పదాలకు భావపరంగా విలువ ఉంటుంది. అయితే వాయిద్య సంగీతం కొన్ని సార్లు భాష సృష్టించలేని అనుకూల వాతావరణాన్ని సృష్టించగలదు. "సౌండ్స్ ఆఫ్ ఈశా" సృష్టించిన అనేక వాయిద్య సంగీత పాటలు వివిధ వాతావరణాలను సృష్టించటానికి (లేక సృష్టించటానికి చేసిన ప్రయత్నంలో) రూపొందించబడ్డాయి. మధ్యమావతి వీటన్నిటి కంటే మనోహరమైనది. ఈ పేరు ఈ పాట ఆధారపడి ఉన్న రాగాన్ని సూచిస్తుంది.

ఈ పాట ఒకే ఒక ప్రాక్టీస్ క్లాస్ యొక్క ఫలితం. మొదట వేణువుతో ఆరంభించి ఒక  పాట సృష్టించడం మొదలుపెట్టాం. దానికి తోడుగా మా వాలంటీర్లలోని ఇంకొంతమంది ఇతర వాయిద్యకారులు జతకట్టారు. దాని ఫలితమే మీరు వినే ఈ పాట.

ఈ పాట ద్వారా ఏదో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని  సృష్టించాలను కోలేదు. కానీ మా అనుభవంలో ఇది భావాత్మకంగా, ధ్యానానుగుణంగా ఉంటుందని, ప్రశాంత, స్థిమితతలను చేకూర్చే వాతావరణాన్ని కలిగిస్తుందని అనిపించింది. ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం.

ఈ పాటను వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి -

మధ్యమావతి - యూ ట్యూబ్ వీడియో

ఈ పాటను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి -

 మధ్యమావతి డౌన్‌లోడ్


 

ఎడిటర్ మాట: మరింత గొప్ప సంగీతం కోసం Sounds of Isha on Youtube చూడండి.