Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మీరు చేస్తున్న పని ముఖ్యమైనది అనుకుంటే, మీపై మీరు పని చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది.
మీకు ఒంటరిగా అనిపిస్తున్నది, మీరు ఒక్కరే ఉన్నందు వల్ల కాదు. మీకు ఒంటరిగా అనిపిస్తున్నది, మీ చుట్టూ ఉన్నదాన్నంతా తిరస్కరించడం వల్ల.
వ్యాపారం మానవులు బాగుండడం కోసమే సృష్టించబడింది. వ్యాపారం బాగుండడం కోసం మానవులు సృష్టించబడలేదు.
విశ్వాసం ఇంకా మూర్ఖత్వాలు చాలా ప్రమాదకరమైన జోడి, కానీ సాధారణంగా అవి రెండూ జతగా ఉంటుంటాయి.
నాకు తెలిసిన ప్రతిదీ, మా గురువుగారికి తెలిసిన ప్రతిదీ, సమస్త ఆధ్యాత్మిక సాంప్రదాయానికి తెలిసినది, ధ్యాన లింగంలో శక్తి రూపంలో నిక్షిప్తమై ఉంది. నేను కేవలం ఒక పర్యవసానం మాత్రమే.
యోగ అనేది సూపర్ హ్యూమన్ గా అవ్వడం గురించి కాదు. అది హ్యూమన్ గా ఉండటమే సూపర్ అని తెలుసుకోవడం గురించి.
జీవితంలో అత్యున్నత సంభావ్యతను చేరుకోవాలనే తపనతో మీరు జీవిస్తే, ఆ తపనలోనే విముక్తి ఉంది.
ప్రశాంతత, ఆనందం అనేవి మీరు జీవితం ఆఖరులో పొందేవి కావు. అవి మీ జీవితానికి మూలం.
మీకు లభించే దానితో మీరు కేవలం జీవనోపాధిని మాత్రమే పొందగలరు. కానీ మీరు ఇచ్చే దాని ద్వారా మాత్రమే మీరు జీవితాన్ని సృష్టించుకోగలరు.
మీరు ఆనందాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. మీరు బాధను కల్పించుకోకపోతే, మీరు ఆనందంగానే ఉంటారు.
మీరు వివాహాన్ని ఒక వ్యవస్థగా పిలిస్తే, ప్రజలు సహజంగానే దాని నుండి తప్పించుకోవాలని చూస్తారు.
ఆఖరికి దేవుడు కూడా మీ ఆంతరంగిక శ్రేయస్సును నిర్ణయించలేడు. మీకు మీరు దుఃఖాన్ని కలిగించుకోవటానికి నిరాకరిస్తే, దాన్ని ఎవ్వరూ కూడా మీపై రుద్దలేరు.