శ్రేయస్సుకు సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleMar 23, 2017
శ్రేయస్సుకు సంబంధించిన 5 సూత్రాలు.
- మీరేమి చేస్తున్నా సరే, అది అందరి శ్రేయస్సుకా లేక అది మీ కొరకా అని ఒకసారి సరిచూసుకోండి. అది మీకోసమే అయితే మీరది చేయకూడదు.
- బయటి ప్రపంచాన్నికావలసిన విధంగా తయారు చేసుకుంటుంటే సుఖ, సౌకర్యాలు ఏర్పరచుకోవచ్చు. మీ అంతరంగాన్నిసరైన విధంగా సరి చేసుకోగలిగితేనే నిజమైన శ్రేయస్సును సమకూర్చుకోగలం.
- శ్రేయస్సు అంటే తమకు, తమ కుటుంబానికి, వంశానికి, మతానికి లేక దేశానికి మాత్రమే పరిమితం అనుకునే మనుషుల భావన వల్లనే చెడు అంతా సంభవిస్తోంది.
- యోగా విధానంలోని సాంస్కృతిక హంగులను తొలగించి, మానవ శ్రేయస్సుకు శుద్ధమైన శాస్త్ర, సాంకేతిక పరిఙ్ఞానంగా దానిని అందించడమే నా పని.
- అంతర్గత శ్రేయస్సుకు ఉపకరించే పరిఙ్ఞానం ఈనాడు ఎంతో అవసరం, ఎందుకంటే బాహ్య అవకాశాలు పెరుగుతున్న కొద్దీ, మన అంతర్గత లోటు మరింత ప్రస్ఫుటమౌతుంది.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.