ఈ వ్యాసంలో సద్గురు భావ స్పందన కార్యక్రమం గురించీ , అది మిమ్మల్ని పూర్తీ మత్తులో ఎలా ఉంచుతుందో వివరిస్తున్నారు..

ప్రశ్న: నమస్కారం సద్గురు, భావస్పందన కార్యక్రమం తర్వాత నా హఠయోగ అభ్యాసాలు చాలా తీవ్రమయ్యాయి. ప్రతి ఆసనం తర్వాత నాకు మత్తుగా అనిపిస్తోంది, శాంభవి చేసిన తర్వాత కూడా అలాగే ఉంటున్నది. ఏం జరుగుతూ ఉంది?

సద్గురు: మత్తు లేకపోతే ఇక జీవితం ఎందుకు చెప్పండి. స్పృహలేని జీవితం ఏమిటి? మీకు ఏదో కొంత స్పృహ ఉండడం వల్లే, మీరు జీవించి ఉన్నారని మీరు తెలుసుకోగలుగుతున్నారు. మీ అస్తిత్వానికి ఆధారం మీ స్పృహ. మీరు మీ స్పృహను చంపివేస్తే మీరు మీ జీవితాన్నే దూరం చేసుకున్నట్లు. మీరు మద్యం సేవించకుండా స్పృహ కలిగి ఉండడం మంచిదే. కాని పూర్తిగా మత్తులో మునిగి ఉండి, పూర్తిగా స్పృహలో ఉంటే అది అద్భుతం కదూ. భావస్పందన అదే – మీరు పూర్తిగా మత్తులో ఉండి కూడా, సంపూర్ణ స్పృహలో ఉంటారు, హాంగోవర్ ఉండదు. కావాలనుకుంటే మీరు దాన్ని స్విచ్ ఆఫ్ చేయవచ్చు, లేదంటే స్విచ్ ఆన్ చేయవచ్చు. చాలా బాగుంటుంది, ఖర్చులేదు. ఎల్లప్పుడూ ఇలా ఉండవచ్చు – ఇరవై నాలుగు గంటలూ మత్తులో ఉండవచ్చు, ఇరవై నాలుగు గంటలూ పూర్తిగా స్పృహలో ఉండవచ్చు.

మద్యం సీసాలలో మాత్రమే వస్తుంది, అయిపోతుంది కూడా. మరి ఇది ఆగిపోని సరఫరా, మిమ్మల్ని పూర్తిగా స్పృహలో ఉంచుతుంది. దీన్ని అమృతమంటారు.

చాలామంది తాగినప్పుడు ఆడతారు, పాడతారు – ఇది వాస్తవం. మత్తు అనేది మనిషిని అతడి మనస్సులో ఏర్పడిన కరుకుదనం నుండి బయటపడేటట్లు చేస్తుంది. అయితే జీవితాన్ని గ్రోలడం మీకు తెలిసినట్లయితే – మద్యంతో కాక, దివ్యత్వంతో మత్తుపొందడం మీకు తెలిసినట్లయితే – మీకు అనంతంగా ఆ సరఫరా లభిస్తుంది. మద్యం సీసాలలో మాత్రమే వస్తుంది, అయిపోతుంది కూడా. మరి ఇది ఆగిపోని సరఫరా, మిమ్మల్ని పూర్తిగా స్పృహలో ఉంచుతుంది. దీన్ని అమృతమంటారు. పీనియల్ గ్లాండ్(Pinneal Gland) దీన్ని ఉత్పత్పి చేస్తుందంటారు. హఠయోగంలో మిమ్మల్ని అక్కడికి తీసికొనివెళ్లే అభ్యాసాలున్నాయి. ఒకప్పుడు నేను రెండురోజుల హఠయోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాణ్ణి. శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యేవాళ్లు, ఆదివారం సాయంత్రం ముగిసేది. శనివారం మధ్యాహ్నానికి 70% మంది సభ్యులు పూర్తి మత్తులో నేలపై పొర్లాడుతూ ఉండేవారు. భావస్పందన కాదు, కేవలం హఠయోగ మాత్రమే. హఠయోగ చేయవలసింది కూడా అదే. అయితే వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఒక భిన్నస్థాయి అవసరం.

భావస్పందన అనేది ఒక కార్యక్రమంలోనే జరగాలని లేదు. కానీ మనుషులు, తమ ఆలోచనలు, మనోభావాలతో ఎంత మూసుకుపోయి ఉన్నారంటే, వారిని ఒకచోట పెట్టి గట్టిగా మెలి వేయడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలు తమ జీవితమంతా తప్పించుకుంటూనే ఉన్నారు, అలా తప్పించుకోకుండా చూడడం చాలా ముఖ్యం. వాళ్లు కనీసం ఈ మూడురోజులయినా మనకిస్తారనుకుంటున్నారా? మరో జీవితంతో అనుబంధం ఏర్పరచుకొనే ఎన్నో అవకాశాలు వాళ్లుకు ఈ జీవితంలో లభిస్తున్నాయి. ప్రతిరోజూ లక్షల అవకాశాలు. కాని వాళ్లు ఉపయోగించుకోరు. బయటికి వెళ్లే మార్గం ఏర్పరచుకున్న  మనుషులని మీరెలా నమ్మగలరు? అందువల్ల దాన్ని అన్నివైపులనుండీ మూసివేయాలి, అపుడు అకస్మాత్తుగా మేల్కొంటారు – ఈ భౌతికత్వాన్ని అధిగమించి, మరో మార్గంలో జీవితాన్ని తెలుసుకొనే దారి ఉందని అర్ధం చేసుకుంటారు.

భావస్పందన మీకు మూడురోజుల కార్యక్రమం మాత్రమే కాదు. మీ మొత్తం జీవితాన్ని, మీ జీవితంలో ప్రతిక్షణాన్ని సంపూర్ణంగా మత్తిల్లేలాగ చేసే ప్రాథమికాంశాలు దానిలో ఉన్నాయి. ఇది చాలా సాదాసీదా కార్యక్రమం. నాకు తెలిసినంతవరకు ఇటీవలి చరిత్రలో ఇంత శక్తిమంతమైన దాన్ని ఇంత సరళంగా అందించిన సందర్భాలు లేవు. ఇది మరీ సరళంగా అందించే కార్యక్రమం. కాకపోతే మీ నడుం కొంచెం నొప్పిపుట్టవచ్చు, ఎందుకంటే మీరు తగినంత హఠయోగ చేసి ఉండి ఉండకపోవచ్చు కాబట్టి. లేకపోతే ఈ పద్ధతి చాలా తేలికైనది, పిల్లల ఆట అంత తేలిక. అందుకే అదంత అద్భుతమైనది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

Bhava Spandana Program, an advanced residential program at the Isha Yoga Center