ఇప్పుడున్న విద్యావ్యవస్థ కేవలం మార్కుల కోసం,ఒక ఉద్యోగాన్ని పొందడానికి కావలసిన అర్హతల కోసం. వాళ్లని ఒక తరగతి గదిలో ఉంచి, పాఠ్యపుస్తకాల్లోని అర్థంలేని సమాచారంతో వాళ్లని రుబ్బడం అనేది యువతకి ప్రయోజనం చేకూర్చదు. వారికి చాలా అరుదుగా వేరే ఏ పనైనా ఉంటుంది. విజ్ఞాన, గణిత శాస్త్రాలు నేర్చుకోవడానికి మనం ఎంత సమయం అయితే కేటాయిస్తామో అంత సమయం మనం కళలు, సంగీతం, నాటకాలకు కూడా కేటాయించాలి. ఇలాంటి రకమైన వ్యక్తీకరణలు కూడా చాలా అవసరం.

 

ఈ మానవ వ్యవస్థ భూమ్మీద అతిగొప్ప రసాయన కర్మాగారం. మీకు ఏమి కావాలన్నా అది లోపల నుండే తయారు చేసుకోవచ్చు.

 

యువతని ఏదైతే ఉత్తేజపరిచి మరియు నిమగ్నులయ్యేలా చేస్తుందో దాన్ని వారికి అందించాలి. అది ఆటలు, డాన్స్, సంగీతం, ఒక పుస్తకం లేక ఒక మేధోపరమైన క్రియలు వంటివి ఏదైనా కావొచ్చు, కానీ వారిని ఆకర్షించేదై, ఉత్తేజపరిచేధై వారుపాలుపంచుకునేదై ఉండాలి. ఎప్పుడైతే ఎందులోనూ నిమగ్నులైలేరో, మత్తు సహజంగానే ఉత్తమంగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ  లోపలి నుండే  మత్తెక్కి ఉండేటట్లు చేసే పద్ధతులను మనం నేర్పించవచ్చు. నా కళ్ళను చూడండి, నేనెప్పుడూ పూర్తిగా మత్తులోనే  ఉంటాను కానీ ఎటువంటి మత్తుపదార్థాలని నేనెప్పుడూ ముట్టుకోలేదు. 

 

ఈ మానవ వ్యవస్థ భూమ్మీద అతిగొప్ప రసాయన కర్మాగారం. మీకు ఏమి కావాలన్నా అది లోపల నుండే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి రకమైన మత్తు మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది, వ్యసనపరులుగా కాదు. మాదకద్రవ్యాల మత్తు మీ సామర్థ్యాల్ని హరించివేస్తుంది, ఎప్పుడైతే మీకు మీరే, మీ జీవంతోనే ఈ మైకంతో ఉంటారో కలిగిస్తారో, , వ్యసనానికి బదులు, ఒకే సమయంలో తీవ్రత, మైకం ఉన్న వారిలాగా అవుతారు. శివుడు లేదా ఆదియోగి దీనికే ప్రతీక - ఆయన ఏక కాలంలో తీక్షణుడు, పరిపూర్ణుడు, నిశ్చలుడు, మరియు మత్తెక్కి ఉన్నవాడు. యోగా యొక్క సారం ఇదే. మత్తెక్కి ఉన్న భావం లేకపోతే, ఈ జీవితాన్ని మీరు నిజంగా భరించలేరు.

 

ఏదో మంచిదని లేదా చెడ్డదని వాళ్లకి చెప్పే బదులు, రోజులో ఇరవైనాలుగు గంటలూ మత్తెక్కి ఉండడం ఎలాగన్నది నేను నేర్పించగలను.

మీరు జీవితంలో చాలా విషయాలలో నిమగ్నులై ఉంటే, మీలో కొంచెం మత్తు లేకపోతే, మెల్లగా అవి అన్ని వేళలా మిమ్మల్ని కిందకి లాగుతాయి. కాని మత్తుకైమీరు సీసాలను, మందునూ ఎన్నుకుంటే, అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. మీ మేధస్సుని,శక్తిసామర్థ్యాలని నాశనం చేస్తాయి. మనం యువతకి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వాలి.

 

ఏదో మంచిదని లేదా చెడ్డదని వాళ్లకి చెప్పే బదులు, రోజులో ఇరవైనాలుగు గంటలూ మత్తెక్కి ఉండడం ఎలాగన్నది నేను నేర్పించగలను. దానికి ఖర్చేమీ కాదు. అది మీ జీవితాన్ని ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది. ధ్యానం అంటే మీకు- మీ శరీరానికి, మీకు - మీ మనసుకి కొంచెం దూరాన్ని ఏర్పరచడం. అది ఒక పరిత్యాగ భావం. మనుషులు ఇలాంటి పరిత్యాగ భావాన్ని స్పృశించినప్పుడు మాత్రమే వారి మేధస్సు వికసిస్తుంది.

 

దురదృష్టవశాత్తు, డబ్బు, వినోదమే లక్ష్యాలున్న సమాజం వైపు మనం పయనిస్తున్నాము. ఇవి ఉండకూడదని కాదు, కానీ మన జీవితాలకి అవి కేంద్రబిందువు కాకూడదు. అలాగే, ఏదైనా గంభీరమైనదయితే ప్రజలు దాన్ని వినరని లేదా అది వినపడదని నిర్ణయించడం సరికాదు. ఏదైనా గంభీరమైనది అయితే మీరు దాన్ని వారు అర్థం చేసుకునే విధంగా దానితో గుర్తించుకునే విధంగా అందిస్తే ఈ రోజు కూడా ప్రజలు దానిని ఆస్వాదిస్తారు. ఇది  చాలా అద్భుతమైన విషయం.

 

నేను పాఠశాలలకి, కళాశాలకి వెళుతుంటాను. కళాశాల విద్యార్థులకు ఆసక్తి ఉందంటే నేను అర్థం చేసుకోగలను, కానీ 12 నుండి 15 సంవత్సరాల వయస్సులో ఉన్న పాఠశాల పిల్లలు చాలా మంది ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నారు. నేను ఎదుగుతున్నప్పుడు ఇది చాలా అరుదు. తల్లిదండ్రుల బలవంతంతో కాకుండా మేము ఒక ఆధ్యాత్మిక ప్రసంగం వినడం అనేది అసాధ్యం. ఇప్పుడు ఏ పాఠశాలకి వెళ్లినా  పిల్లలకి నేను తెలుసు. వారంతట వారే నా ప్రసంగాలను వింటున్నారు. మీరేదైనా గంభీరమైనది లేదా పరివర్తన తెచ్చేది చెప్తే ప్రజలు దాన్ని వినరు అన్నది నిజం కాదు, వారు వింటారు. మనం ఎలా చెప్తాం అన్నది మార్పు చెయ్యాలేమో, కానీ సందేశాన్ని చేరవేయవచ్చు. ప్రజలను ప్రభావితం చేయగలిగిన వారు ప్రజల జీవితాన్ని స్పృశించే బాధ్యతే కాకుండా వారిలో ఏదో ఒక రకమైన పరివర్తన తేవాలని నేను అనుకుంటాను.

 

ప్రపంచ, దేశ శ్రేయస్సు కోసం, మనుషులు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

 

మన చుట్టూ ఉండే ప్రజల్లోకి ఈ బాధ్యతని  తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ, దేశ శ్రేయస్సు కోసం, మనుషులు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వారి మాటలతో, చర్యలతో,  అన్ని రకాలుగా. “ఇన్నర్ ఇంజనీరింగ్” రూపంలో లేదా ఈశా పేరుతో మేము చేస్తున్నది ఏమిటంటే మతం నుండి బాధ్యతకి ఒక మార్పు. చాలా కాలంగా, ప్రజలంతా వారి జీవితాల్లో జరుగుతున్న అన్యాయాలన్నింటికీ ఆకాశం వైపు వేలు చూపిస్తుంటారు, ఇంకా వారు చేసే అన్ని ఘోరాలకీ ఇది “దేవుని అభిమతమని” చెప్తుంటారు. ప్రజలంతా తమ మూర్ఖత్వానికి తామే బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రతి మనిషి కనీసం తానేంటో దానికైనా బాధ్యత తీసుకునే ధైర్యం ఉండాలి. ధైర్యంగా నుంచుని చెప్పవలసింది చెప్పాలి. ఇతరులు ఇష్టపడతారా లేదా అన్నది వారి ఇష్టం.

 

మనమిప్పుడు “యూత్ అండ్ ట్రూత్ ”  ఉద్యమంలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఎంత వీలైతే అంత యువతని సత్యం వైపుకి తీసుకువద్దాం. మనది యువ దేశం - మనకు ఉన్నదంతా మన జనాభానే. మన జనాభాని మనం ఒక ప్రేరేపితమైన, సమతౌల్యత కలిగిన, శ్రద్ధగల జనాభాగా మార్చగలిగితే మనం ఒక అద్భుతం అవుతాం. లేకపోతే, మనమే ఒక విపత్తుని తయారు చేసుకుంటాం. ఏ తరానికీలేనటువంటి సాంకేతిక ఉపకరణాలు,  సుఖాలు, సౌకర్యాలు మనకి ఉన్నాయి. ఇంతలా  శక్తిమంతంగా ఇంకెవరూ ఉండి ఉండలేదు. ఈ తరం అన్నింటికంటే ఉత్తమమైన తరంగా మారాలన్నది నా కోరిక. అది జరిగేట్టు మనం చేద్దాం.

 

ప్రేమాశీస్సులతో