and Truth Campus Gossip – Mount Carmel College, Bengaluru
 
Students of Mount Carmel College, Bengaluru

 

బెంగుళూరు, ప్యాలెస్ గ్రౌండ్స్ లోని మౌంట్ కార్మెల్ కాలేజ్, ప్రాంగణం ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. యూత్ అండ్ ట్రూత్ ఈవెంట్ కి సెక్యూరిటీ చూసుకుంటున్న విద్యార్థులు, ఆఖరి నిముషంలో వచ్చేవారిని లోపలికి పంపేందుకు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ, అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోంది. ఈ సెక్యూరిటీ చూసుకుంటున్న ఆడ పిల్లలు సైతం, నలుపు ఎరుపు యూనిఫాంతో ముస్తాబయ్యారు. 

The security girls for the Youth and Truth event at Mount Carmel College, Bengaluru

 

మార్మికునితో సంభాషించడానికి ఇంత శ్రమ పడాలా?

ఈ కార్యక్రమం ఉదయం 9.30 కి జరగాల్సింది. కానీ విద్యార్థులందరూ గంట ముందు నుంచే ఆరుబయట లైన్ లో ఉన్నారు. 

వారి మాటల్లోనే వారు ‘తమలో, తమ మధ్యకు ఒక మార్మికుడు వస్తున్నాడనేది తమకెంతో ఉత్తేజంగా ఉంది’ అన్నారు. వారందరికీ ‘ఆయన్ని చూడాలని, ఆయనతో సెల్ఫీలు దిగాలని, అయనతే మాట్లాడాలని, అన్నింటికీ మించి ఆయన చెప్పింది విని, వాళ్ల సమస్యలకు ఒక సరైన, స్పష్టమైన పరిష్కారం అందుకోవాలని ఉందని’ అన్నారు.

Sadhguru with the Principal and faculty of Mount Carmel College, Bengaluru

 

కాలేజీ అధ్యాపకులు ఒకరు, ‘‘తాము ఇంతకుముందు ఎవరో సెలబ్రిటీస్ కాలేజీకి వస్తే విద్యార్థులంతా వారిని చుట్టుముట్టడం చూశాము. కానీ ఒక గురువుకు ఇలాంటి స్వాగతం లభించటం మొదటిసారిగా చూస్తున్నాము’’ అన్నారు.

 

ఈ కార్యక్రమం నుంచి ‘మీరు ఏమి ఆశిస్తున్నారు?’ అని అడిగినప్పుడు రకరకాల సమాధానాలు వచ్చాయి. ‘ఆయన వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడతారు’ ‘ఆయన ఓ వంద గంటలు ధ్యానం చేయమని చెప్పరు’. ‘ఆయన సమాధానాలు మా సమస్యల పరిష్కారానికి సరైన సూచనలనిస్తాయి’ అన్నారు. కాలేజీ అధ్యాపక బృందం కూడా సద్గురు తమ కాలేజీకి రావడం, యువతతో మాట్లాడటం, యువతకి స్పష్టత బ్యాలెన్స్ ఇవ్వడం గురించి, ఎంతో ఉత్సాహంతో ఉన్నారు.

Sadhguru having a chat with the Principal of Mount Carmel College before the commencement of the Youth and Truth event

 

కొంతమంది అభిమానులు హాల్లో తమకు సీటు దొరకడంతో ఎంతో ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు. ఇంకొంతమంది ఎలాగోలా ఈ ‘కూల్ గురువు’ ని కనీసం చూడ్డానికైనా తపిస్తున్నారు. ‘విద్యార్థులు బయటకు తప్పించుకుపోయి క్లాసులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించడం చూశాము, కానీ ఇక్కడ జరిగేది దానికి వ్యతిరేకంగా ఉంది.’ అన్నారు కొందరు.

ఈ సంతోషాల మధ్య, ‘సద్గురు వివేకం తమను కష్ట సమయాల నుంచి బయట పడడానికి ఎలా సహాయం చేశాయో’ అని కొందంటున్నారు.

తలుపులా, ఫ్లడ్ గేట్సా? ఏది ఏమైనా అవి తెరుచుకున్నాయి!

ఆడిటోరియం తలుపులు తెరవగానే మొత్తం 2500 సీట్లు నిండిపోయాయి, ఇంకొంతమంది తోవలో దొరికిన ప్రతి అంగుళం ఆక్రమించేశారు. వాళ్లని కంట్రోల్ చేయడానికి వాలంటీర్లు కష్టపడాల్సి వచ్చింది.

Sadhguru in conversation with students of Mount Carmel College, Bengaluru

 

ఈ కార్యక్రమం సౌండ్స్ ఆఫ్ ఈశా పాటలతోను, ఈశా సంస్కృతి ప్రదర్శనతోనూ ప్రారంభమైంది. ‘సౌండ్స్ ఆఫ్ ఈశా’ కబీర్ భజన ‘అల్లా కే  బందే’  పాటతో హాలంతా కేరింతలతో నిండిపోయింది. అక్కడి ఉత్సాహం ఎవరూ అడ్డుకోలేరు.

The moderators of Mount Carmel College, asking questions to Sadhguru

 

సద్గురు వేదిక మీదికి వచ్చినప్పుడు కరతాళధ్వనులు మారుమోగిపోయాయి. ఆయన బాల్కనీలో ఉన్న వారితో ‘అక్కడ సరిపోయినంత కాంతి లేకపోతే, మీకు మీరే కాంతులు కండి’ అన్నప్పుడు హాలంతా చప్పట్లు, కేరింతలు మార్మోగిపోయాయి.

