1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు
Also in:
English

దీపావళి & ధనత్రయోదశి - ప్రాచీన రహస్యాలు

శీతాకాలపు ఆరంభాన్ని సూచించే ధనత్రయోదశి, దీపావళి పండుగలను సంపదకు సంబంధించినవిగా భావిస్తారు, కానీ అవి నిజానికి ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఎంతో ముఖ్యమైనవి. ఈ వీడియోలో సద్గురు వివరిస్తున్నదేమిటంటే, శీతాకాలంలో సూర్యుడికి, భూమికి మధ్య దూరం పెరగడం వల్ల మానవ వ్యవస్థలో జడత్వం పెరుగుతుంది, ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో. ఈ జడత్వాన్ని అధిగమించి, చైతన్యవంతంగా, శక్తివంతంగా ఉండటానికి, ఈ పండుగలను మనం ఎలా సద్వినియోగం చేసుకోగలమో ఆయన లోతుగా వివరిస్తారు.

video

Oct 26, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
రెండు బ్రెయిన్ సర్జరీల తర్వాత కైలాస్ యాత్ర ఎందుకు, సద్గురును ప్రశ్నించిన మాధవన్ R. Madhavan
ఆర్. మాధవన్ అందరి మనసులలో ఉన్న ప్రశ్నను సద్గురుని అడిగారు - రెండు పెద్ద శస్త్ర చికిత్సల తర్వాత కైలాస్ కు ఇంత సవాలుతో కూడిన మోటార్ సైకిల్ ప్రయాణం ఎందుకు చేపట్టారు? సద్గురు నిజాయితీ సమాధానాన్ని వినండి మరియు కైలాస పర్వతం యొక్క రహస్యం, మోటార్ సైకిళ్ళు, సినిమాలు & ఇంకా ఎన్నో విషయాలపై వారి సంభాషణలో మునిగిపోండి.
Oct 26, 2025
video  
ప్రపంచ కుబేరులలో ఒకరు & ఆయన విజయ రహస్యం
సద్గురు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను, ఇంకా మనం చేపట్టే ఏ పనిలోనైనా విజయం చేకూరేలా చూసుకోవడానికి, శ్రద్ధ ఎలా ప్రాథమిక ఆధారంగా ఉంటుందో వివరిస్తున్నారు. యోగ దృక్కోణం నుండి మనస్సు యొక్క నిర్మాణం గురించి ఆయన మాట్లాడారు, ఇంకా చైతన్యంతో అనుసంధానించబడిన మనస్సు యొక్క ఒక పార్శ్వమైన ‘చిత్త’ గురించి వివరించారు. "మీరు మీ ‘చిత్త’కు ఏ రూపాన్ని ఇస్తారో, అది ఎల్లప్పుడూ ప్రపంచంలో వ్యక్తమవుతుంది" అని ఆయన అంటారు. ఇన్‌సైట్: ద డిఎన్ఏ ఆఫ్ సక్సెస్ "ఇన్‌సైట్:ద డిఎన్ఏ ఆఫ్ సక్సెస్" అనేది ఈశా లీడర్‌షిప్ అకాడమీ నిర్వహించే నాలుగు రోజుల బిజినెస్ లీడర్‌షిప్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఇది ఒకరి వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే కళను, అంతర్గత శ్రేయస్సు యొక్క విజ్ఞానంతో మిళితం చేస్తుంది. 2014 నవంబర్ 27 - 30 వరకు కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో - పాల్గొన్న వారితో పాటు బిజినెస్ ఐకాన్ రతన్ టాటా, సద్గురు, రామ్ చరణ్, జి.వి. ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సహ-చైర్మన్ మరియు సీఈఓ) ఇంకా 21 మంది ఇతర సీనియర్ వ్యాపార నాయకులు కూడా పాల్గొన్నారు.
Oct 26, 2025
video  
ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది?
సృష్టి పరిపూర్ణమైనదై, సృష్టికర్త మనల్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటే, మరి ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది?" అని ఒకరు ప్రశ్నించారు. దానికి సద్గురు వివరిస్తూ, "అది ఎంత పరిపూర్ణమైన సృష్టి అంటే, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండే అవకాశాన్ని అది మీకు ఇస్తుంది" అన్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో జరిగిన సత్సంగ్ లో సద్గురు మాట్లాడుతున్నారు.
Oct 26, 2025