నరక చతుర్దశి కథ - అన్ని తప్పులనూ చంపడం
కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజైన నరక చతుర్దశి వెనుక ఉన్న పురాణాన్ని సద్గురు చెప్తూ, దీపావళికి సంబంధించిన ఈ పురాణం నేటికీ మనకు ఎలా వర్తిస్తుందో వివరిస్తున్నారు.

నరకాసురుడు మంచి నేపథ్యం నుంచి వచ్చాడు. ఇతడు విష్ణువు కుమారుడని పురాణాలు చెబుతున్నాయి. కానీ విష్ణువు అడవి పంది రూపాన్ని ధరించినప్పుడు ఇది జరిగింది. కాబట్టి అతనిలో కొన్ని ధోరణులు ఉన్నాయి. అదీ కాక నరకాసురుడు మురాతో స్నేహం చేసాడు. అతను తరువాత అతని సేనాధిపతి అయ్యాడు. వీరిద్దరూ కలిసి ఎన్నో యుద్ధాలు చేసి వేల మందిని చంపారు. వారిద్దరూ కలిసి ఉంటే నరకుడిని ఎదుర్కోవడానికి మార్గం లేదు కాబట్టి కృష్ణుడు మొదట మురాను చంపాడు. కృష్ణుడికి మురారి అనే పేరు రావడానికి కారణం అతను మురుడిని వధించినందు వల్లే. పురాణంలో మురాకు యుద్ధంలో మాంత్రిక శక్తులు ఉన్నాయని చెప్పబడింది. ఇది అతనికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేని విధంగా చేసింది. మురాను చంపిన తర్వాత నరకుడి వధ ఒక తంతు మాత్రమే.
కృష్ణుడు నరకాసురుడిని ఎందుకు చంపాడు
కృష్ణుడు నరకుడిని బ్రతకనిస్తే అతను అలాగే కొనసాగుతాడు. కానీ అతన్ని మరణానికి దగ్గరగా తీసుకువస్తే అతను తనను తాను తేసుసుకొగలిగే సామర్థ్యం కలవాడు. మరణ సమయంలో నరకుడు, అకస్మాత్తుగా అనవసరంగా చాలా అసహ్యకరమైన విషయాలను సేకరించినట్లు గ్రహించాడు. కాబట్టి అతను ఇలా అన్నాడు, “నువ్వు నన్ను చంపడం లేదు, నా చెడ్డతనాన్ని అంతా తీసివేస్తున్నావు. ఇది మీరు నాకు చేస్తున్న మేలు. ఇది అందరూ తెలుసుకోవాలి. కాబట్టి నేను సేకరించిన అన్ని ప్రతికూలతలు అంతమయ్యయని అందరూ వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే ఇది నాకు కొత్త వెలుగును తెచ్చిపెట్టింది, అలానే ఇది అందరికీ వెలుగుని తేవాలి.” అలా ఇది వెలుగుల పండుగ అయింది. ఈ రోజున దేశం అంతా కాంతి మయం అవుతుంది, కాబట్టి మీరు మీలోని చెత్తంతా కాల్చివేయాలి. అది ఇప్పుడే చేయడం మంచిది. నరకునికి కృష్ణుడు "నేను నిన్ను చంపబోతున్నాను" అని చెప్పాడు. కానీ మీకు అలా ఎవరూ చెప్పకపోవచ్చు - మరణం మీకు అలా జరిగిపోవచ్చు.
ఇది టెన్నెస్సీలో జరిగింది. ఒక మహిళ తుపాకీ దుకాణానికి వెళ్లింది. టేనస్సీలో ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త తుపాకులను కొనుగోలు చేయడం సర్వసాధారణం. కాబట్టి ఆమె తుపాకీ దుకాణానికి వెళ్లి, “నా భర్తకోసం రివాల్వర్ ఇంకా కొన్ని బుల్లెట్లు కావాలి” అని చెప్పింది. దుకాణదారుడు, “అతను ఏ బ్రాండ్‌ను ఇష్టపడతాడు?” అని అడిగాడు. ఆమె, "నేను అతనిని కాల్చివేస్తానని అతనికి చెప్పలేదు." అంది.
