Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
అభిప్రాయాలు కంటి శుక్లాల వంటివి. అవి మిమ్మల్ని సరిగా చూడనివ్వవు.
ఏది ఎంచుకోవాలో మీకు తెలియనప్పుడు, ప్రతిదానిలోనూ పూర్తి సంలగ్నత చూపించండి. అప్పుడు జీవితమే ఎన్నుకుంటుంది, అది ఎప్పటికీ పొరబడదు.
ఏదైనా ఒక అద్భుతాన్ని సృష్టించాలంటే గొప్ప తెలివితేటలూ, అర్హతలూ అవసరం లేదు. మీరు చేయాలనుకున్న దానిపట్ల సంపూర్ణ అంకిత భావం ఉంటే చాలు.
జీవితంలో అతి ముఖ్యమైన అంశం సమతుల్యత. సమతుల్యత లేకపోతే మీ మనః శరీరాలే మీకు వ్యతిరేకంగా పని చేస్తాయి.
విజయదశమి విజయం సాధించడాన్ని వేడుకలా జరుపుకుంటుంది. మీ పరిమితులపై మీరు విజయం సాధించినప్పుడు మాత్రమే జీవితం యొక్క అద్భుతమైన స్వభావం వ్యక్తమవుతుంది.
ఎవరైతే కేవలం జ్ఞానం మాత్రమే కాక, శరీరం యొక్క పరిమితులను అధిగమించాలని కాంక్షిస్తారో, సహజంగానే వారు దేవీ యొక్క సాత్విక అంశాన్ని ఆశ్రయిస్తారు. ఆ సాత్వికతకు సాకార రూపం సరస్వతి దేవి.
మాటి మాటికీ వెనక్కు తిరిగే వ్యక్తి, అసలు ఎక్కడకూ వెళ్ళే ఉద్దేశ్యం లేనివాడని అర్థం.
మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఉపయోగించే వస్తువులు ఇంకా మన జీవితానికి ప్రతిక్షణం తోడ్పడే ప్రతీ జీవం పట్లా మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి.
ప్రపంచంలో జరుగుతున్నది మీరు కోరుకున్న విధంగా లేకపోయినా, కనీసం మీలో జరుగుతున్నదైనా మీరు కోరుకున్న విధంగా ఉండాలి.