మన సంస్కృతిలో నదుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

kashi-ganga-arti

అసలు మన సంస్కృతిలో నదుల ప్రాముఖ్యత ఏమిటి?  అసలు మనం నీటిని ఎందుకు పూజిస్తున్నాము? అనే సందేహాల గురించి సద్గురు చెప్పిన వివరణ కోసం ఈ వ్యాసం తప్పక చదవండి.


సద్గురు: ఈ సంస్కృతిలో నదులను మనం కేవలం జలాశయాలుగా చూడలేదు, వాటిని మనం జీవాన్నిచ్చే దేవుళ్ళు, దేవతలుగా చూస్తాము. తార్కిక పరిమితులకు లోబడి మాత్రమే ఆలోచించగల మనసుకి ఇది మూర్ఖంగా, చాలా ప్రాధమికంగా అనిపించవచ్చు. నది ఒక నదే. అది ఒక దేవత ఎలా అవుతుంది? అటువంటి వ్యక్తిని ఒక గదిలో బంధించి అతనికి మూడు రోజుల పాటు నీరు ఇవ్వకుండా, తరువాత అతనికి ఒక గ్లాసు నీరు చూపిస్తే, అతను ఆ గ్లాసు నీటికి వంగి నమస్కరిస్తాడు. నదికి కాదు, కేవలం ఒక గ్లాసు నీటికి నమస్కరిస్తాడు. మనం నీరు అని పిలిచేది, గాలి అని పిలిచేది, ఆహారం అని పిలిచేది, మనం భూమి అని పిలిచేది ఇవన్నీ కూడా వస్తువులు కాదు. అవి జీవాన్ని సృష్టించే పదార్ధాలు.

ఈ సంస్కృతిలో మనం ఏదో తెలియని దేవతలను ఎన్నడూ పూజించలేదు. భారతదేశంలో ఏ దేవుడూ అక్కడ లేడు. మనం పూజించే దేవతలందరూ కూడా ఈ ప్రపంచంలో ఏదో ఒక సమయంలో నడిచి వెళ్ళిన వారే, ఎక్కడో స్వర్గంలో ఉన్నవారు కాదు, ఈనేల మీద నడిచిన వారే. మీరు శివుడిని తీసుకున్నా, రాముడిని తీసుకున్నా, కృష్ణుడిని తీసుకున్నా అందరూ కూడా ఈ నేల మీద నడిచిన వారే, ప్రతి మానవుడూ ఎదుర్కునే, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నవారే. వారిలోని ఒకే ఒక గొప్ప విషయం ఏమిటంటే… ఏది ఏమైనప్పటికీ, వారి చుట్టూ ఎటువంటి సంఘటనలు సంభవించినప్పటికీ, ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, వారి అంతర్గత స్వభావం నుండి పక్కకు తప్పుకోలేదు. వారు చాలా సార్లు సఫలీకృతులవలేదు. వారు ఆశ్చర్యకరంగా గొప్ప ఫలితాలను సాధించలేదు. నిజానికి వారు వారి జీవితాలలో వైఫల్యం పొందారు. అయినప్పటికీ, వారు ఒక మానవుడుకి అంతర్గతంగా ఉండవలిసిన స్వభావం నుండి పక్కకి తొలగలేదు.

బయట ఏమి జరుగుతున్నా.. బయట ఎలాంటి ఉపద్రవాలు వచ్చిన…, మీరు  మహాభారతం అని పిలిచేది కూడా ఆది నుండి ముగింపు వరకు ఒక పెద్ద ఉపద్రవమే, భయంకరమైన యుద్ధంలో అన్నీ అంతమై పోతాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం తనను ఏమీ తాకకుండా, చరుకుగా పాల్గొన్నా కూడా తనను ఏమీ తాకకుండా ఉన్నాడు. అందుకోసం మనం ఆయనను పూజిస్తాము. అంతే కానీ వారి విజయాలకు కాదు, వారి శక్తులకు కాదు, వారు స్వర్గం నుండి వచ్చినందుకు కాదు, వారందరూ కూడా వారి తల్లులనుండి సాధారణ జన్మను పొందారు. ఎవరూ కూడా ఆకాశం నుండి ఊడిపడలేదు. వారందరూ కూడా మనలానే ఈ నేల మీద నడిచారు, మనందరమూ అనుభవించే దానిని, ఇంకా అంత కన్నా ఎక్కువే అనుభవించారు. కానీ మనం వారిని పూజిస్తాము. ఎందుకంటే వారిని ఎవరూ తాకలేరు.

ఎన్నో విధాలుగా ఓ నది ఆ స్వభాన్ని ప్రతిబింబిస్తాయి. ఎటువంటి వారు దానిని తాకినా కూడా దానికి ఏమీ అవదు. ఎందుకంటే అది దాని ప్రవాహ స్వభావం కారణంగా ఎల్లప్పుడూ స్వచ్చంగా అలాగే ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert