శీతాకాలపు ఆరంభాన్ని సూచించే ధనత్రయోదశి, దీపావళి పండుగలను సంపదకు సంబంధించినవిగా భావిస్తారు, కానీ అవి నిజానికి ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఎంతో ముఖ్యమైనవి. ఈ వీడియోలో సద్గురు వివరిస్తున్నదేమిటంటే, శీతాకాలంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం పెరగడం వల్ల మానవ వ్యవస్థలో జడత్వం పెరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో. ఈ జడత్వాన్ని అధిగమించి, చైతన్యవంతంగా, శక్తివంతంగా ఉండటానికి, ఈ పండుగలను మనం ఎలా సద్వినియోగం చేసుకోగలమో ఆయన లోతుగా వివరిస్తారు.