నరకాసుర మరణాన్ని దీపావళిగా ఎందుకు జరుపుకుంటారు?
జీవితం మిమ్మల్ని చేజిక్కించుకున్నప్పుడు, అది మీకు చెప్పకపోవచ్చు. అందుకే ఎవరైనా మిమ్మల్ని కాల్చివేసేవరకు ఎదురుచూడకుండా, స్పృహతో మరణాన్ని పొంది, స్పృహతో జన్మను తీసుకోవచ్చని దీపావళి గుర్తుచేస్తుంది. ఒక పురుషుడు, స్త్రీ, బ్యాక్టీరియా, వైరస్ లేదా మీ స్వంత కణాలు మిమ్మల్ని కాల్చివేస్తాయో లేదో మనకు తెలియదు. ఎవరైనా మనల్ని తీసుకుపోవచ్చు. "నన్ను నేను అన్నిటికీ అతీతమైన ఒక వ్యక్తిగా మార్చుకోగలను కాని నేను చెడు విషయాలను సేకరించి ఇలా అయ్యాను" అని అందరికీ గుర్తు చేయాలనే నరకుడి కోరికను మనం ఉపయోగించుకోవడం మంచిది.
మనమందరం ఒకే పదార్ధంతో తయారు చేయబడ్డాం. అయితే ప్రతి ఒక్కరు ఎంత భిన్నంగా మారారో చూడండి. ప్రశ్న ఏమిటంటే, మీరు ప్రతిరోజూ ఏమి సేకరిస్తున్నారు? మీరు మీలో విషాన్ని సేకరించి తయారు చేస్తున్నారా లేదా మీలో దివ్య పరిమళాన్ని తయారు చేస్తున్నారా? ఇది ఎంపిక. నరకుడి జన్మ మంచిదే ఐనా చెడ్డవాడు కావడం గురించిన ఈ పురాణం ముఖ్యమైనది. మరణ సమయంలో నరకుడు కృష్ణుడికి ఇంకా తనికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా గ్రహించాడు. అది ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమను తాము ఎలా మలచుకున్నారనే. కృష్ణుడు తనను తాను భగవంతునిగా చేసుకున్నాడు. నరకుడు తనను తాను రాక్షసుడిగా మార్చుకున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఈ ఎంపిక ఉంది. మనకు ఎంపికలు లేకుంటే, తమను తాము ప్రకాశించే ఉదాహరణలుగా చేసుకున్న వారి ఉపయోగం ఏమిటి? ఇది ఒక వ్యక్తి అదృష్టవంతుడు లేదా అతను అలా జన్మించినందున కాదు. ఒక నిర్దిష్ట మార్గంలో తనను తాను తయారు చేసుకోవడానికి చాలా కృషి అవసరం.
జీవితం మిమ్మల్ని కొరడాతో కొట్టేవరకు మీరు వేచి ఉండండి లేదా మిమ్మల్ని మీరు రూపాంతరం చేసుకోండి - ఇది ఎంపిక. కృష్ణుడు వచ్చి కొట్టాలని నరకుడు ఎంచుకున్నాడు. కృష్ణుడు తనను తాను మలచుకోవాలని ఎంచుకున్నాడు. అది చాలా పెద్ద తేడా. ఒకరు దేవుడిగా పూజించబడతారు, మరొకరు రాక్షసుడిగా అణచివేయబడతారు - అంతా తెలుసుకోవాల్సింది ఇదే. మిమ్మల్ని మీరు రూపాంతరం చేసుకోండి లేదా జీవితం ఏదో ఒక రోజు మిమ్మల్ని రూపాంతరం చెందిస్తుంది - లేదా ఆకారంలో లేకుండా ఐనా చేస్తుంది, ఏ విధంగా అయినా సరే. దీపావళి దీనినే గుర్తు చేస్తుంది. రండి వెలిగిద్దాం.