విజయాన్ని సాధించటం ఎలా?

విజయం సాధించాలంటే ఏం కావాలనే విషయం మీద సద్గురు చెబుతున్నారు, ఇంకా విజయం సాధించాలనే కోరిక కుడా ఎంత పరిమితమైనదో వివరించారు.
Illustration of a Happy Businessman holding Success Key | The Key To Unlocking Success
 

సద్గురు: ప్రపంచం ప్రకారం, విజయం అంటే మీ పక్క-వారికంటే కొద్ది వేగంగా మీరు పరిగెత్తడమే . నా దృష్టిలో విజయం అంటే అది కాదు. నా వరకూ, విజయం అంటే ‘‘నన్ను నేను సంపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతున్నానా? నాలో ఉన్న సామర్థ్యాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొనే అవకాశాన్ని అన్వేషించగలుగుతున్నానా?’’ ఇది జరగాలంటే, మీకు సరైన అవగాహన మరియు చురుకైన మేధస్సు ఉండాలి. 

‘‘నేను నా మేధస్సును ఎలా పెంచుకోవాలి?’’ దాని గురించి చింతించకండి. ప్రజలు తమ మనసులను విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కేవలం మీరు సామాజికంగా విజయం సాధించేలా చేస్తుంది, నిజమైన విజయాన్నికాదు. మీరు వెంటనే చేయవలసిన ముఖ్యమైన పని మీ ద్రుష్టికోణాన్ని పెంచుకోవడమే. వక్రీకరించకుండా మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే, దాన్ని బాగా నియంత్రించడానికి అవసరమైన మేధస్సు మీకు ఉంటుంది. మీరు జీవితాన్ని ఖచ్చితంగా ఆనందంగా గడపవచ్చు, మీరు జీవితాన్ని బాగా జీవించగలిగితే, మీరు విజయవంతమయ్యారని ప్రజలు చెబుతారు.

మీరు ఏం చూశారు?

ఒకసారి ఇలా జరిగింది. షేర్ లాక్ హోమ్స్ మరియు వాట్సన్ పర్వతాల్లో విడిది చెయ్యటానికి వెళ్ళారు. రాత్రి కావడంతో వాళ్ళు నిద్రపోయారు. అర్ధ రాత్రి, షేర్ లాక్ హోమ్స్ వాట్సన్ని కదిలించగా ఆయన కళ్ళు తెరిచార. షేర్ లాక్ హోమ్స్ అతన్ని అడిగారు, ‘‘మీరు ఏం చూశారు?’’

వాట్సన్ పైకి చూసి  ఇలా అన్నారు, ‘‘ నాకు నిర్మలమైన ఆకాశం మరియు నక్షత్రాలు కనిపించాయి.’’
 
షేర్ లాక్ హోమ్స్ అడిగారు, ‘‘దాని అర్థం ఏమిటి?’’

వాట్సన్ సమాధానం ఇచ్చారు, ‘‘మరొక అందమైన, బాగా ఎండ ఉన్న రేపు. మరి మీకు ఏమి అనిపించింది?’’

షేర్ లాక్ హోమ్స్ అన్నారు, ‘‘మన టెంట్ ని ఎవరో దొంగిలించారని  అర్థమయ్యింది.’’
 
మీరు జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని విజయవంతంగా అధిగమించగలరు, అయితే మీరు జీవితాన్ని ఆ విధంగా చూస్తేనే. లేకపోతే అది తొట్రుబాటు ప్రక్రియ అవుతుంది. విజయం అంటే మీరు ఇతరుల కంటే వేగంగా నడుస్తున్నారని అర్థం. ఇతరుల కంటే మీరు వేగంగా నడుస్తుంటే మరియు మీ ద్రుష్టికోణం మంచిది కాకపోతే, మీరు తప్పకుండా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారుఎందుకంటే మీరు ప్రతీదానితో ఢీ కొట్టాలని చూస్తున్నారు.

మీరు దేనినైనా విజయవంతంగా చేయాలంటే, మీ అర్హత లెక్కలోకి రాదు. మీ చుట్టూ ఉన్న యథార్థ  సంఘటనల పట్ల మీ ద్రుష్టికోణ స్పష్టతపై ఆది ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు దీనిని సరిగా చూస్తే, మీరు ఇప్పుడు లాటరీ టిక్కెట్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు. మీరు రేపటిని చాలా స్పష్టంగా చూస్తే, రేపు తిరిగి అమ్మడానికి మీరు ప్లాన్ ని కొంటున్నారు. మీరు 50 సంవత్సరాల తరువాతను చాలా స్పష్టంగా చూస్తే, మీరు పూర్తిగా భిన్నమైన పనులే చేస్తారు.

తప్పు సమయంలో తప్పు పని

బాగా అర్హత, మేధస్సు మరియు సామర్థ్యం గల ప్రజలు కూడా విఫలమైన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కొన్నిపనులను తమ జీవితంలో కొన్ని సందర్భాలలో గ్రహించడంలో విఫలమవుతారు. మీరు తప్పు ఆస్తిని తగని సమయంలోకొంటారు. మీరు తగని సమయంలో సరికాని వ్యాపారం చేస్తారు. మీరు తప్పు పనిని చెయ్యటానికి అనర్హుల్నిఎన్నుకుంటారు. ఇదంతా వైఫల్యమే మరియు ఇది విజయం కూడా.

విజయవంతమైన ఎంతోమంది అసాధారణమైన మేధావులు కాకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టికోణంలో స్పష్టత ఏర్పరచుకునారు. మీరు మాట్లాడే విషయాన్ని అప్పటికప్పుడే వారు గ్రహించి, మీకు సరైన రీతిలో సమాధానాన్ని ఇవ్వగలరు.
 
కాబట్టి, విజయాన్ని కాంక్షించకండి, సమర్థతను కాంక్షించండి. మీరు ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో చూడండి. మీరు గొప్ప సామర్ధ్యం కలవారైతే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాగైనా విజయాన్ని సాధిస్తారు. మీరు అసాధారణ సామర్థ్యం కలవారైతే, మీరు మీ సమర్థతలో ఒక స్థాయిని చేరగలిగితే,  మీరు విజయాన్ని లక్ష్యంగా చూడవలసిన అవసరము లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినవిజయమే మీ వెంట వస్తుంది.

ఒక మనిషి గొప్ప శక్తి సామర్థ్యాలను పెంచుకొని ఎదిగితే, ప్రపంచం మొత్తం అతను లేదా ఆమెను కోరుకుంటుంది. మీలో గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి, మీరు ప్రపంచంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ప్రజలే మీ చెంతకు వస్తారు.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1