జీవితాన్ని మెరుగుపరిచే 5 సూత్రాలు

ArticleJan 10, 2018
- ఏది సాధ్యమో. ఏది అసాధ్యమో నిర్ణయించడం మీ వ్యవహారం కాదు. అది ప్రకృతి నిర్ణయిస్తుంది. మీకు నిజంగా ఏది ముఖ్యమో దానికై కృషి చేయడమే మీ పని.
- ఇష్టాయిష్టాలకు అతీతంగా ఎదగడానికి దోహదపడే శిక్షణా స్ధలమే కుటుంబం.
- మీ జీవితంలోని అతి గొప్ప విషయం, మీరీక్షణం సజీవంగా, స్పందిస్తూ ఉండడమే. మిగిలినవన్నీ తరువాతి విషయాలే.
- మీరెక్కడున్నా, మీకే పరిస్థితి ఎదురైనా, ప్రతి పరిస్థితి నుండీ ఉన్నతమైన దాన్ని ఎంచుకోండి. అప్పుడు జీవితమే ఒక పాఠమౌతుంది.
- భద్రత అవసరంలేని వాడే నిజంగా భద్రంగా ఉంటాడు.

