విజయ సాధన చిట్కాలు – 3/5

optical_glasses_201803

విజయం మీతో ఎప్పుడూ దోబూచులాడుతుందని మీరు అనుకుంటుంటే, బహుశా మీరు ఒక కొత్త పద్ధతిలో ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమయిందని అర్ధం. మీరు చేసేదేదైనా, దాంట్లో  మీరు విజయం సాధించేందుకు సహాయపడే  కొన్ని చిట్కాలను  సద్గురు ఒక సందర్భంలో తెలియజేసారు.  వాటిలో మూడొవ దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


చిట్కా – 3 : స్పష్టతతో పని చేయండి !

success3

మనిషికి కావలసింది స్పష్టత, విశ్వాసం కాదు. ఉదాహరణకి మీరు ఒక గుంపు మధ్య నుండి నడవవవలసి వస్తే, మీ చూపు స్పష్టంగా  ఉండి, ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు  కనిపిస్తే, మీరు ఆ మొత్తం గుంపు గుండా ఎవరినీ తాకకుండా నడిచి వెళ్ళగలరు. మీ చూపులో స్పష్టత లేకుండా మీలో విశ్వాసం మాత్రం ఉంటే, మీరు వారందరి మీద నుంచి నడిచి వెళతారు. ప్రజలు స్పష్టత లేనప్పుడే విశ్వాసాన్ని దానికి మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కాని అలా భావించడం సరికాదు.

  ప్రజలు స్పష్టత లేనప్పుడే విశ్వాసాన్ని దానికి మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కాని అలా భావించడం సరికాదు.

ఉదాహరణకి మీరు ఇలా చేయండి. మీరు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నప్పుడల్లా, ఒక నాణాన్నితీసుకుని దాన్ని ఎగరేయండి. బొమ్మపడితే ఒకటి, బొరుసు పడితే మరొకటిగా నిర్ణయించుకోండి. మీరు మీ జీవితపు ముఖ్యమైన నిర్ణయాలను ఇలా తీసుకుంటే, అది 50% సార్లు మాత్రమే పని చేస్తుంది. మన నిర్ణయాలు 50% సార్లు మాత్రమే సరవుతున్నప్పటికీ మనం చేయగల ఉద్యోగాలు కేవలం రెండు మాత్రమే ఉంటాయి – ఒకటి వాతావరణ సూచనలు చెప్పడం, రెండొవది జ్యోతిష్యం చెప్పడం. మీరు పనిచెసే తీరు ఇలా ఉంటే, ఈ భూమి మీద ఇక ఏ ఇతర ఉద్యోగాన్ని మీరు నిలుపుకోలేరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert