Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీరు మిమ్మల్ని బాధపెట్టుకోవాలనుకుంటే, లెక్కలేనన్ని అవకాశాలున్నాయి, ఎందుకంటే ఎప్పుడూ, ఎవరో ఒకరు మీకు నచ్చనిదేదో చేస్తుంటారు.
యోగా అనే పదానికి అర్థం ఐక్యం. అంటే మీరు ఎరుకతో మీ వ్యక్తిత్వపు హద్దుల్ని చెరిపేసి, మిగతా విశ్వంతో ప్రతిధ్వనించడం.
స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే.
మట్టి కేవలం వ్యవసాయం గురించి మాత్రమే కాదు; అది జీవం గురించి. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు జీవానికి పునాది. అవి వర్ధిల్లకపోతే, మనం వర్ధిల్లే అవకాశమే లేదు.
ధ్యానలింగం ఆవరణలో కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంటే చాలు, ధ్యానం అంటే ఏమిటో తెలియని వారు కూడా, గాఢమైన ధ్యానస్థితిని అనుభూతి చెందగలరు.
జీవం అన్నింటినీ కలుపుకుంటుంది. కేవలం మీ మనసే ప్రత్యేక భావనతో ఉంటుంది.
మీరు ఎంత చేస్తున్నారన్నది కాదు, మీ అనుభూతి ఎంత లోతుగా ఉన్నది అన్నదే మీ జీవితాన్ని సుసంపన్నం చేసి, సంతృప్తినిస్తుంది.
పురుషత్వం, స్త్రీత్వం అనేవి మీలోని రెండు కోణాలు. ఏదో ఒక దానితోనే అతిగా గుర్తింపు ఏర్పరచుకుంటే, మీరు సగం జీవం అవుతారు.
మీరు ఏదోక రోజు చనిపోతారన్నది మీ ఎరుకలో ఉంటే, అప్పుడు మీరు మీకూ, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ, ఏది నిజంగా అవసరమో అది తప్ప మరేదీ చేయరు.
మీరు తినే తీరు మీ శారీరక ఆరోగ్యాన్నే కాదు, మీ ఆలోచనలు, భావనలు, ఇంకా మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది.
మీ మనస్సు, శరీరం, ఇంకా ప్రాణశక్తులపై ఇంకొంచెం పట్టు సాధించారంటే, మీ విధికి మీరే విధాతలు కాగలరు.
నాయకునిగా ఉండడమంటే పెత్తనం చెలాయించడం కాదు. ప్రజలు తమకు అసాధ్యమనుకున్న వాటిని చేసేలా వారిని శక్తిమంతం చేయడమే నాయకత్వం.