ప్రశ్న: నమస్కారం సద్గురు, మీరు 'భైరాగినిల' మార్గం, "భైరాగిని" అంటే ఏమిటి అనే వాటి గురించి తెలియజేయగలరా? అది  బ్రహ్మచర్యం నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?

రాగా అంటే రంగు. ఒక విధముగా చెప్పాలి అంటే ,”భైరాగిని” అంటే దేవి యొక్క రంగుగా మారటం అని అర్థం. బ్రహ్మచర్య అంటే వైరాగ్యం గా ఉండటం – అంటే “ఏ రంగు లేకుండా” ఉండడం. ఆంగ్ల భాషలో “రంగు లేకుండా” అనే పదానికి సహజార్ధం లేదు,కాని “పారదర్శకo గా ఉండటం” అని కూడా అంటారు. కనుక , బ్రహ్మచారి వైరాగ్య స్దితిలో ఎలా ఉండాలి అనే చూస్తారు, జీవితాన్ని పారదర్శకంగా చేసుకోవటం , స్పష్టతే అంతిమ ధ్యేయం – జీవిత, మరణాలను స్పష్టంగా చూడగలుగుతారు. భైరాగిని చంద్రుడు వంటిది; చంద్రుడు తనకు తాను మెరుస్తూ ఉండడు, సూర్యుడు యొక్క ప్రతిబింబం వలనే మెరుస్తాడు. సూర్యుడి శక్తి వలన చంద్రునికి కాంతి ఉంటుంది, చాలా మంది సూర్యుని కంటే చంద్రుని చూసి ఆనందిస్తారు. సూర్యుడు మాత్రం ప్రతీ రోజు అలానే ఉంటాడు.

సూర్యుడి శక్తి వలన చంద్రునికి కాంతి ఉంటుంది, చాలా మంది సూర్యుని కంటే చంద్రుని చూసి ఆనందిస్తారు. సూర్యుడు మాత్రం ప్రతీ రోజు అలానే ఉంటాడు.

ఇవి రెండు విభిన్న మార్గాలు.ఇప్పటి వరకు, భైరాగిని మార్గంలో అంత దృష్టి పెట్టలేదు, కేవలం ఆలయంలో అరడజను ఉన్నారు,కాని చాలా మంది ఈ మార్గంలో వెళ్ళొచ్చు – కేవలం ఆలయం ప్రక్రియలు నిర్వహించడటానికేకాదు.ఈశాకి ఒక ముద్ర మరియు రూపం ఉన్నాయి అదే సమస్య , ఎరుపు రంగు దుస్తులు ధరించి చుట్టూ తిరిగేవారు ఎక్కువ మంది వద్దు. ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అని కాదు, కాని మనము చేసేది సార్ధకమైనదిగా ఉండేందుకు, ముద్ర అన్నది ముఖ్యం. అయితే పలు రకాలుగా, మనము ప్రపంచంలో మన చిహ్నం గురించి భయపడి ఉండాలి అనే సమయం దాటిపోయింది. వచ్చే ఒకటి లేదా రెండు సంవత్సరాలలో, ఎక్కువ మంది ఈ మార్గంలో వెళ్ళవచ్చు. మీకు మీరు పూర్తిగా ఇస్తే ఇది ఒక అందమైన మార్గం. మీరు తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తే, మీకు పిచ్చి పడుతుంది, కానీ మిమ్మల్ని మీరు ఇవ్వాలని అనుకుంటే ,మీరు పరవశమైన ఒక అందమైన స్థితిలో ఉంటారు.

కనుక, ఎవరైతే మాకు పెద్ద హ్రుదయం ఉంది కానీ, బుర్ర లేదు అని అంటారో , వాళ్ళు నడవటానికి ఇది మంచి మార్గం. లేదా, మీ మెదడు నలుపు మరియు తెలుపు, తప్పు మరియు ఒప్పు మధ్య ఉన్న మూలాధార తర్కం దాటి వెళ్ళగలిగేంత సూక్ష్మo గా ఉంటే, మీ మేధస్సు గనుక ఇది దాటి జీవితాన్ని చూడగలిగితే అప్పుడు అది ఒక అందమైన మార్గం.

ధ్యానలింగం అలా కాదు; ప్రతీ రోజు ఒకేలా ఉంటుంది – నమ్మదగినది. కానీ ఆమె తనదైన మార్గంలో వెళ్తోంది. నేను ఆమె పెరటిలో నివసిస్తున్నాను, కాబట్టి నాకు తెలుసు.