సద్గురు ‘తను కూడా కార్మెల్ విద్యార్థినే, ఒక సంవత్సరం క్రీస్తు ది కింగ్, మరో సంవత్సరం నిర్మలా కాన్వెంట్ లో’ అని అన్నప్పుడు, మరోసారి అలాగే హాల్లో హర్షధ్వానాలు మారుమ్రోగాయి. కార్యక్రమం ఉత్సాహపూరిత చర్చల మధ్య జరిగింది. సద్గురు చెప్పిన దానికి ఆమోదంగా సభికులు పెద్దగా హర్షద్వానాలు చేశారు.

కార్యక్రమం మొదట మోడరేటర్ వేసిన ప్రశ్నలతో ప్రారంభమైంది, తర్వాత కార్యక్రమానికి హాజరైన వారు ప్రశ్నలు అడగటం మొదలెట్టారు. మూడు గంటల తర్వాత కూడా వారికి ‘అడగాల్సింది, తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉన్నాయి’ అనిపించింది.

Students of Mount Carmel College viewing the Youth and Truth conversation in their campus

 

సెక్షన్ 377 దగ్గర నుంచి క్యాజువల్ రిలేషన్ షిప్స్ లో ఉండే ప్రేమ, ఆడవారితో దురుసు ప్రవర్తన, విద్యా విధానం దానిలోని పరిణామ విధానాలు, ఇంకా మానసిక రుగ్మతలు వాటి చికిత్స విధానాలు, మానసికంగా కృంగిపోయిన వారికి మందులు వాడటం, ఇలా అనేక రకాల ప్రశ్నలు అడిగారు.

సీట్లకు ఏమైనా అంటుకుపోయే మందు పూశారా?

కార్యక్రమం చివరిలో కూడా విద్యార్థులు గాని అధ్యాపకులు గాని తమ సీట్ల నుంచి లేవటం లేదు, సద్గురు నుంచి మరికాస్త తెలుసుకుందామని ఆశిస్తూనే ఉన్నారు. సద్గురు లేచి ఆడిటోరియం బయటికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ వారు ఒక హ్యూమన్ చైన్ గా ఏర్పడి సద్గురు మీదకు విద్యార్థులు గుంపుగా చేరకుండా చూడవలసి వచ్చింది.

సద్గురు తమ సీటు నుంచి లేస్తున్నప్పుడు ‘ఓట్ ఆఫ్ థాంక్స్’ చెప్పవలసిన అధ్యాపకురాలు, సద్గురుతో  ‘ఇంకా కాసేపు కూర్చోండి’ అని అడిగినప్పుడు, సద్గురు నవ్వుతూ ‘ఎస్ మేడం, నేను మళ్ళీ స్కూల్ కు వచ్చాను, అలాగే’ అంటూ నవ్వారు.

 

Sadhguru interacting with students of Mount Carmel College, Bengaluru after the Youth and Truth conversation

 

ఆడిటోరియంలో లోపలికి రాలేకపోయినా కొంతమంది విద్యార్థులతో సద్గురు క్యాంపస్ లో కొంత సమయం గడిపారు. వారిని యూనివర్సిటీ యంపీ థియేటర్ల కలిశారు. సద్గురును చూడటానికి, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి లేక ఒక ఫోటో తీసుకోవడానికి, కనీసం అయినా వేసుకున్న శాలువా డిజైన్ చూడటానికి అందరూ ఆయన  చుట్టూ గుమిగూడారు.

నిరీక్షణ ఉత్సాహంగా మారింది

కార్యక్రమం తర్వాత విద్యార్థులు సద్గురుని ఎలా ఆదరించారు అనేదానికి, విద్యార్థుల ఉత్సాహం ఒక సూచన. సద్గురుతో వేదిక మీద మోడరేట్ చేస్తున్న విద్యార్థులు, తమ సంతోషాన్ని, కార్యక్రమం తరువాత కూడా ఆపుకోలేక పోతున్నారు. నెలల తరబడి వాళ్లు ఈ కార్యక్రమం కోసం సన్నాహాలు చేసుకున్నారు. నిరీక్షణ, తమ తోటి విద్యార్థుల నుంచి ప్రశ్నలు సేకరించడం ఇవన్నీ దాదాపుగా నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. వాళ్లు సద్గురు భాషణలు చాలా స్ఫూర్తినిచ్చేయిగా ఉన్నాయని, తమ జీవితాలని మార్చేవిగా ఉన్నాయని, వాస్తవంగా ఉన్నాయని అన్నారు.

కార్యక్రమం అయ్యాక వాళ్ళ అనుభవం గురించి మాట్లాడినప్పుడు, వాళ్లు ‘ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నారు’ ‘ఆయన మమ్మల్ని చాలా కంఫర్టబుల్ గా ఉండేట్లు చూశారు’ ‘ఆయన చలోక్తులు చాలా బాగున్నాయి’ ‘ఆయన మమ్మల్ని కూడా తమతో సమానంగా చూసుకున్నారు’ ‘ఆయన మా అభిప్రాయాలను తోసిపుచ్చలేదు’ అన్నారు. 

Youth and Truth, మీడియా వార్తలు

ఈ కార్యక్రమాన్ని న్యూ - ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ పత్రికలో తెలియచేసింది:

Sadhguru Jaggi Vasudev to visit Mount Carmel

‘Reactionary feminism will not help’

Youth and Truth, MCC - కొన్ని ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానం 

 

 

 

 

 

 

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1