నవరాత్రి ప్రాముఖ్యత

nn

Sadhguruయోగ సంప్రదాయంలో, భూమి ఖగోళ-భూమధ్యరేఖకి, సూర్యుడు అత్యంత దూరంగా ఉండే రెండు సందర్భాలలో (ఆయనాలు) ఒకటి జూన్ నెలలోనూ, ఒకటి డిశంబరు నెలలోనూ వస్తాయి. జూన్ నెలలో వచ్చే ఆయనం సమయంలో, సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణ దిశగా తన ప్రయాణం ప్రారంభిస్తాడు. దానిని దక్షిణాయనము అంటారు. అలాగే డిశంబరు నెలలో ప్రారంభమయే ఆయనంలో సూర్యుడు తన ప్రయాణాన్ని దక్షిణం నుండి ఉత్తరదిక్కువైపు ప్రారంభిస్తాడు. దాన్ని ఉత్తరాయనము అంటారు. డిశంబరు నుండి జూన్ వరకూ జరిగే సూర్యుడి ఉత్తరాయన కాలాన్ని జ్ఞాన పధం అంటారు. అలాగే, జూన్ నుండి డిశంబరువరకు జరిగే సూర్యుడి దక్షిణాయనాన్ని సాధన పధం అంటారు.

దక్షిణాయనము, అన్యోన్యతని ఉద్దీపనము చేసే సమయం. అది ప్రకృతి స్త్రీత్వాన్ని మూర్తీభవించే సమయం. అప్పుడు భూమి తన స్త్రీత్వాన్ని ధరిస్తుంది. స్త్రీ శక్తితో నిండిన పండుగలు జరుపుకునేది ఈ ఆరు నెలలలోనే. ఈ దేశ సంస్కృతి అంతా దానితో శృతి కలిసి ఉంది. ప్రతి నెలలోనూ ఏదో ఒక పండుగ వస్తుంది.

ఆ రోజు తర్వాత వచ్చే మొదటి అమావాస్య మొదలుకుని ఉత్తరాయణం ప్రారంభమయే వరకూ గల మూడు నెలల కాలాన్నీ “దేవీ పధం” అంటారు.

ఈ స్త్రీత్వం నిండిన ఆరు నెలలలో, సెప్టెంబరు 22న శరద్ విషువత్ (అంటే రాత్రి పగలూ సమంగా ఉండే రోజు)వస్తుంది. ఆ రోజు తర్వాత వచ్చే మొదటి అమావాస్య మొదలుకుని ఉత్తరాయణం ప్రారంభమయే వరకూ గల మూడు నెలల కాలాన్నీ “దేవీ పధం” అంటారు. ఈ త్రైమాసికంలో, భూగోళపు ఉత్తరార్థం  స్తబ్దంగా  (మందకొడిగా) మారుతుంది. దీనికి కారణం, ఆ సమయంలో సూర్యుడి నుండి అతి తక్కువ వెలుగు అక్కడ పడుతుంది. అందుకని అన్నీ మందకొడిగా ఉంటాయి. వాటి సహజమైన చురుకుదనంతో ఏ ప్రాణీ పని చెయ్యలేదు.

మహాలయ అమావాస్య తరువాతి రోజు నవరాత్రికి నాంది పలుకుతుంది. నవరాత్రి అంతా ఈ స్త్రీ దేవతే. కర్ణాటకలో నవరాత్రి అంతా చాముండేశ్వరికి చెందితే, బెంగాలులో అది అంతా “దుర్గ”కు చెంది ఉంటుంది. అలాగే, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక దేవత గురించి జరుపబడుతుంది. అయితే, ముఖ్యంగా నవరాత్రి, ‘దేవీని’ పూజించే, అంటే, స్త్రీ దేవతలనీ, లేదా దైవత్వాన్ని ఆరాధించే పండగ.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
commons.wikimedia.orgఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert