సద్గురు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను, ఇంకా మనం చేపట్టే ఏ పనిలోనైనా విజయం చేకూరేలా చూసుకోవడానికి, శ్రద్ధ ఎలా ప్రాథమిక ఆధారంగా ఉంటుందో వివరిస్తున్నారు. యోగ దృక్కోణం నుండి మనస్సు యొక్క నిర్మాణం గురించి ఆయన మాట్లాడారు, ఇంకా చైతన్యంతో అనుసంధానించబడిన మనస్సు యొక్క ఒక పార్శ్వమైన ‘చిత్త’ గురించి వివరించారు. "మీరు మీ ‘చిత్త’కు ఏ రూపాన్ని ఇస్తారో, అది ఎల్లప్పుడూ ప్రపంచంలో వ్యక్తమవుతుంది" అని ఆయన అంటారు. ఇన్‌సైట్: ద డిఎన్ఏ ఆఫ్ సక్సెస్ "ఇన్‌సైట్:ద డిఎన్ఏ ఆఫ్ సక్సెస్" అనేది ఈశా లీడర్‌షిప్ అకాడమీ నిర్వహించే నాలుగు రోజుల బిజినెస్ లీడర్‌షిప్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఇది ఒకరి వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే కళను, అంతర్గత శ్రేయస్సు యొక్క విజ్ఞానంతో మిళితం చేస్తుంది. 2014 నవంబర్ 27 - 30 వరకు కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో - పాల్గొన్న వారితో పాటు బిజినెస్ ఐకాన్ రతన్ టాటా, సద్గురు, రామ్ చరణ్, జి.వి. ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సహ-చైర్మన్ మరియు సీఈఓ) ఇంకా 21 మంది ఇతర సీనియర్ వ్యాపార నాయకులు కూడా పాల్గొన్నారు.