కావాల్సిన పదార్థాలు


గసగసాలు    -    1/4 కప్పు
చక్కెర          -    సగం కప్పు
పాలు            -    1 కప్పు
ఏలక్కాయలు-    కావలసినంత
జీడిపప్పులు  -    10
నెయ్యి           -    1-స్పూను 

చేసే విధానం:

గసగసాలు నీటిలో 2 లేక 3 గంటలు నానపెట్టి మెత్తగా నూరుకోవాలి. ఒక బాణలిలో నీరు పోసి (1 కప్పు) చక్కెర వేసి, పాకం-రానివ్వాలి. ఆ తరువాత తీగపాకం-వచ్చాక-గసగసాల ముద్ద వేసి, పచ్చి వాసన పోయేదాకా-మరిగించాలి. ఆఖరికి-పాలుపోసి ఏలకుల పొడి చల్లుకుని, నెయ్యిలో వేయించిన జీడిపప్పు కూడా కలుపుకుని తినాలి.