టెన్నిసీ లోని iii లో విస్తరించబడి ఉన్న విశాలమైన మైదానాలు అత్యంత ఉత్సాహవంతమైన సంయమకి నిదర్శనం. సంయమ మనిషిలోని సహజ లక్షణాలకు ఒక పరీక్ష. అది మనిషి యొక్క శారీరిక, మానసిక ఓర్పుని పరీక్షిస్తుంది. అది మన మనసులో ఉన్న అక్కర్లేని చెత్తను తీసి దిద్దుబాటు చేస్తుంది.అన్నిటికంటే, ఇది మనిషి శరీరం ఎంత ఆనందంగా ఉందో పరీక్షిస్తుంది. ఎందుకంటే శరీరంలో ఆనందం లేకపోతే, ధ్యానంలో గంటలకొద్దీ కూర్చోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సంయమ ఒక అద్భుతమైన పరివర్తన ప్రక్రియ. అది మనసుని ఒక అద్దంలాగా మారుస్తుంది. నిరంతర భావోద్వేగమనే ఒక నాటకం నించి తప్పించి మనసుని ఒక స్పష్టతతో కూడిన ఉపకరణంగా మార్చేస్తుంది. ఇక్కడ అందరూ తమకు తాముగా తయారుచేసుకున్న చట్రంలోనే ఇరుక్కుని ఉన్నారు.

అమరావతిలో హ్యాపీ సిటీస్ సమావేశం జరిగింది. ఒక గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడి ప్రాజెక్టు అది.
మనసు చేసే “మాయ” అనే నిర్మాణాలను దాటి స్పష్టతని ఇచ్చేదే సంయమ. ఎనిమిది రోజుల తరువాత దాదాపుగా తొమ్మిది వందల మందితో జరిగిన సమ్మేళనాన్ని శక్తివంతంగా జరిపించటానికి ఎంతో ప్రాణశక్తి అవసరం. ఆ మధ్యాహ్నమే ఆగస్తా బయలుదేరాము, రాత్రి భోజన సమయంలో మన భారతదేశ ఉన్నత గోల్ఫ్ ఆటగాడైన శుభాంకర్ శర్మను కలుసుకొని, ఆతిధ్యమివ్వటానికి. ఆగస్తాలో తర్వాతి రోజు అదనపు బోనస్సే. మాస్టర్స్ ఆఖరి రోజు ఆట చూసాను. గొప్ప గొప్ప ఆటగాళ్ళు తలపడుతుంటే చూడటం ఒక అద్భుతం. కానీ నేను బెంగళూరు వెళ్లేందుకు సమయం అవ్వటం వల్ల ఆట మధ్యలోనే జాన్ ఎఫ్ఫ్ కెన్నెడీ విమానాశ్రయానికి బయలుదేరాను.

ఇక అక్కడి నించీ తుఫాను వేగంతో సమానమైన ప్రయాణాలు జరిగాయి. అమరావతిలో హ్యాపీ సిటీస్ సమావేశం జరిగింది. ఒక గొప్ప దూరదృష్టి ఉన్న నాయకుడి ప్రాజెక్టు అది. అది ఫలవంతం కావాలంటే ఎన్నో నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలి. అమరావతి వెళ్లి, రావటానికి కొన్ని గంటలే. ఆ తర్వాత ఎంతో పరపతి కలిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ కోసం సింగపూర్ బయలుదేరాను. అసలీ ప్రయాణ ముఖ్యోద్దేశం ఈ కార్యక్రమమే. అమరావతి, కౌలాలంపూర్ మధ్యలో నిర్ణయించబడ్డాయి. కౌలాలంపూర్లో “శాంభవీ దీక్ష” విషయంలో, చాలా మందికి నిరాశని కలుగజేసింది. ఔత్సాహికులు ఎక్కువ మంది వచ్చేసరికి ఆఖరి నిముషంలో దానికి తగిన ప్రాంగణం దొరక్క రెండువేల మంది పట్టే ఒక ప్రాంగణంలోనే “శాంభవి” జరిగింది.

ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం నిజంగా వసుధైక కుటుంబపు కార్యక్రమమే. ప్రపంచంలో ఉన్న దేశాలు, జాతుల వ్యక్తులందరూ అక్కడికి వచ్చారనిపించింది. మెయిన్ లాండ్ చైనా నించి వచ్చిన అనూహ్య స్పందన తూర్పు దేశాల్లో ఈశా విస్తరణని గుర్తుచేసింది. ఆరు రోజుల్లో, నాలుగు దేశాల్లో, పలు కార్యక్రమాలలో పాల్గొనాలంటే, ఎక్కువ విమాన ప్రయాణాలు, ఎక్కువ విమానాశ్రయ సమయం, ఎక్కువ తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్భిణీ వేసిన చూపులు, వారి X-ray కళ్ళు, ఇవన్నీ. వారికి పాస్పోర్ట్ స్టాంపులు తప్ప ఇంకేవీ కనిపించకపోయినా అదే తనిఖీ. సింగపూర్ నించీ ఇక సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళటానికి వేచి ఉన్నాం. ఇక్కడి వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు; కాలిఫోర్నియాలో ఇంకా ఏం చెయ్యగలమో చూడాలి.

ఆంగ్లంలో సద్గురు చెప్పిన వ్యక్తిగత ప్రయాణ వివరాలకు అనువాదం - A Personal Update

ప్రేమాశీస్సులతో,
సద్గురు