Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
పరికరాల పరంగా చూస్తే, కంప్యూటరో, కారో లేదా అంతరిక్ష నౌకో కాదు, మానవ మనస్సే అత్యంత అద్భుతమైనది - మీరు దానిని స్పృహతో వినియోగించుకుంటే.
మార్గంలో పురోగతి సాధించాలంటే, మీరు ఎక్కడికి వెళుతున్నారో దానిపైన దృష్టి సారించాలి, అంతే కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నదానిపై కాదు.
మీకు విజయం కావాలంటే, ముఖ్యమైన విషయం, మీరే దానికి అడ్డంకి కాకుండా చూసుకోవడం.
మీకు తెలియని దేని గురించి అయినా ఒక అభిప్రాయానికి వస్తే, అది ఎప్పటికీ అజ్ఞానంలో ఉండిపోయేలా చేసుకోవడమే.
కర్మ అంటే, మీ జీవిత రూపకర్త మీరే అని.
మనుషులు తమ గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న దానిలో మనది చాలా చిన్న పాత్ర.
ప్రపంచం మీ మీద ఏమి విసురుతుందో మీరు నియంత్రించలేరు. కానీ దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మాత్రం నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది. దీనికి శ్రీరాముడు ఉత్తమ తార్కాణం.
ఈ ప్రపంచంలో సమర్థవంతంగా పనిచేయాలంటే, జ్ఞానం ప్రధానాంశం కాదు, గ్రహణశీలతలోని స్పష్టతే ప్రధానమైనది.
ప్రతీ ఇతర జీవి భూమాత శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది. కేవలం మనుషులమైన మనమే పరిణితి చెందాల్సి ఉంది.
మీ జీవితానుభూతి మీ చుట్టూ ఎవరున్నారు లేక ఏమి ఉంది అన్నదానిపై ఆధారపడి ఉండదు. మీరు ఎలా ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రపంచానికి మీరు చేయగల ఉత్తమమైన పని, మీరు సంతోషంతో ఇంకా ఆనందంతో నిండిన మనిషిగా ఉండడమే.
బాధ గురించిన భయాన్ని మీరు ఎప్పుడైతే అధిగమిస్తారో, అప్పుడు మీరు సహజంగానే జీవితాన్ని సంపూర్ణంగా శోధిస్తారు.