సృష్టికి సంబంధించిన 7 సూత్రాలు!

ArticleAug 3, 2016
"సృష్టికర్త లేదా సృష్టి మూలం ఎక్కడో కూర్చుని లేదు. మీరు మీ శరీరాన్ని గమనిస్తే,పుట్టిన క్షణం నుండీ ఇప్పటివరకూ, అది ఎంతగా పెరిగిందో చూడండి. ఈ పెరుగుదల బయటి నుండి సాగాదీయటం వలన జరగలేదు. ఇది సృష్టికర్త లోపలనుండి నిరంతరం పని చేయటం వలన జరిగింది. అంటే, సృష్టి మూలం ఇప్పుడు మీలోనే ఉంది. అదే ఆనందం. ఈ సృష్టిలోని ప్రాధమిక శక్తి మీ జీవితంలో వ్యక్తీకరించబడితే, మీరు దాన్ని బయటకి రానిస్తే, మీరు కేవలం ఆనందంగా మాత్రమే ఉండగలరు. మీరు వేరే విధంగా ఉండే మార్గమే లేదు" ~ సద్గురు.
సృష్టి గురించి సద్గురు తెలిపిన సూత్రాలను తెలుసుకుందాం:
- సృష్టించవలసినవన్నీ సృష్టిలో ఇప్పటికే సృష్టింప బడ్డాయి. మానవులుగా మనం కేవలం అనుకరించగలమేగాని, సృష్టించలేము!
- సృష్టి మూలం చాలా సూక్ష్మమైనది. మీరు మీ మనస్సునీ, శరీరాన్నీ నిశ్శబ్దంగా ఉంచుకుంటేనే, అది మాట్లాడుతుంది.
- సృష్టిలో ఒకటి మరొకదాని కంటే మెరుగైందని మీరనుకుంటే, మీరు అసలేమీ అర్థం చేసుకోనట్లే!
- శబ్దాలు ఎన్నో, నిశ్శబ్దం ఒకటే. రూపాలు కోటానుకోట్లు - సృష్టి మూలం ఒకటే
- మీరు ఉత్సాహంతో చనిపోయినా పరవాలేదు. కానీ ఇంతటి అద్భుతమైన సృష్టి పెట్టుకొని మీరు విసుగుతో చనిపోతే - అదొక నేరం.
- మనమిక్కడ, ఓ సృష్టి భాగంగా ఉండచ్చు లేదా సృష్టికే మూలంగా ఉండచ్చు. మనం ఎంపిక చేసుకోవాల్సింది వీటి మధ్యే.
- ఏ వేదాంతమైనా సృష్ఠి పట్ల ఘాతుకమే. అది కేవలం మనుషులు వినాలనుకుంటున్నట్లుగా వివరణల్ని ఇస్తుందంతే.
మీరు కూడా మీ ఫోన్ లేక మరే మాధ్యమం ద్వారానైనా సద్గురు జ్ఞానాన్ని పొందడానికి ఈ క్రింది లింక్ లో సబ్స్క్రయిబ్ చేసుకోండి: