Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఓ సంపూర్ణ మానవుడిగా ఉండటం అంటే, మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని, ప్రతీ క్షణాన్ని పూర్తిగా జీవించడం.
ధ్యానం అంటే శ్రద్ధ పెట్టడం కాదు, విశ్రాంతి తీసుకోవడమూ కాదు. ఇది ఒక విధంగా స్వస్థానానికి చేరుకోవడం లాంటిది.
ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేది ఈ జీవితాన్ని సునాయాసంగా నడవగలిగే శక్తి సామర్థ్యాన్నిస్తుంది.
మీలో మానవత్వం పరిఢవిల్లితే, మీరు మీ చుట్టూ ఉన్న జీవం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇది నైతికత కాదు - మనిషి స్వభావం ఇది.
జీవితాన్ని తెలుసుకోవడానికి మీకున్న ఏకైక ద్వారం మీరే. దాన్ని తెరిచి ఉంచండి.
మనిషి ఒక వనరు కాదు. మానవుడో బ్రహ్మాండమైన అవకాశం. సరైన పోషణతో, వారు అద్భుతమైన వారిగా వికసిస్తారు.
ఇది చాలా ముఖ్యం, దేనిని హెచ్చించి చూడకూడదు, అలా అని దేనిని చిన్నచూపు చూడకూడదు. ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్టుగా చూడడమే నిజమైన దృష్టి.
కేవలం మీ భౌతిక శరీరానికి మాత్రమే హద్దులు అవసరం. మీకు సంబంధించిన మిగతావన్నీ కూడా విశ్వవ్యాప్తంగా ఉండొచ్చు.
మీ గతమో లేదా భవిష్యత్తో మిమ్మల్ని బాధ పెట్టలేవు, ఎందుకంటే అవి ఉనికిలో లేవు. మీరు బాధ పడుతున్నది మీ జ్ఞాపకాలు ఇంకా ఊహాలతోనే.
మీలోని జీవం ఉన్నది మీ శరీరం, మనస్సు ఇంకా భావోద్వేగాలకు సేవ చేయడానికి కాదు. మీ శరీరం, మనసు ఇంకా భావోద్వేగాలే జీవానికి సేవ చేయడానికి ఉన్నాయి.
జీవితం అందంగా ఉండేది అది సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే.
పరికరాల పరంగా చూస్తే, కంప్యూటరో, కారో లేదా అంతరిక్ష నౌకో కాదు, మానవ మనస్సే అత్యంత అద్భుతమైనది - మీరు దానిని స్పృహతో వినియోగించుకుంటే.