Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మీరు ఆర్జించింది మీది కావచ్చు. అది ఎప్పటికీ ‘మీరు’ కాలేదు.
మీ ఆలోచనలు, మనోభావాలు మీ భూతాలే. మీరే వాటిని సృష్టిస్తారు, ఆపై అవి అదుపుతప్పి మిమ్మల్ని పీడిస్తాయి. ఇది సరిగా డైరెక్ట్ చేయని హర్రర్ మూవీ లాంటిది.
ఙ్ఞానాన్ని సముపార్జించవచ్చు. ప్రజ్ఞ అనేది సాక్షాత్కారం. వివేకాన్ని సంపాదించాల్సి ఉంటుంది, దానికి జీవితకాలం పడుతుంది.
మీ ఆలోచనలు కేవలం మీకున్న సమాచారాన్ని తిరగతోడడమే. అక్కడ యదార్ధంగా నూతనమైనదేదీ జరగదు.
ఒకరు తాము చాలా మంచివారమనే బిరుదును ఆపాదించుకున్నప్పుడు, అనివార్యంగా వారు చాలా క్రూరంగా మారతారు.
స్వేచ్ఛ అంటే మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకునే శక్తిని కలిగి ఉండడం, అది వేరే దేనిచేతా నిర్ణయింపబడక పోవడం
మీరు మీ సర్వస్వాన్ని ధారపోసి, ఏది వస్తుందో ఏది రాదో అని పట్టించుకోనప్పుడు మీ జీవితం అందంగా మారుతుంది. జీవితంలోని అసలైన ఆనందం వ్యక్తపరచడంలో ఉంది, యాచించడంలో కాదు.
కష్టం మనకు ఎదురయ్యే ఓ పరిస్థితి. బాధ మనం సృష్టించుకునే మానసిక స్థితి.
ఒత్తిడి అనేది మీ జీవిత పరిస్థితుల వల్ల కాదు. మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకోవాలో తెలియక పోవడం వల్లే వస్తుంది.
మీలోని జీవన మూలమే మీ అత్యున్నత ప్రామాణికమైతే, మీ చుట్టూ ఉన్న వారి అభిప్రాయాలు, తీర్పులు మీపై ప్రభావం చూపలేవు.
అంతరంగంలోని నిశ్చలతను ఎవరైతే స్పృశించరో అతడు చలనంలో దారి తప్పుతాడు
నమ్మేవారు, నమ్మని వారు ఒక పడవలోనే ఉన్నారు. ఒకరి నమ్మకం అనుకూలం, మరొకరిది ప్రతికూలం. ఇద్దరూ తమకు తెలియదని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.