జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించండి!

sadguru4

జీవితాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నవారి నుంచే వైరాగ్యం అనే మాట వచ్చింది. వీరి మూలంగానే ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత పట్ల ఒక విధమైన ఏవగింపు వచ్చేసింది. ఆధ్యాత్మికత అంటే జీవితం పట్ల ఏ ఆసక్తి లేనివారికేనని ప్రస్తుతం చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి ఆధ్యాత్మికత అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని అర్ధం. ఆధ్యాత్మికత అంటే మీ ఆసక్తి కేవలం భౌతిక జీవితం గురించే కాదు, జీవితంలోని అన్నికోణాల గురించి అని.

కాని సగటు మనిషి అర్ధం చేసుకునేదేమిటంటే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడంటే, సరిగా తినకూడదు, సరిగా బట్టలు కట్టుకోగూడదు, సరిగా జీవించకూడదు, అణగి పోయి ఉండాలి లేదా కనీసం అలా కనపడాలి అని. మీరు ఆనందంగా, సంతోషంగా ఉంటే, జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, మీరు ఆధ్యాత్మికులు కాదని అనుకుంటారు. ఎప్పుడూ చిరునవ్వు ఎరుగని మేక పోతులా, గంభీరంగా ఉంటేనే మీరు ఆధ్యాత్మికులని అనుకుంటారు. ఇదంతా వైరాగ్య సిద్ధాంతాల మూలంగా వచ్చిన ఆలోచనల వల్లే.

వైరాగ్యంతో మీరు జీవితాన్ని తెలుసుకోలేరు. పూర్తి ఆసక్తి చూపితేనే జీవితాన్ని తెలుసుకోగలరు. 

మీరు భూమి మీదకి వచ్చింది జీవించటానికి, తప్పించుకోవడానికి కాదు. ఆధ్యాత్మికత అంటే మీరు జీవితంలోని పై పై మెరుగులతో సరిపెట్టుకునే వారు కాదని, జీవత మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారని అర్ధం. వైరాగ్యంతో మీరు జీవితాన్ని తెలుసుకోలేరు. పూర్తి ఆసక్తి చూపితేనే జీవితాన్ని తెలుసుకోగలరు. జీవితం మీద మీ ఆసక్తి ప్రస్తుతం ఉన్నదానికంటేచాలా ఎక్కువైతేనే మీకు ఆధ్యాత్మికత తెలుస్తుంది. అంతేకాని జీవితాన్ని తప్పించుకుందామనుకుంటే మీరు ఆధ్యాత్మికతను తెలుసుకోలేరు.

రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ప్రకృతి అన్నా, జీవితం అన్నా చాలా ఇష్టం. ఆయన ముసలితనంతో మంచం పట్టినప్పుడు, స్నేహితులు ఆయన చుట్టూ చేరి, అవసాన కాలము సమీపించింది కాబట్టి భగవన్నామ స్మరణ చేసి భగవంతుణ్ణి ముక్తి కావాలని ఆయనను కోరుకోమన్నారు. అప్పుడు ఆయన, “ముక్తితో నేనేమి చేసుకోను, నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలని ఉంది- మీరే చూడండి ప్రపంచమెంత అద్భుతమైనదో చూడండి, ప్రకృతి ఎంత దయకలదో చూడండి, నిజంగా భగవంతుడుంటే ఈ ప్రకృతితో ఉండటానికి నన్ను మళ్ళీ మళ్ళీ ఇక్కడకు పంపమని అడుగుతాను” అన్నాడు. అలా జీవితంతో నిమగ్నమైన వారికే జీవితమంటే ఏమిటో తెలుస్తుంది. మిగతా వారికి కాదు….

ప్రఖ్యాత శాస్త్రవేత్త న్యూటన్ కూ  అలానే జరిగింది. ఆయనకు మృత్యువు సమీపించినప్పుడు, ఆయన “నాకు ఈ సైన్సు అంటే ఏమీ తెలియదు. నేను సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకోవటంలో జీవితాన్ని వ్యర్ధం చేశాను. అసలు సముద్రాన్ని అన్వేషించలేదు. నాకు సముద్రాన్ని అన్వేషించే  అవకాశం మళ్ళీ వస్తే బాగుంటుంది” అన్నాడు.

వారు జీవితాన్నిబాగా ఆస్వాదించినవారు. అంతేకాని జీవితంపై నిరాసక్తతతో ఉన్నవారు కాదు. జీవితాన్ని ఆస్వాదించండి, నిజమైన ఆధ్యాత్మికులు అవండి!

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert  • indu

    how to come ashram from vizag

    • vijay

      Coimbatore Airport to ashram will take 1 to 1.30 hours. Cabs are available from airport.For non ac-1000rs and AC 1200rs they will charge.