నవరాత్రికి ముందురోజు మహాలయ అమవాశ్య – మనం మన పూర్వికులకు మన కృతజ్ఞతలు తెలుపుకునే దినం. ఆరోజు ప్రత్యేక అగ్ని అర్పణ, కాల బైరవ శాంతి జరుగుతాయి.

నవరాత్రి ఉత్సవాల్లో కేంద్రబిందువు లింగ భైరవి. భారతీయ సంస్కృతిలో దేవిని పూజించడం ఎప్పుడూ ఉన్నదే. నవరాత్రి అంటే దేవి మూడు ప్రధాన రూపాలు దుర్గ, లక్ష్మి, సరస్వతులను కొలవడం. దానికి తగ్గట్లే, నవరాత్రి సమయంలో, లింగభైరవి మూడు రోజులకు ఒకటి చొప్పున మూడు రూపాలు తీసుకుంటుంది. నవరాత్రి ప్రతిరోజూ, దేవికృపను అందుకునేందుకు అవకాశమిచ్చే నవరాత్రి పూజ జరుగుతుంది. నవరాత్రి పూజ తరువాత లింగభైరవి ఊరేగింపు, మహా ఆరతి జరుగుతాయి.

నవరాత్రి తరువాత దినం విజయదశమి నాడు, పిల్లల విద్యారంభానికి మంచి రోజుగా భావింపబడుతుంది. పిల్లలకు విద్యారంభం కార్యక్రమం జరుగుతుంది, ఆతరువాత ఆశ్రమం చుట్టూ ఉన్న గ్రామీణ బాల బాలికలకు ప్రత్యేక విద్యారంభ కార్యక్రమం జరుగుతుంది.