గురువు ఒడిలో..
ArticleAug 19, 2016
హిమాలయాలు ఎక్కుతూ సద్గురు అప్పటికప్పుడు వ్రాసిన ఒక కవితని మనకి పంపించారు. మహిమోన్నతమైన హిమనగాలనూ, అద్భుతమైన లోయల సౌందర్యాలనూ, ఆది గురువు ప్రేమాంకముతోనూ, అతని కటాక్షముతోనూ సద్గురు సరిపోలుస్తారు. దానితోపాటే చూపుమరల్చలేని చిత్రాలను చూసే అవకాశం కోల్పోవద్దు.
గురువు ఒడిలో
అక్కడ జ్ఞాన శిఖరాలున్నాయి
అపారమైన అనుగ్రహపు లోయలున్నాయి.
శిఖరాగ్రాన్ని చేరుకున్నపుడు
మనకి జ్ఞానసౌందర్యం విదితమౌతుంది.
ఆ లోయలలో మనం మమేకమై
పొగమంచులో కరిగిపోతాము
గురువు ప్రేమాంకము
ప్రేమా, దివ్యరోచిస్సుల
జ్ఞాన, వైరాగ్యాల సంగమం
అది ప్రార్థనా స్థలి
క్రీడా ప్రాంగణము
మోక్ష ద్వారము.
ప్రార్థించు - కోరినదానికంటే ఎక్కువ లభిస్తుంది
క్రీడించు- బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతావు
నిన్నునువ్వు సమర్పించుకో - ఆయనలో ఐక్యమౌతావు