అంతరంగాన్ని చూసేందుకు సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleAug 27, 2017
అంతరంగాన్ని చూసేందుకు సద్గురు చెప్పిన 5 సూత్రాలు :
- మన సంక్షేమానికి కావలసింది మన అంతరంగంలోకి మరింత లోతుగా పోవడం అనే విషయం తెలియక, మానవ సంక్షేమ సాధనలో మనం ఈ గ్రహాన్ని చెల్లాచెదురు చేసాం.
- జీవితాన్ని తెలుసుకోవడానికి మీకున్న ఏకైక ద్వారం మీరే. దాన్ని తెరిచి ఉంచండి.
- మీ చేతన (consciousness) పూర్తిగా వికసిస్తే, తెలుసుకోగలిగినవన్నీ మీకు తెలుస్తాయి.
- మీ జీవితానుభూతి మీలో మీరెలా ఉన్నారన్నదాని మీద ఉంటుందే గాని, మీ చుట్టూ ఎవరున్నారు లేక ఏమున్నాయన్నదానిపైన ఆధారపడి ఉండదు.
- మీకు ఆనందం కావాలంటే, మీరు అంతర్ముఖులు అవ్వాలి. ఎందుకంటే అది తయారయ్యేది అక్కడే.