FILTERS:
SORT BY:
మీరు దేన్నైతే ప్రేమిస్తారో దానికి నిజంగా కట్టుబడి ఉంటే, ప్రపంచమంతా మీకు మద్దతు ఇస్తుంది.
ప్రపంచంలో మనం ఎవరు అనేది కాలం, పరిస్థితుల ప్రభావంతో రూపుదిద్దుకుంటుంది. కానీ మన అంతర్యంలో మనం ఎవరనేది మాత్రం వాటికి ప్రభావితం కాకూడదు.
జీవం కంటే గొప్ప లక్ష్యం మరొకటి లేదు.
మీలో కోపం, పగ, అసూయ లేనప్పుడు, మీరు దేనిని తాకినా ప్రేమగానే తాకుతారు.
మీ మేధస్సు మీ కోసం పనిచేస్తుంటే, మిమ్మల్ని మీరు బాధపెట్టుకోరు. అంతర్ముఖంలో మీరు ఉత్తమంగా ఉంటారు, బయట మీకు సాధ్యమైనంత ఉత్తమమైన పని చేస్తారు.
మీరు ఎంత గాఢంగా లీనమవుతారో, మీ జీవిత అనుభవం అంత గాఢంగా ఉంటుంది.
రేపు ఎలా జరుగుతుందనేది, ఈ రోజు మీ ఆలోచన, మీ భావన, ఇంకా జీవితాన్ని మీరు చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది.
జీవితాన్ని ఎలా స్వీకరించాలో తెలిసిన వారికి అది ఎంతో ఉదారంగా ఉంటుంది. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిన వారు పరిపూర్ణతను అనుభవిస్తారు. ఈ ‘ధన్య పూర్ణిమ’ శుభవేళ, మీరు జీవితపు ఉదారతను స్వీకరించడానికి సంసిద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీరు ఎంత కాలం జీవించారన్న దానికంటే, జీవితం యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం.
సమాచారం అందరికీ అందుబాటులో ఉన్న ఇప్పటి ప్రపంచంలో, విద్య స్ఫూర్తిదాయకం కావాలి కానీ, కేవలం విషయ సేకరణ కాకూడదు.
మీలో నిరంతరం రెండు ప్రాథమిక శక్తులు పనిచేస్తూ ఉంటాయి: ఒకటి ఆత్మరక్షణ, రెండవది విస్తరించాలనే తపన. మీరు ఎప్పుడైతే ఈ ఆత్మరక్షణ అనే సహజాతాన్ని అధిగమిస్తారో, అప్పుడు మీ శరీరంలోని ప్రతి కణం ఎంతో హాయిని పొందుతుంది.
మీ ప్రాణశక్తిలో ఉత్తేజాన్ని, మీ మనసులో నూతనత్వాన్ని, మీ గుండెల్లో ప్రేమని నిలుపుకుంటే, ప్రతి రోజు ఒక కొత్త సాహసమే.