FILTERS:
SORT BY:
మీ మనస్సు నైజం ఇలా ఉంటుంది: మీరు ఏ ఆలోచనలైతే రాకూడదని ప్రయత్నిస్తారో, అవే మళ్లీ మళ్లీ వస్తుంటాయి.
మీరు కేవలం మీ మనశ్శరీరాలను బట్టి పోతే, జీవితం ఓ సర్కసు. దైవిక జ్ఞానం మీ జీవితానికి మార్గనిర్దేశనం చేస్తే అదొక నృత్యమై పోతుంది.
కాలభైరవుడు అంటే కేవలం మరణం గురించే కాదు - కాలం గురించి కూడా. మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందనేది, మీరు మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
మీ అంతరంగం నిశ్శబ్దంగా మారినప్పుడు, మీరు ఊహించని రీతిలో జీవితాన్ని గ్రహిస్తారు - అత్యంత లోతుగా.
మహిళలను గౌరవించని, ఆదరించని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు, వర్ధిల్లదు. ప్రపంచమంతా స్త్రీత్వం వికసించాలని ఆశిద్దాం.
మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మిమ్మల్ని బాధపెట్టడానికి ఇతరులు చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఈరోజు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారు కష్టపడాల్సి వస్తోంది. మనిషి అనుభవానికి మూలం తన అంతరంగంలోనే ఉందని మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.
ఒక పువ్వుకు సువాసన ఎలాంటిదో, మనిషికి ప్రేమ అలాంటిది.
మీరు చేసే ప్రతి పనిలో విజయం, ఆనందం కావాలనుకుంటే, అత్యంత ముఖ్యమైన విషయం 'స్పష్టమైన అవగాహన'.
మీ చుట్టుపక్కల వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి మీకు ఇతరుల సహకారం కావాలి. కానీ మీ శరీరాన్ని, మనస్సుని, మరియు శక్తిని ఆహ్లాదకరంగా ఉంచుకోవడం నూటికి నూరు శాతం మీ చేతుల్లో పనే.
నిండు వసంతకాల సమయంలో హోలీ వస్తుంది. ఇది రంగులు, ప్రేమ ఇంకా ఉత్సాహంతో మీ జీవితాన్ని పండుగలా జరుపుకోవాల్సిన సమయం.
మీ జీవితానికి కావలసిన ముడిసరుకు మాత్రమే మీకు ఇవ్వబడింది. దానితో మీ జీవితాన్ని ఎలా మలచుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది.
మీ జీవిత పరిస్థితి ఎలా ఉన్నా, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వట్టి చేతుల్తోనే వచ్చారు, కాబట్టి మీరు ఎప్పుడూ లాభంలో ఉన్నట్టే.