Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఇతరుల నుంచి ఏదో ఆశించడమంటే, మీరు వారి జీవితాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని. ముందు మీ జీవితాన్ని తీర్చి దిద్దుకోండి – అదే స్వేచ్ఛ.
ఆనందం మీతోనే మొదలవుతుంది – అంతేకాని మీ బాంధవ్యాలతో, ఉద్యోగంతో, లేక ధనంతో కాదు.
మనం జీవం పట్ల సున్నితత్వం కలిగి ఉండాలి - అంతేకానీ మన ఆలోచనలు, భావోద్వేగాలు, అహంకారాలు, సిద్ధాంతాలు, నమ్మకాల పట్ల కాదు. ఎందుకంటే, జీవమే అత్యంత విలువైనది.
హోలీ అంటే, జీవితం ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియ అని గుర్తించడం. ఈ రోజున, మీరు పూర్తిగా జీవంతో తొణికిసలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే జీవకళతో ఉండడం అనేది అత్యంత అమూల్యమైన విషయం.
నీరు ఒక వస్తువు కాదు, అది జీవనాధార పదార్థం. మీ శరీరంలో మూడింట రెండొంతులు నీరే; ఈ వాస్తవాన్ని గుర్తెరిగి ఉండడం మనిషి మనుగడకు చాలా కీలకం.
మీకు స్ఫూర్తి కావాలంటే, ఓ పుస్తకం చదవండి. కానీ నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే, ఏకైక మార్గం అంతర్ముఖలు అవ్వడమే.
వ్యక్తుల్లో పరిణామం తీసుకురాకుండా, ప్రపంచ స్థాయిలో పరిణామం తీసుకురావడం అసాధ్యం.
మీరు ఎవరిని కలిసినా, వారితో మాట్లాడేందుకు ఇదే ఆఖరి అవకాశం అన్నట్లుగా మాట్లాడండి. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
అడవులు, నదులు, పర్వతాలు మనకంటే ఎంతో పెద్ద జీవాలు. అనేక విధాలుగా మన జీవితాలకు మూలాలు, మన జీవనాధారాలు. అవి సురక్షితంగా ఉండడానికి కావలసింది మనం చేసేవాటన్నింటిలో కాస్త జాగ్రత్త వహించడమే.
మానవునిగా ఉండడమంటే, మీకు తారసపడే ప్రతి ఒక్కరికీ, ప్రతిదానికీ ఎరుకతో మీకు వీలైనంత ఉత్తమమైనది చేసేందుకు ప్రయత్నించడం.
మీకు మృత్యువు తప్పదు అనేది మీ ఎరుకలో ఉంటే, మీరు దేనినీ అంత సీరియస్ గా తీసుకోరు, కానీ సాధ్యమైనంత వరకు తీక్షణంగా జీవించాలని పరితపిస్తారు.
సందేహం మంచిదే – అంటే మీరు సత్యం కోసం వెతుకుతున్నారని. అనుమానం మాత్రం ఒక వ్యాధి.