మీరు మీ జీవితంలో శ్రేష్ఠమైనది కనుగొనాలి అని కోరుకుంటే, మిమ్మల్ని మీరు కోల్పోవాలి

భైరాగిని దారిలో ఉండాలి అంటే దేవి యొక్క రంగు కలిగి ఉండటం , కేవలం వస్త్రాలే కాదు, ప్రతీ మార్గంలో. ఏమైనప్పటికీ మీ రక్తం ఎరుపు, మీ తల కూడాఎరుపుగా మారాలి, మీ లోపల ప్రతిదీ ఎరుపుగా మారాలి. మీది అనేది ఏది కలిగి ఉండవద్దు. కాని నన్ను వదులుకోవాలా? మీరు మీ జీవితంలో శ్రేష్ఠమైనది కనుగొనాలి అని కోరుకుంటే, మిమ్మల్ని మీరు కోల్పోవాలి; ఇతర ఏ మార్గం లేదు. మీరు అల్పమైన వ్యక్తిత్వం నిల్వ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అంతా మంచి జరుగుగాక. చివరి రోజుల వరకు అదే సమస్యలు అనంతంగా వస్తూనే ఉంటాయి , నన్ను నమ్మండి. మీరు ఒక్కసారి వెనుతిరిగి చూసుకోండి - మీరు వివిధ వాతావరణాలలో ఉండవచ్చు, కానీ అదే పెనుగులాట, మనస్సు లోపల అవే సమస్యలు. వాతావరణం మారి ఉండవచ్చు, భావం మారి ఉండవచ్చు, కాని ప్రాథమికoగా ఉన్నది మాత్రం మారలేదు, నన్ను నమ్మండి చాలా మంది ఇలానే మరణిస్తారు.

ఒకసారి ఇలా జరిగింది. పోయిన జన్మలో , శంకరన్ పిళ్లై మృత్యుశయ్యపై ఉన్నాడు.అతడు చేతన మరియు అచేతన స్దితిలో ఉన్నాడు, ఎలా అంటే నిదురపోతున్నట్లు కొన్నిసార్లు మెలుకువగా ఉన్నట్లు. స్పృహ మరియు స్పృహ లేకుండా ఉండే ఈ తరంగాలలో, అతను కొంచం స్పృహలో ఉన్నప్పుడు తన భార్యను చూస్తూ “"నా మొదటి కుమారుడు రాము ఎక్కడ?" అని అడిగాడు. పెద్ద కొడుకు నిలబడి “నాన్న,నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఆందోళన చెందవద్దు!”మళ్ళీ అతను స్పృహ కొల్పోయాడు, కొంత సమయం తర్వాత అతను తిరగి స్పృహలోకి వచ్చాడు, కొంత సమయం తరువాత అతని భార్యని చూస్తూ “మన రెండో కుమారుడు బీము ఎక్కడ?” అని అడిగాడు ఒక్క ఉదుటున బీము లేచి నిలబడి“నాన్న,నేను ఇక్కడ ఉన్నాను! నీ పక్కనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళాను !” అన్నాడు.మరలా అచేతనా స్తితిలోకి వెళ్ళాడు, చాలా సమయం తరువాత భార్యని చూస్తూ “మన మూడో కుమారుడు సోము ఎక్కడ?”.మూడో కొడుకు అతని పాదాలు పట్టుకుని “నాన్న, నేను నీ పాదాల దెగ్గర ఇక్కడే ఉన్నాను!” అన్నాడు.అప్పుడు శంకరన్ పిళ్లై తన భార్యని చూస్తూ అన్నాడు ”అందరు ఇక్కడే ఉంటే దుకాణాన్ని ఎవరు చూసుకుంటున్నారు?” అని. ఇది ఇలానే కొనసాగుతుంది.

కేవలం ఆహారం, పునరుత్పత్తికి సంబంధించిన కోరికలను సంతృప్తి పరచటం కోసం ఒక జీవితం మొత్తం అయిపోతుంది. మీరు దానినే గొప్పగా, అద్భుతంగా చిత్రీకరించవచ్చు, కానీ మీ జీవితం అలానే అయిపోతుందని అర్థం చేసుకోండి. నేను ఇది మీకు మళ్లీ మళ్లీ చెప్పను , ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఎవరికైతే పనిచేసే మెదడు ఉందో, వాళ్లు ఎదో ఒక దానిలో పెట్టుబడి పెట్టండి.

నేను నా అనుభవం నుండి చెప్తున్నాను, నేను శోధించి, ఎంతో శ్రమపడి తెలుసుకున్న మార్గం, మీకు చాలా సులభంగా అందివస్తోంది.అవును! కనుక, మీరు భైరాగిని అవ్వాలి అనుకుంటే, అదో అద్భుతమైన మార్గం. నేను ఇంకా వారిపై తగినంత శ్రద్ధ తీసుకోలేదు. నేను ప్రయాణాలు చేయటం మానేస్తే, ఈ విషయాలు జరుగుతాయి. అప్పుడు సద్గురు మళ్ళీ ఎప్పుడు ప్రయాణం చేస్తారు? అని మీరు ఎదురుచూస్తుంటారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు